మందారనూనెతో ఒత్తిడి మాయం

Releaf From Stress
Releaf From Stress

పొడిబారిపోయిన, చిట్లిపోయి తెగిపోతున్న జుట్టుకి బలాన్నిచ్చి, చుండ్రును తగ్గించి మెరుపునిచ్చేవి కొబ్బరినూనె, నువ్వులనూనె, ఆముదము, మందారనూనె, ఆవనూనె వగైరాలు. ఈ నూనెల వల్ల లాభాలేమిటో తెలుసుకుందామా!

చలికాలంలో ఆవనూనె, లేక నువ్వులనూనె, రాసుకున్నట్లైతే, తలకి వెచ్చదనం, చలిగాలి ప్రభావం నుండి జుట్టుకి రక్షణ!

నిమ్మనూనె, ఆముదం రాసుకుంటే చలువ చేసి ఎండ ప్రభావం తలపై పడకుండా ఉంటుంది. ఆముదం జిడ్డు కదా, చెమట, జిడ్డు కలిసి చిరాగ్గా ఉంటుంది. అంటే తలస్నానానికి ముందు రాసుకొంటే ఇబ్బంది ఉండదు.

ఆలివ్‌నూనె చుండ్రుని పోగొట్టి, జుట్టు రాలిపోవడాన్ని అరికడుతుంది. మెరుపునిస్తుంది. వాసన నచ్చకపోతే, దాంట్లో ఇంకేదైనా నూనెనుగాని, నిమ్మరసాన్ని గాని కలిపి వాడవచ్చు.

ఉసిరిక, మందార నూనెలు జుట్టును నల్గగా, ఒత్తుగా పెరిగేట్లు చేసి మెరుపును, మృదుత్వాన్ని ఇచ్చి తలనొప్పిని నిద్రలేమిని మానసిక ఒత్తిడిని, ఆందోళనని తగ్గించి మెదడుకు శక్తినిస్తాయి.

వేపనూనె తలలో పేలను చుండ్రును వాటివల్ల వచ్చే కురుపులను, కుష్ఠును, పోగొడుతుంది. గర్భనిరోధకంగా కూడా పనిచేస్తుంది.

యూకలిప్టస్‌ ఆయిల్‌, దగ్గు, జలుబు, అలర్జీలు, వగైరాలను పోగొడుతుంది. ఆవిరి పడితే తలనొప్పి, దిమ్ము తగ్గిపోతుంది.

మింట్‌ పంటినొప్పి, కీళ్లనొప్పి, అజీర్ణాన్ని తగ్గిస్తుంది. లావెండర్‌, తలనొప్పి, డిప్రెషన్‌, ఒత్తిడి దూరం చేస్తుంది. నిమ్మనూనె, రక్తంలో ఉన్న మలినాలను పోగొట్టి స్లిమ్‌గా చేస్తుంది. యాపిల్‌నూనె, జ్ఞాపకశక్తిని పెంచి, హైపర్‌ టెన్షన్‌ని పోగొడుతుంది.

మల్లెనూనె, చెడువాసనలు పోగొట్టి డ్రిపెషన్‌ తొలగిస్తుంది. పైన్‌నూనె, నిద్రలేమి, సైనస్‌, బ్రాంకైటిస్‌లను నివారిస్తుంది. అలోవెరా ఆయిల్‌ని రాసుకుంటుంటే జుట్టు పెరుగుతుంది. బేబీ ఆయిల్‌లో వెనిగర్‌ని కలిపి పిల్లల తలకి రాస్తూంటే పేలు గుడ్లు రాలిపోతాయి. వారానికి రెండు సార్లు, నాలుగు వారాలు ఇలా చేయాలి