వ్యాయామంతో ఆకృతి, ఆరోగ్యం

Shape and health with exercise

నేనంటే నాకే అసహ్యం వేస్తోంది. మనిషి జానెడు పొట్ట బారెడు అన్నట్టుగా వ్ఞంటాను నేను. కొందరు 60లో 20లా వ్ఞంటే నేను 40లోనే 60లా కనిపిస్తున్నాను. నా భర్తను తమ్ముడుగా కొడుకుగా మనుషులు భ్రమిస్తున్నారు. నేను రోడ్డుపై నడుస్తుంటే చిన్నసైజు రోడ్డురోలర్‌లా కనిపిస్తున్నాను. ఇంట్లో ఏ పని చేసుకోలేకపోతున్నాను. తల, మెడనొప్పి, కాళ్లు, చేతులు లాగడం, నీరసం, నిస్సత్తువ నన్ను వీడి వెళ్లనంటున్నాయి. గ్యాస్ట్రిక్‌ ట్రబుల్‌, గుండెల్లో మంట, నిద్రలేమి, కోపం, చికాకు అన్నీ ఆవహించి బాధిస్తున్నాయి. ఇంత నరకయాతన భరించడం కంటే చావడం మేలనిపిస్తోంది. ఆత్మహత్య చేసుకుంటే కుటుంబ పరువ్ఞపోతుందని ఆ ప్రయత్నం మానేశాను. అయితే రోజు నిద్ర లేవగానే ‘స్వామీ నన్ను త్వరగా తీసుకెళ్లు అంటూ దేవ్ఞని ప్రార్థిస్తున్నాను. నా వయసు 42 ఏళ్లు. ఎత్తు ఐదు అడుగులు. బరువ్ఞ 80 కిలోలు. 10వ తరగతి వరకు చదువుకున్నాను. 20 ఏళ్ల వయసులో మా బంధువ్ఞల అబ్బాయితో నా పెళ్లి చేశారు. అత్త, ఆరళ్లు, భర్త నిరక్ష్యం మధ్య నలిగిపోతూనే రెండేళ్లలో ఓ మగబిడ్డకు తల్లినయ్యాను. కాన్పు కష్టం కావడంతో సిజేరియన్‌ తప్పలేదు. ఓ బిడ్డకు తల్లయినా అత్తకు కోడలిగా అణిగి, మణిగి, అష్టకష్టాలు పడుతూనే బతుకు సాగిస్తున్నాను.

మా అత్త నన్ను, నా భర్తను సుఖపడనీయదు. మేం సినిమాకు వెళితే తను కూడా వస్తుంది. గుడికి వెళితే వెంటబడుతుంది. ఇద్దరినీ ఏకాంతంగా గడపనీయదు. దీనివల్ల దాంపత్య జీవిత మాధుర్యం అందని పండ యింది. అనుకోకుండా 15 ఏళ్ల తర్వాత అంటే 37 ఏళ్ల వయసులో మళ్లీ గర్భవతినయ్యాను. అప్పటికే రకరకాల శారీరక రుగ్మతలతో బాధపడుతున్నందువల్ల చాలా కష్టపడవలసి వచ్చింది. ప్రసవ సమయం లో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. చావు అంచుల వరకు వెళ్లి తిరిగి వచ్చాను. పెద్దాపరేషన్‌ చేసి బిడ్డను బయటకుతీశారు. అప్పటి నుంచి నా ఆరోగ్యం మరింత క్షీణించింది. రోజురోజుకు బరువ్ఞతోపాటు రుగ్మతల తీవ్రత పెరుగుతున్నది. ఈమధ్య తీవ్రమైన రక్తపోటుకు గురయ్యాను. డాక్టర్లు బరువ్ఞ తగ్గమంటారు. అలాగే ఒత్తిడిని తగ్గించుకోమని సలహాలు ఇస్తున్నారు. నడవడమే కష్టమైన స్థితిలో బరువు తగ్గడం ఎలాగో అర్ధం కావడం లేదు. అలాగే ప్రతికూల పరిస్థితులలో ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలో తెలియడం లేదు. ఈ దశలో నా సమస్యలకు చక్కని పరిష్కారం చూపగలరు. –
—-గౌరీదేవి, గుంటూరు

అమ్మా, మన సమాజంలో మీలాంటి వారు చాలామంది వ్ఞన్నారు. బాధల్ని తలచుకుంటూ కుమిలిపోవడం అలవాటు పడుతున్నారు. అలాగే ప్రసవ సమయంలో సిజేరియన్లు చేయడం వల్ల బరువు పెరిగిపోయామని చెపుతుంటారు. నిజానికి ఈ రెండూ అశాస్త్రీయమైన నమ్మకాలే. ఇంట, బయట అనేక సమస్యలు ఎదురవ్ఞతుంటాయి. అత్తమామ, భర్త, ఆడపడుచులతో మనస్పర్థలు వస్తుంటాయి. అంత మాత్రాన అవన్నీ విూకొకరికే వ్ఞన్నాయని భావించకండి. అలాగే వాటికి పరిష్కారాలు లేవని నిరాశపడకండి. విూకున్న సమస్యలు సమాజంలో చాలామందికి ఎదురవ్ఞతుంటాయి. వాటి నుంచి బయటపడటానికి మార్గాలు అన్వేషించండి. సానుకూలంగా ఆలోచిస్తే పరిష్కారాలు స్పురిస్తాయి. కొన్ని సందర్భాలలో స్వీకరించడం, మరికొన్ని సందర్భాలలో సర్దుకోవడం, ఇంకొన్ని సందర్భాలలో తప్పుకోవడం వల్ల మనసు కుదుటపడుతుంది. అలాగే సమస్యలను తట్టుకోవడం లేదా పట్టించుకోకపోవడం అలవర్చుకుంటే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

మీకు ఇష్టమైన వారితో గడపడం, అభిరుచులను ఏర్పరచుకోవడం ద్వారా కూడా ఒత్తిడిని అధిగమించవచ్చు. అలాగే ఒత్తిడితోపాటు బరువ్ఞను, శారీరక రుగ్మతలను తగ్గించుకోవడానికి చాలా మార్గాలు వ్ఞన్నాయి. శారీరరక వ్యాయామంతో ఆకృతి, ఆరోగ్యం స్వంతమవ్ఞతాయి. నిత్యం చిన్నచిన్న వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలో జీవరసాయన చర్యలు (మెటబాలిజం) వృద్ధి పొంది ఆరోగ్యం మెరుగవ్ఞతుంది. అలాగే క్రమబద్ధమైన వ్యాయామాలు చేస్తే బరువ్ఞ తగ్గడంతోపాటు శరీర ఆకృతి మెరుగవ్ఞతుంది. సహజంగా మానసిక ఒత్తిడి పెరిగినపుడు ఒత్తిడి కారకమైన ఆడ్రినలిక్‌, కార్డిసాల్‌ అనే ప్రతికూల రసాయనాలు ఎక్కువగా విడుదల అవ్ఞతాయి. వ్యాయమం చేయడం వల్ల సానుకూల రసాయనాలైన ఎండార్ఫిన్లు, డోపమైన్‌ అనే హార్మోన్లు విడుదల అవ్ఞతాయి. అలాగే ఇష్టమైన పనులు చేయడం, ఇష్టమైన వారితో గడపడం వల్ల సెరటోనిన్‌, ఆక్షిటోసిన్‌ అనే హార్మోన్లు విడుదల అవ్ఞతాయి. ఈ నాలుగు హార్మోన్ల వల్ల ఒత్తిడి బాగా తగ్గిపోతుంది.
అలాగే నొప్పులు తగ్గి నిద్ర బాగా పడుతుంది. అంటే వ్యాయామం కూడా ఔషధం లాగా పనిచేస్తుంది. అయితే సమస్య తీవ్రంగా వ్ఞన్నప్పుడు మాత్రం డాక్టర్లను సంప్రదించి మందులు వాడాల్సి ఉంటుంది. ఇక శరీర బరువు తగ్గడానికి వ్యాయామమే చక్కని మార్గం. వ్యాయామాలలో పలురకాలు ఉన్నాయి.

ఏరోబిక్స్‌, యోగాసనాలు, జిమ్‌, క్రీడలు, నడక, పరుగులాంటి వాటిలో విూకు అనువైన వాటిని ఎంచుకుని రోజు అర్ధగంట నుంచి కనీసం ఒక గంటసేపు చేయడానికి ప్రయత్నించండి. విూరు ఇప్పుడున్న స్థితిలో అంతసేపు చేయడం కుదరదు కనుక పది,పదిహేను నిమిషాలు చేయడానికి ప్రయత్నించండి. వారానికొక ఐదు, పదినిమిషాలు పెంచుకోవచ్చు. మీ శరీరం అందించే సహకారం, అలసటకు గురయ్యే తీరునుబట్టి ఎంతసేపు చేయవచ్చన్నది ఫిట్‌నెస్‌, యోగ కేంద్రాల కెళ్లి సలహా తీసుకుంటే మంచిది. అలాగే డాక్టరును కలసి పరీక్షలు చేయించుకుని వారి సలహాలను పాటించండి. దీనితోపాటు సమతుల ఆహారం, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోండి. నూనె పదార్థాలు, తీపి ఉప్పు జంకుపుడ్‌కు దూరంగా వ్ఞండండి. సానుకూలంగా ఆలోచించి, స్వయం ప్రేరణ పొంది, క్రమబద్ధమైన జీవనశైలిని ప్రారంభించండి. భర్త, పిల్లలతో సరదాగా గడపడానికి ప్రయత్నించండి. విూ అత్త, మామలతో సఖ్యత పెంచుకునే ప్రయత్నం చేయండి. మీరు డాక్టర్లను సంప్రదించి, నిపుణుల సలహాలతో వ్యాయామ ప్రక్రియలు ప్రారంభిస్తే మూడు నుంచి ఆరు నెలల లోపుగా చక్కని ఆకృతి, ఆరోగ్యం మీ స్వంతమవ్ఞతాయి.

  • డాక్టర్‌ ఎన్‌.బి.సుధాకర్‌రెడ్డి, సైకాలజిస్టు

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/