రాగిదోశె

Raagi Dosa
Raagi Dosa

రాగిదోశె

కావలసినవి

ఒక కప్పు మినపప్పు, రాగి మొలకలపిండి-రెండు కప్పులు ఉప్పు-మూడు టేబుల్‌స్పూన్లు మొలకల రాగిపిండి కోసం రెండు కప్పుల రాగులను నీళ్ళలో నిమిషం నానబెట్టి, నీటిని వంపేసి పల్చని వస్త్రంలో మొలకలు వచ్చేదాకా ఓ రోజంతా మూటగట్టి ఉంచాలి. ఎండలో ఆరబెట్టి పిండి పట్టించాలి.

గుజ్జుకోసం కావాల్సిన పదార్థాలు:
ఒక కిలో టమాటాలు, రెండు ఉల్లిపాయలు, రెండు పచ్చిమిరపకాయలు, అరలీటరు చల్లని పాలు, రెండు టేబుల్‌స్పూన్లు సాంబారు పొడి, ఒక టేబుల్‌స్పూన్‌ కారం, ఒక టేబుల్‌స్పూన్‌ కొత్తిమీర, అరటేబుల్‌స్పూన్‌ ఆవాలు, ఒక టేబుల్‌స్పూన్‌ మినపప్పు, కరివేపాకు పావ్ఞ టేబుల్‌స్పూన్‌. ఇంగువ రెండు టేబుల్‌స్పూన్‌, నూనె, ఉప్పు-తగినంత

తయారుచేసే విధానం
మినపప్పును మూడుకప్పుల నీటిలో గంటసేపు నానబెట్టాలి. నీటిని ఒంపేయాలి. కప్పు నీరు పోసి పప్పు గ్రైండ్‌ చేసుకోవాలి. రాగిపిండి, ఉప్పు, ఒక కప్పు నీరుపోసి మళ్ళీ గ్రైండ్‌ చేయాలి. పిండిని ఐదారు గంటలసేపు పులియబెట్టాలి. మూకుడులో నూనె వేసి ఆవాలు, మినపప్పు, ఇంగువ, కరివేపాకు వేసి చిటపట లాడనివ్వాలి. అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయముక్కలు వేసి వేయించాలి. సాంబారుపొడి, కారం, ఉప్పు వేసి కొద్ది సెకన్లు వేయించి టమాట ముక్కలు వేసి మెత్తబడేదాకా ఉంచాలి. సెగ తగ్గించి పాలుపోసి కలుపుతూ ఓ రెండు నిమిషా లుంచాలి. తరిగిన కొత్తిమీర జల్లి దింపేయాలి.