ఆత్మవిశ్వాసంతో సవాళ్లపై గెలుపు

HEALTHY LADY2
HEALTHY LADY2

ఆత్మవిశ్వాసంతో సవాళ్లపై గెలుపు

ప్రవర్తన ఏ విధంగా ఉంది వంటి విషయాలు మదింపు చేసుకుంటే నైతికంగా బలం పెరుగుతుంది. జీవితంలో అనుకున్న రంగాలన్నింటిలోనూ తగిన సమర్థత, చాలినంత జ్ఞానం, విజ్ఞానం సాధించితీరాలి. ఊహించుకున్న భయాలు ఒత్తిడిని పెంచుతాయి. నేననుకున్నదేదీ జరగడం లేదు. వారసత్వంగా జబ్బులు వస్తాయేమో, త్వరగా చనిపోతానేమో, నేను చాలా దురదృష్టవంతుడిని, మా అబ్బాయి ఖచ్చితంగా నా కొంప ముంచుతాడు. నేను మరో కులంలో పుట్టి ఉంటే ఇన్ని సమస్యలుండేవికావు లాంటివన్నమాట.

సాధన చేయడం ద్వారా నైప్ఞణ్యాలు బాగా అభివృద్ధి చెందుతాయి. నైప్ఞణ్యాలను అభ్యాసం చేస్తూ పోతే అది మనిషిలో ఒక భాగం అవ్ఞతుంది. చివరకు అది శక్తిగా మారుతుంది. మీరు ఏ రంగంలో రాణించగలరో ఆ రంగంపై దృష్టిసారించి పనిచేయడం మొదలుపెట్టండి.

ఆ దిశగానే మీ కృషిని విస్తృతపరిస్తే అదే మీకు భవిష్యత్తులో విలువైన ఆస్తి కాగలదు. ఆందోళన, పోటీ వాతావరణం కారణంగా అన్ని రంగాల్లో ఒత్తిళ్ళు, విపరీతమైన స్వార్ధపరత్వం వంటివి వ్యక్తులపై తీవ్ర ప్రభావాన్ని చూప్ఞతున్నాయి. ఒత్తిళ్ళు, ఆందోళనలు, ఆగ్రహావేశాలు వంటివి కుటుంబంలో తరాలు అంతరాలు లేకుండా అందరిలోనూ వ్యాపిస్తున్నాయి.

ద్వేషం, అసూయ కోసం అనవసరంగా శక్తిని వృధాచేయకండి. ప్రతివారికీ రోజులో ఉండేది ఇరవై నాలుగు గంటలే. గెలిచేవారు ఈ ఇరవై నాలుగు గంటల్లో అధిక భాగం వినియోగించుకుంటూ కష్టపడతారు. అపజయం పొందేవారు ఈ ఇరవై నాలుగు గంటల్లో అధిక భాగం ఎలా కష్టపడాలా అని ఆలోచిస్తుంటారు. ఒక పనిని గురించి తెలుసుకోవడం వివేకం. ఆ పని ఎలా చేయాలో తెల్సుకోవడం నైప్ఞణ్యం. ఆ పనిని విజయవంతంగా పూర్తిచేయడం విజయం. అతి నిద్ర, భయం, బద్దకం, కోపం, అహం, నిరాశావాదం వంటివాటిని దరి చేరనీయకపోతేనే అప్ఞరూప విజయాలు మీ సొంతం కాగలవ్ఞ. అందుకే అన్నారు పోరాడాలనుకొంటే మీ మనసుతో పోరాడండి.

గెలవాలనుకుంటే మీ మనసుని గెలవండి. నిరంతరం వెలిగే సూర్యుడ్ని చూసి చీకటి భయపడినట్లు నిరంతరం శ్రమించే మనిషిని తాకటానికి ఓటమి భయపడుతుంది. విజయం సాధించాలంటే పట్టుదల, అనుభవం, ధైర్యం అవసరం. గెలవకపోవటం ఓటమి అయితే తిరిగి గెలిచేందుకు ప్రయత్నించకపోవడమే పెద్ద పరాజయం. ముందు చూప్ఞతో మనం దేనినైనా సాధించగలం. ప్రతిరోజూ ఉదయం కనీసం పదిహేను నిమిషాలు మీ ఆత్మావలోకానికి వెచ్చించండి. అది మీకు ఉత్తేజాన్ని కలిగించడానికి ఉపయోగపడుతుంది. హృదయం ఉత్తమ బోధకుడు. కాలం ఉత్తమ గురువ్ఞ. జీవిత పరమార్థం ఇప్పటి దాకా సాధించిన విజయాల కోసం చేసిన పోరాటం, వచ్చిన అపజయాలు మళ్ళీ రాకుండా జాగ్రత్తపడడం. ప్రపంచంలోని ఏ వ్యక్తుల విజయాలను తీసుకున్నా వాటికి కారణం వ్యక్తులు తీసుకున్న సాహసోపేత నిర్ణయాలే.

ఎవరు మాట్లాడుతున్నా వారి మాటలలోంచి కొంత జ్ఞానాన్ని పొందే నేర్పు, ఎవరు ఏది చెప్పినా, ఎప్పుడు ఏది చదివినా దానిని మనసులో పదిలపరచుకొని అవసరానికి ఉపయోగించే నైప్ఞణ్యం కలిగివ్ఞండాలి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ఆచరణకు రావాలి. అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోరాదు. అనాలోచితంగా ఏ పనిని ప్రారంభించకుండా ఉండాలి. ఒక పనిని ప్రారంభిస్తే మధ్యలో ఆపివేయకుండా అంతం వరకూ అవిశ్రాంతంగా పోరాడి విజయం సాధించాలి. ప్రతి అవకాశంలోనూ కొన్ని అడ్డంకులు ఉంటాయి. ప్రతి అడ్డంకి వెనుక కొన్ని అవకాశాలుంటాయి. మనం దేన్ని చూస్తామన్నదే ముఖ్యం. ధైర్య సాహసాలు కలిగియుండాలి. తెలివి, ధైర్యం, పలుకుబడి అన్నింటా విజయపథంలో నడుపగలవు.

ప్రశాంతత, ఆనందం అనేవి అనుకున్నంత సులభంగా లభించవ్ఞ. అవి లభించాలంటే మన ఇతర సాధనాలు. మంచి పనులు, సానుకూల దృక్పథం, అలవాట్లు మార్చుకోవాలి. వీటి బై ప్రొడక్ట్‌ ప్రశాంతత, ఆనందం. ధాన్యం మరలో వేస్తే మంచి బియ్యంతో చిట్టు, తవ్ఞడు, పొట్టు వచ్చినట్టుగానే ఒత్తిడి అనే ధాన్యాన్ని మర అనే మనసులో వేసి సాధన చేస్తే కోపం, ఫ్రస్ట్రేషన్‌, డిప్రషన్‌ పోయి మంచి బియ్యం లాంటి ఆరోగ్యం వస్తుంది. మనం సంతోషకరమైన ఆలోచనలు కలిగియున్నామంటే అదే తీరులో ఉంటాం. మన ఆలోచనలే మన జీవితగమ్యాన్ని నిర్ణయిస్తాయి. మనం చేయవలసిన పనిని గురించి ఆలోచించడం అలవరచుకుంటే మనలో పట్టుదల, పోరాట పటిమ, మనుగడ సాగించడం వంటివి అలవడుతాయి.

మన పనిలో ప్రావీణ్యం, మనలో మానవత్వం ఉంటేనే ఇతరుల నుండి మర్యాద, గౌరవం పొందగలం. మనిషి గమ్యం, గమనం రెండూ ఉత్తమంగా ఉండాలి. తీరికగా కూర్చొని మీ మనస్సులో ఉన్న కోరికలన్నింటినీ బయటకి తీయండి. అందులో మీ ఆశయాన్నో, కోరికనో వెతకండి. దానిని నెరవేర్చడానికి మార్గాన్వేషణ చేయండి. అది మీరు అనుకున్న విధంగా నెరవేరగల్గితే మీలో కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. విజయం సాధిస్తే మీ రూపం మారుతుంది. విజయసాధన సాధ్యం అనే దృక్పథంతో పనిమీద దృష్టిని లగ్నం చేసి ముందుకుసాగాలి. చిన్న చిన్న అడ్డంకులు వస్తాయి. అవే తప్పుకుంటాయి. ధైర్యం, ఆత్మవిశ్వాసంతో సవాళ్ళను హాండిల్‌ చేస్తే విజేతలవుతారు

. మీ బలాలపై దృష్టి సారించాలి గానీ బలహీనతలపై కాదు. మన సమర్థతను మనమే అంచనా వేసుకోవాలి. ఇతరుల అంచనా కోసం ఎదురుచూడకూడదు. మన పనిని మనవ ఏ స్థాయిలో చేయగలిగాము, ప్రవర్తన ఏ విధంగా ఉంది వంటి విషయాలు మదింపు చేసుకుంటే నైతికంగా బలం పెరుగుతుంది. జీవితంలో అనుకున్న రంగాలన్నింటిలోనూ తగిన సమర్థత, చాలినంత జ్ఞానం, విజ్ఞానం సాధించితీరాలి.

నా విద్యుక్త ధర్మాన్ని నేను సక్రమంగా నిరర్తించగలను. నాకే ముప్పు రాదు అనుకుంటూ పనిచేస్తే ఒత్తిడిని జయించవచ్చు. నిరాశాధోరణి, వ్యక్తిగత అభద్రతా భావం, అవిద్యల వల్ల మనిషిలో భయాందోళనలు వస్తాయి. భయం నుండి బయటపడాలంటే ధైర్యం, స్ధైర్యం ఆసరా చేసుకుని మనం సాధించాల్సిన లక్ష్యాల పట్ల పరిజ్ఞానం అభివృద్ధిపరడుకోవాలి.

ఆశావహంతో సాధ్యాలను అంచనా వేసుకుంటూ విజయం వైప్ఞ ఆలోచనలు చేయాలి. స్నానం దేహాన్ని శుద్ధి చేస్తుంది. ధ్యానం బుద్ధిని శుద్ధి చేస్తుంది. ప్రార్థన ఆత్మను శుద్ధి చేస్తుంది. ధనం సంపాదనను శుద్ధి చేస్తుంది. ఉపవాసం ఆరోగ్యాన్ని శుద్ధి చేస్తుంది. క్షమాపణ సంబంధాలను శుద్ధిచేస్తుంది. కానీ పరిసరాలే అతన్ని మలినపరుస్తున్నాయి. మనిషి శారీరకంగానే కాదు మానసికంగానూ ఆరోగ్యంగా ఉండాలి.