కొత్త ఆలోచన: బహుమతులుగా మొక్కలు

Plants as gifts

పుస్తకాల వలె మొక్కలు కూడా మంచి నేస్తాలు. చేయందిస్తే చెలిమినిస్తాయి. వీటిని అలంకరణకే కాదు బహుమతిగా ఆత్మీయులకు అందించవచ్చు. ఇంట్లో వ్యర్థాలను రీసైకిల్‌ చేసి పూలకుండీలుగా మారుస్తున్నారు. ఎవరింటికైనా వేడుకకో లేదా ఏదో ఓ కార్యానికో వెళ్లినప్పుడు ఏం బహుమతి కొనాలని ఆలోచిస్తాం. అలాంటప్పుడు స్వీట్‌బాక్సులు, పూలబొకేలే గుర్తొస్తాయి. ప్రతిసారి అవే పట్టుకెళితే ఏం బాగుంటుంది అనిపిస్తుంది.

అయితే కొత్తగా ఏమివ్వగలమనే ఆలోచనలోనే మొక్కలు బహుమతిగా ఇవ్వవచ్చున్న ఆలోచన వచ్చింది. పర్యావరణ హితంగా ఆలోచించినప్పుడు వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేఇ వాటినే అందమైన పూల కుండీలుగా మార్చి బహుమతులుగా చేస్తున్నారు. మొక్కలంటే పర్యావరణం. శుభసూచకం. అవి ఆత్మీయులకు కానుకలుగా ఇచ్చేందుకు బాగుంటాయి.

టైర్లు, సీసాలు, జాడీలు, గాసు పాత్రలు జీన్స్‌ప్యాంట్లు వీటిని బాగు చేసి అందులో మొక్కలు నాటుతారు. ప్రత్యేకంగా టెర్రకోటా, సిరామిక్‌, చెక్క వంటి వాటితోనూ కుండీలను రూపొందిస్తారు.

వీటిని కార్పొరేట్‌ వేడుకల్లో బహుమతులుగా ఇస్తారు. ప్రత్యేకమైన కుండీల్లో పెద్ద పెద్ద మొక్కలే ్న ప్రతిసారి నాటలేం. వీటిలో కొన్నింటిని ప్రతి రోజు నీళ్లు అవసరం ఉండదు. మూడు నెలలకోసారి పోస్తే చాలు. అన్నింట్లోకి జీన్స్‌ప్యాంట్‌ కుండీలకు బాగా ఆదరణ లభిస్తున్నది.

వంటింట్లో కొత్త కొత్త ప్రయోగాలు చేసేవారికి పార్సలీ, సెలెరీ, రోజ్‌మేరీ , చెర్రీస్‌ వంటి అన్ని సార్లూ అందుబాటులో ఉండకపోవచ్చు. అలంటి వారికోసం ప్రత్యేకంగా కుండీలు, ఎరుపూ, ఆయా గింజల్ని ఒక ప్యాకింగ్‌ రూపంలో అందిస్తున్నారు. రకరకాల ఆయుర్వేద గింజలు అందుబాటులో ఉన్నాయి.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/