ముల్లంగి ఆకుల చారు

RUCHI
RUCHI

ముల్లంగి ఆకుల చారు

కావలసినవి

ముల్లంగి ఆకులు-6, చింతపండు-నిమ్మకాయంత ఉప్పు-తగినంత, పసుపు-చిటికెడు కరివేపాకు-కొద్దిగా, ఉల్లిపాయ చిన్నది-1 పచ్చిమిర్చి-4, ఎండుమిర్చి-3 పోపుసామానులు-ఒక స్పూన్‌ వెల్లుల్లి-రెండు రెబ్బలు నూనె-రెండు స్పూన్లు

తయారుచేసే విధానం
ముల్లంగి ఆకులు ఉడికించి రసం తీసుకోవాలి. ముల్లంగి రసంలో ఒక లీటరు నీరు కలిపి దానిలో ఉప్పు, పసుపు, ఉల్లిపాయ, మిర్చి పొడవ్ఞ ముక్కలుగా కోసుకుని వేయాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసి మరిగించి దించి, మరుగుతున్న నూనెలో పోపు వేయించి చారులో కలపాలి.