పూరీ పొట్లాలు

రుచి: వంటకాలు

Puri potlaalu
Puri potlaalu

కావలసిన పదార్థాలు గోధుమపిండి- అరకిలో
మైదా -200 గ్రాములు
రిఫైండ్‌ ఆయిల్‌ – తగినంత
నెయ్యి – 10 గ్రాములు
ఉప్పు – పావ్ఞ టీ స్పూన్‌
పంచదార – ఒకటిన్నర కిలో
మంచినీళ్లు – తగినన్ని
లవంగాలు – సరిపడా
యాలకుల పొడి – అరటీ స్పూన్‌
బేకింగ్‌ పౌడర్‌ – టీ స్పూన్‌

తయారుచేయు విధానం

గోధుమ, మైదా, బేకింగ్‌ పౌడర్‌లు కలపాలి. ఉప్పు, కరిగించిన నెయ్యి పోసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్ల పోసి మెత్తగా ముద్దలా చేసి ఓ గంట సేపు నాననివ్వాలి.


తరువాత పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక్కో ఉండనీ పలుచని పూరీలా చేసి దాన్ని సగానికి కత్తిరించాలి. ఇప్పుడు ఒక్కో భాగాన్ని మిఠాయి పొట్లంలా (కోన్‌లా) మడిచి విడిపోకుండా లవంగాన్ని గుచ్చాలి.

అన్నీ అలాగే చేసి పెట్టుకోవాలి. మందపాటి పాత్రలో పంచదార వేసి అందులో తగినన్ని నీళ్లు పోసి లేతపాకం పట్టి యాలకులపొడి కలిపి ఉంచాలి.

కళాయిలో నూనె పోసి లేతపాకం పట్టి యాకులపొడి కలిపి ఉంచాలి. కళాయిలో నూనె పోసి బాగా కాగాక ఈ పూరీ పొట్లాలు కొద్ది కొద్దిగా వేస్తూ దోరరంగులో వేయించి తీసి వేడివేడి పంచదార పాకంలో ముంచాలి.

పది నిమిషాలు పాకంలో ఊరాక ట్రేలో వరుసగా పూరీ పొట్లాలను అమర్చి మిగిలిన పాకాన్ని వాటిపైన పోయాలి. ఇవి వారం రోజులు నిలువ ఉంటాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/