సౌభాగ్యాలనిచ్చే నాగుల పంచమి

నేడు నాగుల పంచమి

Naagula Panchamii Festival
Naagula Panchamii Festival

దేవతలుగా ఆరాధించే నాగుల గురించి మన పురాణాలలో ఎన్నో కథలు ఉన్నాయి. మహాభారతంలో ఉన్న ఒక కథ ప్రకారం కురు వంశానికి చెందిన పరీక్షిత్తు మహారాజును తక్షకుడు అనే పాము కాటువేస్తుంది. దాంతో అతడు చనిపోతాడు. తండ్రి మరణాన్ని భరించలేని అతని కుమారుడు జనమేజయుడు అందుకు ప్రతీకారంగా భూ ప్రపంచంలో ఉన్న పాములన్నింటిని అగ్నికి ఆహుతి చేసేలా సర్పయాగాన్ని తలపెడతాడు. రుషులు, బ్రాహ్మణులు పఠిస్తున్న మంత్రాల ప్రభావంతో ఎక్కడెక్కడో ఉన్న సర్పాలన్నీ కూడా అగ్నిలో ఆహుతి అవుతుంటాయి. ఇది చూసి భయపడిన తక్షకుడు ఇంద్రుడిని శరణు వేడుతాడు. ఇది చూసి భయపడిన తక్షకుడు ఇంద్రుడిని శరణువేడుతాడు.

నాగులను దేవతలుగా పూజించే పండుగే నాగపంచమి. ఈ నాగపంచమిని మనదేశంలోనే కాక నేపాల్‌లోను ఇంకా ఇతర దేశాల్లోను జరుపుకుంటారు. ముఖ్యంగా ఈ పర్వదినం శ్రావణ మాసంలో వస్తుంది. ప్రకృతి మానవ మనుగడకు జీవనాధారమైనది. దానిని దైవస్వరూపంగా భావించి, మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, కొండకోనను, నదిని, పర్వతాన్ని ఇలా సమస్త కోటిని దైవ స్వరూపంగా భావించి పూజిస్తూ వస్తున్నారు. ఇదే మన భారతీయ సంస్కృతిలోని విశిష్టత. నిశితంగా పరిశీలిస్తే అందులో భాగంగానే నాగుపామును నాగరాజుగా నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు. నాగుల పంచమినాడు నాగేంద్రుని శివభావంతో అర్చిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. ఈ మానవశరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నెముకను వెన్నుపాము అంటాం. అది కుండలినీ శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారమువలె ఉంటుందని యోగశాస్త్రం చెపుతున్నది.

ఇది మానవ శరీరంలో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ మానవునిలో సత్వగుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని ఈ పర్వదినం రోజున విషసర్పాలున్న పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది అందరి హృదయాలలో నివసించే శ్రీమహావిష్ణువునకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలనే కోరికతో చేసేదే నాగుపాము పుట్టలో పాలు పోయడంలో ఉన్న ఆంతర్యమని చెపుతారు. నాగుల పంచమి రోజు ఆవుపాలు పుట్టలో పోసి నాగపూజ చేసి చలిమిడి, చిమ్మిలి, అరటిపళ్లు, నివేదన చేస్తారు. దేవతలుగా ఆరాధించే నాగుల గురించి మన పురాణాలలో ఎన్నో కథలు ఉన్నాయి. మహాభారతంలో ఉన్న ఒక కథ ప్రకారం కురు వంశానికి చెందిన పరీక్షిత్తు మహారాజును తక్షకుడు అనే పాము కాటువేస్తుంది. దాంతో అతడు చనిపోతాడు.

తండ్రి మరణాన్ని భరించలేని అతని కుమారుడు జనమేజయుడు అందుకు ప్రతీకారంగా భూ ప్రపంచంలో ఉన్న పాములన్నింటిని అగ్నికి ఆహుతి చేసేలా సర్పయాగాన్ని తలపెడతాడు. రుషులు, బ్రాహ్మణులు పఠిస్తున్న మంత్రాల ప్రభావంతో ఎక్కడెక్కడో ఉన్న సర్పాలన్నీ కూడా అగ్నిలో ఆహుతి అవుతుంటాయి. ఇది చూసి భయపడిన తక్షకుడు ఇంద్రుడిని శరణు వేడుతాడు. ఇది చూసి భయపడిన తక్షకుడు ఇంద్రుడిని శరణువేడుతాడు. నాగజాతి అంతరించిపోతుందన్న ఉద్దేశంతో ఇంద్రుడు మానసాదేవిని వేడుకుంటాడు. అందుకు మానసాదేవి తన కుమారుడు అస్థికను జనమేజయుడు చేస్తున్న సర్పయాగం నిలిపివేసేలా చేయమని యాగం జరుగతున్న చోటిక పంపిస్తుంది.

సకలశాస్త్రకోవిదుడైన అస్థికుడు జనమేజయుని యాగం నిలిపివేసేలా ఒప్పిస్తాడు. దాంతో యాగం నిలిచిపోతుంది. తక్షకుడితో మరికొన్ని సర్పాల ప్రాణం నిలుస్తుంది. అంతకుముందు అగ్నికి ఆహుతై ప్రాణత్యాగం చేసిన సర్పాలకు ప్రతీకగా నదివర్ధిని పంచమి, నాగుల పంచమి అని అంటారు. ఈ రోజున అన్ని రకాల పాములను పూజిస్తారు. నాగపంచమిని కొన్ని చోట్ల భ్రాతృపంచమి అని కూడా అంటారు. అన్నదమ్ములకు ఎలాంటి కీడు వాటిల్లకుండ అక్కచెల్లెళ్లు పాముల పుట్టలో పాలుపోసి పూజ చేసి వేడుకునే సాంప్రదాయం కూడా కొన్ని చోట్ల ఉంది. ఇందుకు ఒక జానపద కథ ప్రచారంలో ఉంది. ఒక గ్రామంలో నివసిస్తున్న రైతుకు ఇద్దరు కొడుకులు ఉంటారు.

వారిలో ఒకడు పొలం దున్నుతుండగా కనిపించిన మూడు పాములను చంపుతాడు.
అందుకు పగ తీర్చుకోవాలని వాటి తల్లి అదేరోజు రాత్రి రైతును, అతని భార్యను, వారి ఇద్దరు కొడుకులను కాటు వేస్తుంది. అది తెలుసుకున్న రైతు కూతురు తల్లిదండ్రులను, అన్నదమ్ములు బతికించుకునేందుకు ఒక గిన్నెలో పాలు పోసి నాగరాజుకు నివేదించి, తన వారిని బ్రతికించమని వేడుకుంటుంది.
ఆమె కోరికను మన్నించిన నాగరాజు ఆమె కుటుంబాన్ని బ్రతికిస్తాడు. ఈ విధంగా నాగులను దేవతలుగా పూజించే సాంప్రదాయం చాలా చోట్ల ఉంది. పాములు విషం గ్రక్కడమే కాకుండా భూమి అంతర్భాగంలో ఉంటూ భూసారాన్ని కాపాడుతాయి. ఇవి పంటలను నాశనం చేసే క్రిమి కీటకాలను తింటూ, పరోక్షంగా రైతుకు పంటనష్టం కలగకుండా చేస్తాయి. ఇలా ప్రకృతి పరంగా మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి.

  • బి.మీనాక్షి