కరచాలనం ప్రాముఖ్యత

Shaking Hands

అమ్మాయిలైనా అబ్బాయిలైనా పెద్దలైనా కలుసుకున్న వెంటనే షేక్‌హ్యాండ్‌ ఇచ్చుకవడం చాలామందికి అలవాటు. ఆంగ్లభాషలో షేక్‌హ్యాండ్‌గా పిలిచే కరచాలనం వెనుక ఇంతటి ప్రాముఖ్యం ఉందా అంటే…ఉందనే అంటున్నారు అమెరికాకు చెందిన ఒక శాస్త్రవేత్త. అమెరికా దేశానికి చెందిన బర్డ్‌విష్టల్‌ అనే పరిశోధకుడు బాడీ లాంగ్వేజ్‌ అనే అంశంపై చేసిన పరిశోధనల్లో అనేక విషయాలు వెలికితీశాడు. ఎట్టకేలకు 1940లో ఈ బాడీ లాంగ్వేజ్‌కు అర్థాన్ని తీసుకొచ్చాడు. ప్రస్తుత స్పీడ్‌యుగంలో ప్రతి ఒక్కరూ బాడీ లాంగ్వేజ్‌ను అనుకరిస్తున్నారంటే అతిశయోక్తి లేదు.
చేతితో భుజాన్ని తడితే అది ఆప్యాయతను సూచిస్తోంది.
షేక్‌హ్యాండ్‌ చేస్తూ ఎదుటి వ్యక్తి మోచేతిని పట్టుకుంటే ఆప్యాయతను ఎక్కువ పంచినట్టవ్ఞతుంది.
మన రెండు చేతులతో అవతలి వ్యక్తి చేతిని పట్టుకుంటే బాడీ లాంగ్వేజ్‌ ప్రకారం అతనిపై మనకున్న ఆప్యాయత ప్రేమాభిమానాలను తెలియజేస్తుంది.
ఎదుటి వ్యక్తి భుజం చుట్టూ చేయి చేస్తే సంతోష పూర్వక ఆప్యాయతలను ప్రదర్శించినవారమవ్ఞతాం.
నిర్లిప్తత: అరచేతిని అంటీ అంటనట్టుగా కరచాలనం చేయడమంటే అవతలి వ్యక్తిపై నిర్లిప్తతను కనబరిచే అర్థం వస్తుంది.


మానసిక స్థితి:

తడిచేతులతో అవతలి వ్యక్తితో కరచాలనం చేయడమంటే మన మానసిక స్థితి సరిగా లేని అర్థాన్ని సూచిస్తుంది.
అహం: తన అరచేతిని నేలవైపునకు ఉంచి ఒక వ్యక్తి కరచాలనం చేస్తున్నాడంటే…అతడిలో అహం ఉందన్న అర్థాన్ని సూచిస్తోంది.

తక్కువస్థాయి:

తన అరచేతిని పై వైపునకు తిప్పి కరచాలనం చేశాడంటే ఎదుటి వ్యక్తి కంటే తక్కువ స్థాయిలో ఉన్నట్టుగా లోలోన కుమిలిపోతున్నాడనే అర్థాన్ని సూచిస్తుంది.

ఒకేస్థాయి:

‘నువ్వా నేనా అనే అర్థం వచ్చేలా ఒకేస్థాయి గల ఇరువ్ఞరి వ్యక్తులు చేసుకునే కరచాలనం ప్రత్యేకంగా ఉంటుంది. కరచాలన ప్రారంభంలోనే ఇరువ్ఞరూ తమ ఆధిక్యతలను ప్రదర్శించటానికి ఆరాటపడతారు. ఇందులో భాగంగా అరచేతిని నేలవైపునకి ఉంచటానికి ప్రయత్నిస్తారు. సాధ్యపడకపోతే చివరకు ఇద్దరూ తమ అరచేతులను నిటారుగా ఉంచటానికి శతవిధాలా ప్రయత్నిస్తారు.

మొరటుతనం:

నేరప్రవృత్తి స్వభావం…కుట్రలు, కుతంత్రాల బుద్ధిగల వారు చేసే కరచాలనం చాలా మొరటుగా ఉంటుంది. అరచేతిని పిండి పిసికినట్లుగా గట్టిగా నొక్కేయడం కూడా బాడీ లాంగ్వేజ్‌ ప్రకారంపై అర్థాన్ని సూచిస్తుంది.

దాపరికలేమి:

మన దగ్గర దాపరికమేమీ లేదనడానికి దాచిన రెండు అరచేతులు అర్థం చెబుతుంది. అదే రెండు అరచేతులు ఎదుటి వ్యక్తితో కరచాలనానికి దిగాయంటే… ఇద్దరమూ ఒకటేననే భావనను తెలియజేస్తుంది.
ప్రస్తుత యాంత్రికయుగంలో ఇంతటి భావాలకు విలువిచ్చే తీరిక లేకున్నప్పటికీ పొరుగు దేశాల పాలకులు మనదేశానికి వచ్చినప్పుడు, ఇక్కడి వారు అక్కడికి వెళ్లినప్పుడు మాత్రం నేటికీ బాడీ లాంగ్వేజ్‌ ప్రకారం నడచుకుంటారనేది పరిశోధకుల అభిప్రాయం.