ఆహారం వృధా కాకుండా..

Neelima-

పార్టీల్లోనో, ఫంక్షన్లలోనో మిగిలిన ఆహారాన్ని పడేస్తుంటారు. తినడానికి తిండి లేని అభాగ్యులు ఎంతో మంది ఉన్నారు. ఆకలితో ఉన్న వారికి మిగిలిన ఆహారాన్ని అందిస్తే, ఆహారం వృథాకాకుండా ఉంటుంది. వారి ఆకలి తీరుతుంది. హైదరాబాద్‌కు చెందిన నీలిమా ఆర్యకు ఈ ఆలోచన వచ్చింది. మంచి ఆలోచనలకు ముహూర్తాలెందుకు అన్నట్లు నీలిమ హైదరాబాద్‌లో పది పబ్లిక్‌ ఫ్రిజ్‌ల ఏర్పాటు మొదలుపెట్టింది. వీరి సొంతూరు బాపట్ల. హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. నాన్న ఆర్పీఎఫ్‌లో సిఐగా పనిచేసి రిటైరయ్యారు. ఇంట్లో తానే పెద్ద. తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీ నుండి ఇంగ్లీష్‌ లిటరేచర్‌లో మాస్టర్స్‌్‌ పూర్తి చేశారు. మీడియా రంగం మీద ఉన్న ఆసక్తితో హైదరాబాద్‌ దూరదర్శన్‌లనో ప్రభాతదర్శిని కార్యక్రమ నిర్వాహకురాలిగా, దూరదర్శన్‌ ఢిల్లీ ఎడిషన్‌లో పనిచేశారు. మరోవైపు ఇంజనీరింగ్‌ కాలేజీలో ఇంగ్లీష్‌ పాఠాలు, టోఫెల్‌ క్లాసులు, చేప్నేవారు. అలా పదేళ్లు గడిచాయి. సౌదీ అరేబియాలో దమామ్‌ యూనివర్సిటీలో ఇంగ్లీష్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా అవకాశం వచ్చింది. ఆరేళ్లు విశ్రాంతి లేకుండా పనిచేసి, ఒక న్యూస్‌ ఛాన్‌లో క్రియేటివ్‌ హెడ్‌గా అవకాశం వచ్చింది. స్వశక్తితో ఎదిగిన అనాథ అమ్మాయిల జీవితాల్ని ఆవిష్కరించిన నగీషి ప్రోగ్రామ్‌ నీలిమకు మంచి పేరుతెచ్చింది. ఇలా ఉద్యోగాలు చేయడంకంటే సమాజం ఏదైనా చేయాలనుకుంది. ఉద్యోగం చేస్తూనే ఒక ఆర్గనైజేషన్‌ను ప్రారంభించింది. ఆకలతో ఉన్నవారికి అన్నం పెట్టాలన్న ఆలోచన అప్పుడే వచ్చింది. పెళ్లిళ్లలో, హోటళ్లలో చాలా ఆహారం వృధా అవుతుంది. అంత మంచి ఫుడ్‌ను ఎందుకుపడేయాలి అని పబ్లిక్‌ ప్లేస్‌లలో ఫ్రీజర్‌ పెట్టాలని సంకల్పించింది. మంచి ఉద్యోగం వదులుకుని ఫ్రిజ్‌ పెడతా నంట్‌ివేవిటి అంటూ చాలా ఆమెను ఎగతాళి చేశారు. అవేవీ పట్టించుకోకుండా తన లక్ష్యం వైపు కలిదింది. హైదరాబాద్‌ అంతా తిరిగి పబ్లిక్‌ ఫ్రిజ్‌ ఏర్పాటుకు ప్రదేశాలను గుర్తించింది. ఇందుకు అనుమతి అంత సులభంగా దొరకలేదు. అధికారుల చుట్టూ తిరిగిన తన ప్రాజెక్టును వివరించింది. చివరికి అనుమతి సాధించింది. నీలిమ రెస్టారెంట్‌, హోటల్‌ యజమానులను కలిసి తన ఆలోచన గురించి వివరించింది. ఫ్రిజ్‌ పెట్టేందుకు చిన్న స్థలం, విద్యుత్‌ను ఉచితంగా ఇచ్చేందుకు జిహెచ్‌ఎంసి ముందు కొచ్చింది. ఫ్రిజ్‌లో వెజ్‌, నాన్‌వెజ్‌ ఆహారపదార్థాలు ఉంచేంఉదకు విడివిడిగా ర్యాకులు. అలాగే ఏ విధమైన ఆహారం ఫ్రిజ్‌లో ఉంచాలో సూచనలు రాసి ఉంచేది. బిస్కెట్లు, చాక్లెట్లు, వాటర్‌ బాటిల్స్‌కూడా ఉంటాయి. నీలిమ ఆర్య ప్రారంభించిన ‘ఫీడ్‌ ద నీడ్‌ అనే ఈ కార్య క్రమానికి మంచి స్పందన వచ్చింది. నగరవ్యాప్తంగా ఏర్పాటు చేసిన యూనిట్ల వద్ద ఒక పర్యవేక్షకుడిని ఉంచింది. ఆకలిగా ఉన్న వారికి ఆహౄరం అందించడం. వండిన ఆహారం నాణ్యంగా ఉందా, ప్యాకింగ్‌ సరిగ్గా ఉందా అని పరిశీలిస్తాడు. ఆటోవాలాలు, అనాథలు, కూలీలు, ఆకలితో ఉన్న వారు వీటితో ఆకలి తీర్చుకుంటారు. సంకల్పం బలంగా ఉండి, చిత్తశుద్ధితో ధైర్యంగా ముంద డుగు వేస్తే మహిళలు సపోర్టు లేకున్నా దూసుకుపోగరలని నీలిమ ఆర్య అంటుంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/