ప్రణాళిక ఉండాలి

ఇల్లు, ఆఫీసు బాధ్యతలు

Working women
Working women

ఇల్లాలిగా బాధ్యతలు చక్కబెట్టుకుంటూనే ఆఫీసులో ఉద్యోగినిగా తన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించాల్సిన మహిళలు ఎదుర్కొనే సమస్యలు చాలానే ఉన్నాయి.

దాంతో ఒత్తిడి, చిరాకు, కోపం, అలసటా వంటివి ఉండటం సహజమే.

వాటినీ అధిగమించాలంటే ఇంటిపనీ, ఆఫీసు విధులకు మధ్య ఖచ్చి తంగా స్పష్టమైన విభజన గీత ఉండాలి. ఇంట్లో ఆఫీసు పనులు, ఆఫీసులో ఇంటి చికాకులు పెట్టుకోవడం వల్ల రెండింటిపైనా సరైన దృష్టి పెట్టలేకపోతారు.

ఇలాంటి పరిస్థితిని నుండి కొంత ఉపశమనం పొందేందుకు ప్రయత్నించాలి.

కొంత సమయాన్ని నిర్దేశించుకుని ఈ రెండింటిని ఒక దారిలో పెట్టుకోవాలి. ఒక్కరోజులోనే అంతా సాధ్యం కాదు. అయినా పక్కా ప్రణాళికతో మొదలు పెడితే నెమ్మదిగా అలవాటు అవుతుంది.

అలసటా తగ్గుతుంది. అన్ని పనులు విరామం లేకుండా చేసేస్తుంటాం. దాంతో కూడా మనకు తెలియకుండానే ఒత్తిడికి లోనవుతాము.

ఇలాంటి సమస్యను అధిగమించాలంటే అప్పుడప్పుడూ ఏ పని చేయకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. అందువల్ల విశ్రాంతి కలుగుతుంది. ఉత్సాహంగా పనిచేసే శక్తి శరీరానికి అందుతుంది.

అయితే ఇవన్నీ చేయాలంటే ముందు ఇంట్లో వాళ్లందరి మధ్య సరైన పని విభజన జరగాలి.
ఏ పనైనా సరే కాదనుకుండా చేయడం ఆత్మవిశ్వాసమే.

కాని కొన్నిసార్లు చేయలేని పనులు కూడా చేయాల్సి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎదుటి వారు మీ నుంచి మరిన్ని పనుల్ని ఆశిస్తారు.

ఉత్పాదకత, నాణ్యత తగ్గడమే కాదు ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే చేయలేని పనిని నిరభ్యంతరంగా ఒప్పుకోవద్దు.

నా వల్లకాకపోవచ్చు అని నిర్మొహమాటంగా చెప్పడం తప్పు కాదు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/