భోజనానికి ముందు సలాడ్‌ మంచిదే!

Salad Before Dinner
Salad Before Dinner

భోజనానికి ముందు పచ్చికూరలతో చేసిన సలాడ్‌ తినడం ఓ అలవాటుగా మార్చుకున్నారా? మంచిదే. ఎందుకంటే. దీని తయారీలో ప్రధానంగా ఉండే లెట్ట్యూస్‌ ఆకు వల్ల ఎన్నో లాభాలు న్నాయి మరి. అదెలాగో తెలుసుకోండి మరి. లెట్ట్యూస్‌ ఆకుల్లో పోషకాలను గమనిస్తే…
ఇనుము పుష్కలం. అదనంగా ఎ, బి1, బి2, కె విటమిన్ల, క్లోరోఫిల్‌, కొలైన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, మాంగనీస్‌, క్రోమియం లాంటివన్నీ ఈ ఆకు ద్వారా పొందవచ్చు. తలనొప్పి, నిద్ర సంబంధ సమస్యలను నివారించడంలో లెట్ట్యూస్‌ పాత్ర కీలకం. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. నీటిశాతం కలిగిన ఈ ఆకులను తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో తేమశాతం తగ్గకుండా కాపాడుకోవచ్చు. ఆకుల్లోని ఖనిజ లవణాలు మెదడు, నాడీవ్యవస్థ, కాలేయానికి ఎంతో మేలు చేస్తాయి. సలాడ్‌గానే కాదు, రసం రూపంలో తీసుకున్నా ప్రయోజనముంటుంది. దానివల్ల మాంగనీస్‌ను పొందవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు జరుగుతుంది.