ఆవపెట్టి వంకాయ గ్రేవీ

కావలసినవి: వంకాయలు-6
ఉల్లిగడ్డలు-2, అల్లం-చిన్నముక్క
వెల్లుల్లి-రెండు స్పూన్లు, మిరపకాయలు-10
ధనియాలు-రెండు టేబుల్‌స్పూన్లు
జీలకర్ర-అర టేబుల్‌స్పూన్‌
గరంమసాలా-10గ్రా, ఎండుకొబ్బరి పొడి-రెండు స్పూన్లు
చింతపండు రసం-మూడు టేబుల్‌స్పూన్లు
మామిడికాయ పచ్చడి గ్రేవీ-రెండు టేబుల్‌స్పూన్లు
కారం-ఒక స్పూన్‌,
ధనియాలపొడి-అర టేబుల్‌స్పూన్‌
పసుపు-అర టేబుల్‌స్పూన్‌, చక్కెర-అర టేబుల్‌స్పూన్‌
పాలు-100మి.లీ, కొత్తిమీర-ఒక కట్ట, ఉప్పు-తగినంత
కరివేపాకు-10రెమ్మలు, శనగపప్పు-ఒక స్పూన్‌, మినపప్పు-ఒక స్పూన్‌
జీడిపప్పు-ఐదారు పలుకులు, నువ్ఞ్వలు-ఒక స్పూన్‌, ఉప్పు-తగినంత
తయారుచేసే విధానం
వంకాయలను నాలుగు ముక్కలుగా కోసి దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. కడాయిలో నూనెపోసి ఉల్లిగడ్డలను బ్రౌన్‌ కలర్‌ వచ్చేవరకు వేయించి దాంట్లో అల్లం, వెల్లుల్లి, గరంమసాలా వేసి ఫ్రై చేసి పక్కన పెట్టాలి. మళ్లీ కడాయిలో కొద్దిగా నూనెపోసి శనగపప్పు, జీడిపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు, నువ్ఞ్వలు, ఎండుమిర్చి, కొబ్బరిపొడి వేసి దోరగా వేయించాలి. దీన్ని, ఉల్లిపాయల మిశ్రమాన్ని కలిపి మిక్సీలో పేస్ట్‌లా చేసుకోవాలి. తర్వాత మళ్లీ కడాయిలో నూనె పోసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. దీంట్లో పేస్ట్‌ చేసిన మిశ్రమాన్ని వేయాలి. ఉడికిన తర్వాత చింతపండు రసం, పాలు, చక్కెర, మామిడికాయ పచ్చడి గ్రేవీ, ధనియాలపొడి, కారం, కొత్తిమీర వేసి బాగా కలపాలి. బాగా ఉడికిన తర్వాత వంకాయలు వేసి కాసేపు ఉంచి దించేయాలి. నోరూరించే ఆవపెట్టిన వంకాయ తయార్‌!