సహనంతో ప్రాణాలు వదిలిన సన్యాసి

SHIRDI SAI
SHIRDI SAI

సాయిబాబా బోధించిన శ్రద్ధ, సహనాల పరిధి ఎల్లలు లేనిది. ఉదాహరణకు ‘సహనం అనే పదాన్ని తీసుకుంటే హద్దులు లేనిదిగా కనిపిస్తుంది. ‘సహనం సద్గుణాలకు గని అంటారు సాయిబాబా రాధాబాయి దేశముఖ్‌తో. సాయి పలికిన మాట అన్ని మతాలకు, అన్ని కాలాలకు వర్తిస్తుంది. ఒకరోజు రాత్రి వచ్చిన తుపానుకు ధర్మశాల గోడ పడిపోయింది. నానక్‌ తన కుమారులను, శిష్యులను పిలిచి గోడను కట్టమని ఆదేశించారు. ఆ ఎముకలు కొరికే చలిలో ఎవరు సాహసిస్తారు? పైగా అది పగలుకాదు, రాత్రి. ఇంకా తుపాన్‌ తగ్గనే లేదు. నానక్‌ కుమారులు తెల్లవారిన తరువాత పనివారలను పిలిచి గోడకట్టించుకుందాం అన్నారు. తండ్రియైన నానక్‌తో ‘నాకు పనివారు అక్కరలేదు. నాకు ఇక్కడ అనుయాయులున్నారు అన్నారు నానక్‌. లెహన్‌ అనే పేరుగల శిష్యుడు వెంటనే పనికి ఉపక్రమించాడు. పని పూర్తి చేశాడు. ఆ గోడను గురునానక్‌కు చూపించాడు. నానక్‌ ఆ గోడను చూచాడు. ‘వంకరగా ఉన్నది. పడగొట్టికట్టు అన్నాడు గురువ్ఞ. లెహన్‌ వెంటనే ఆ గోడను పగులగొట్టాడు. కష్టమనుకోక మరల ఆ గోడను పునర్నిర్మించాడు శిష్యుడైన లెహన్‌. ఈసారి కూడా గురునానక్‌ గోడను పరిశీలించాడు. ‘ఈసారి కూడా గోడ వంకరగానే ఉన్నది అన్నాడు నానక్‌. లెహన్‌ దగ్గరకు వచ్చి నానక్‌ కుమారులు ‘చాలులే అన్నట్లు మాట్లాడారు. గురువ్ఞలకు గౌరవం ఇవ్వాల్సిందే. కాని గురు ఆజ్ఞను పాటించక, గురువ్ఞ పుత్రుల ఆదేశాన్ని పాటించదలచుకోలేదు లెహన్‌. మరల మూడోసారి లెహన్‌ విసుగులేకుండా గోడను కట్టాడు. ఈసారి కూడా గోడను పరీక్షించాడు గురులైన నానక్‌. ఏ వంకను పెట్టలేదు. గురువ్ఞ అంగీకారంతో ఆ గోడను అలాగే ఉంచాడు లెహన్‌. అతిక్లిష్టమైన దినాలలో సిక్కు మతానికి గురువ్ఞగా ఉండాలనుకునేవారికి అంతటి సహనం కావల్సి వస్తుంది. గురునానక్‌ ఆ సంఘటన ద్వారా చెప్పాడు ఇటుకుమారులకు, అటు లెహన్‌కు. గురునానక్‌ తన కుమారులను కాదని గురుత్వాన్ని లెహన్‌కే ఇచ్చాడు. బౌద్ధమతానికి చెందిన ఒక భిక్షువ్ఞ ఒక రాజునకు బోధ చేస్తున్నాడు. రాజు అసూయాపరుడు. సన్యాసి (భిక్షుడు) బోధించిన విషయాన్ని గూర్చి పదేపదే అడగసాగాడు. చిరాకుపడకుండా ప్రతిసారి సమాధానం చెప్పసాగాడు సన్యాసి.
మాటలతో సహనం అనే పరల సన్యాసి నోటికి వెంట రాగా, దాని అర్ధమేమిటని రాజు ప్రశ్నించాడు. ‘తిట్టినను కొట్టినను, గాయపరచినను ఓర్పుతో ఉండటం అన్నాడు సన్యాసి. సన్యాసిని పరీక్షించదలచుకొన్నాడు రాజు.
రాజు తలచుకుంటే కొరడా దెబ్బలకు కొదువా? ముండ్ల కొరడాతో మూడువేలసార్లు సన్యాసిని కొట్టించాడు. సంయమనం పాటించాడు సన్యాసి. ముక్కు చెవ్ఞలు కోచించాడు. సన్యాసి కోపగించుకోలేదు. ‘రాజుకు చిరాయువ్ఞ కలుగుగాక అంటూ దీవించి వెళ్లిపోయాడు. మరునాడు సన్యాసి మరణించాడు. అదే సహనం అంటే.

  • యం.పి.సాయినాధ్‌