ఎర్ర కందిపప్పు, గుమ్మడి కాయ దాల్‌

Pumpkin dal

కావలసినవి:
ఎర్రకందిపప్పు-రెండు కప్పులు
గుమ్మడికాయ బద్ద-పావ్ఞకిలో, పండిన టమాటాలు-ఒక కిలో
పెద్ద ఉల్లిపాయలు-4, పుదీనా ఆకులు-అరకప్పు
పచ్చిమిరపకాయలు-6, కొత్తిమీర-ఒక కట్ట, అల్లం-ఒక అంగుళం ముక్క
ఎండుమిరపకాయలు-6, వెల్లుల్లిరేకలు-12
నూనె- 3/4 కప్పు, ధనుజీరాపొడి- ఒక టీ స్పూన్‌
యాలుకలు-6, లవంగాలు-6
ధనియాలు-ఒక స్పూన్‌, దాల్చిన చెక్క-ఒక అంగుళం ముక్క
లవంగాలు-12, ఉప్పు-ఒక టేబుల్‌స్పూన్‌
జీలకర్ర-ఒక టేబుల్‌స్పూన్‌, చింతపండు-పావు కప్పు

తయారుచేసే విధానం:
కందిపప్పు ముందు రాత్రిగానీ లేదా వండేందుకు ముందు కనీసం మూడు గంటల సేపు నానబెట్టండి. టమాటోలను తరిగి ముక్కలుగా కోసుకోండి. పప్పును కడిగి శుభ్రం చేయండి. నాలుగు కప్పుల నీరుపోసి చేర్చి మెత్తగా ఉడికించి, వార్చి తీసు కోండి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, లవంగాలు, దాల్చినచెక్క, యాలకులు, జీలకర్ర, ధనియాలు నూరి మెత్తని ముద్ద చేయండి. పుదీనా, కొత్తిమీరలను సన్నగా తరిగి పెట్టుకోండి. అరకప్పు నీటిలో చింతపండును నానబెట్టండి. ఉల్లిపాయలను సన్నగా తరిగి 3/4కప్పు నూనెను వేడిచేసి అందులో ఉల్లిముక్కలను వేసి బంగారు రంగు వచ్చే వరకూ వేయించండి. సన్నని మంటమీద ఉడకనివ్వండి. అర్థగంట ఉడకనిచ్చి తరిగిన పుదీనా, కొత్తిమీర, చింతపండురసం వేసి కలపండి. కూర ఇగిరి దగ్గర పడుతుండగా దించండి. టమాటో రైస్‌తో కలిపి వడ్డించితే చాలా రుచిగా ఉంటుంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/