ఉలవలతో పరాఠాలు

Parathas with Ulavala

శీతాకాలంలో ఉలవలు చాలా మంచివి. ఉలవలతో రకరకాల వంటకాలు చేస్తారు. ఉలవలు ఇలా ఏ విధంగా తీసుకున్నా మంచివే. చాలా మందికి ఉలవారు ఇష్టం. అయితే ప్రతిసారి అదే కాకుండా వివిధ వెరైటీలతో చేసే పదార్థాలను కూడా తీసుకోవచ్చు.

కావలసిన పదార్థాలు:

రాజ్మా – ఒక కప్పు, ఉలవలు – అరకప్పు, ఉల్లిపాయ – ఒకటి, పచ్చిమిర్చి తరుగు – 1 టేబుల్‌ స్పూన్‌, జీలకర్ర, ధనియాలపొడి, ఆమ్‌చూర్‌, గరం మసాల పొడి, మిరియాల పొడి – అర టీ స్పూన్‌ చొప్పు, కారం – ఒక టీ స్పూను, ఉప్పు – రుచికి తగినంత, గోధుమపిండి – ఒక కప్పు, నూనె – రెండు టేబుల్‌ స్పూన్లు.

తయారుచేసే విధానం:

రాజ్మా, ఉలవలు ఎనిమిది గంటలపాటు నానబెట్టి కుక్కర్లో ఉడికించాలి. చల్లబడ్డాక మిక్సీలో బరకగా రుబ్బుకుని పక్కనుంచాలి. కొద్దిగా నూనెలో జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిఇ్చ తరుగు వేగించాలి. ఆమ్‌చూర్‌, గరం మసాల, కారం, ఉప్పు, మిరియాలపొడితో పాటు రుబ్బిన మిశ్రమం కూడా వేసి బాగా కలిపి దించేయాలి. ఇప్పుడు తడిపి ముద్ద చేసిన పిండిని కొద్దికొద్దిగా తీసుకుని పరాటాలు ఒత్తి, మధ్యలో తగినంత ఉలవల మిశ్రమం పెట్టి దగ్గరగా మడవాలి. మళ్లృ నెమ్మదిగా పరాటాలు ఒత్తి పెనంపై రెండు వైపులా నూనెతో కాల్చాలి. బలవర్ధకమైన ఈ పరాటాలను రైతాతో వేడి వేడిగా తినవచ్చు. రాజ్మాలు ఎంతో బలవర్ధకమైనవి. అదేవిధంగా ఉలవలు ఆరోగ్యానికి మంచివి. చలికాలం ఉలవచారు, ఉలవలతో చేసిన పదార్థాలు తినడం మంచిది.

తాజా కెరీర్‌ సమాచారం కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/