మెనోపాజ్‌కు ముందు, ఆ తర్వాత

Monopause before and after
Monopause before and after

ముఖం మీద ముఖ్యంగా పెదవి మీద, గడ్డం మీద రోమాలు పెరగవచ్చు. మెనోపాజ్‌ సమయంలో ఫీమేల్‌ హార్మోన్లు తగ్గడం, వల్ల స్త్రీ శరీరంలో మేల్‌ హార్మోన్లు, ఫీమేల్‌ హార్మోన్ల రేషియో మారుతుంది. దీనివల్ల పైన చెప్పిన మార్పులు వస్తాయి. వీటికోసం మందులు తీసుకునే అవసరం ఉండదు కానీ బ్యూటీషియన్స్‌ వద్దకు వెళ్లి తగిన సహాయం పొందాలి.

మెనోపాజ్‌కు ముందు, ఆ తర్వాత
మెనోపాజ్‌ సమయంలో వచ్చేమార్పులు శారీరకంగా, మానసికంగా లేదా ఆరోగ్యపరమైన సమస్యలు ఏవైనా కావచ్చు. ముందు శారీరకమైన మార్పులను ఏమిటో తెలుసుకుందాం. ఈ సమయంలో శరీరంలో అక్కడక్కడా కొవ్ఞ్వ చేరుతుంది. ”నేను ఇదివరకటిలాగే పనిచేస్తున్నాను, తింటున్నాను మరి నా బరువ్ఞ ఎందుకు పెరుగుతుంది అని చాలా మంది బాధపడుతుంటారు. ఇది ఎందువల్లనంటే ఈ సమయంలో శరీరానికి కేలరీల అవసరం తగ్గుతుంది కాబట్టి మనుపటిలాగే తిన్న ప్రతిసారి మనం అదనపు కేలరీలను స్వీకరించి వాటిని కొవ్ఞ్వరూపంలో జమచేస్తుంటామన్న మాట. కనుక ఈ తరుణంలో మనం తినే ఆహారపరిమాణం తగ్గించుకోవాలి. ఈ కొవ్ఞ్వ చేరడం తీవ్రమైన దైనందిన కార్యక్రమాలకు ఇబ్బందికరమైనపుడు స్థూలకాయం వస్తుంది. ఇది స్వతహాగా జబ్బు కాదు. కాని దీనివలన వచ్చే జబ్బులు అనేకం ఉంటాయి. ఉదాహరణకి గుండెపోటు, మధుమేహం, హైపర్‌ లిపిడిమియా మొదలైనవి. కాబట్టి ఈ కొవ్ఞ్వ అధికంగా చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వీటిలో రెండు రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. మొదటిది ఆహారం విషయంలో, రెండోది శరీర వ్యాయామంలో పాటించే జాగ్రత్తలను తెలుసుకుందాం.
డైటింగ్‌ మొదలు పెట్టేముందు అర్థం చేసుకోవాల్సిన విషయాలలో మొదటిది. ఈ డైటింగ్‌ ముఖ్య లక్ష్యం ఏమిటన్నది. 40ఏళ్లు పైబడిన వారికి ముఖ్యమైన ఆశయం తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, ఆరోగ్యరీత్యా అవసరమైన మేరకు బరువ్ఞ తగ్గడం, అంతేగాని పదహారేళ్ల వయస్సులో ఉన్నట్టు కనబడాలను కోవడం మూర్ఖత్వమే అవ్ఞతుంది. ఎందుకంటే వయస్సుతో పాటు శరీరంలో మార్పు సహజం. జననమరణాలను ఎవరూ తప్పించలేరు. దీన్ని జీర్ణించుకుని, ఆరోగ్యపరంగా చురుగ్గా ఉండగలిగే మేరకు బరువ్ఞ తగ్గించుకోవడం మంచిది. ఇక రెండో విషయానికి వస్తే బరువ్ఞ తగ్గాలి కదా అని కడుపు మాడ్చుకుని ఉపవాసాలు చేయవలసిన అవసరం లేదు. అంతేకాకుండా అలా చేస్తే ప్రమాదం. క్రాష్‌ డైటింగ్‌లు, ఉపవాసాలు చేస్తే బరువ్ఞ త్వరగా తగ్గవచ్చుననుకుని అదేవిధంగా కష్టపడితే మొదట్లో తగ్గవచ్చుగానీ, మన శరీరానికి అలవాటైన సమయంలో ఆహారం దొరకని పక్షంలో వెంటనే మన మెదడు నుంచి సూచన అందుతుంది. మనకు సరైన సమయానికి ఆహారం అందడం లేదు కాబట్టి ముందు ఓపిక కోసం ఈ దొరికిన ఆహారమే నిలువ చేసి పెట్టుకోవాలని, మనం ఎటువంటి ఆహారం తీసుకున్నా మన శరీరంలో అది నిల్వ అయినపుడు కొవ్ఞ్వగా మారి అలాగే జమ అవుతుంది.
ఇది ఎందుకంటే ప్రతి గ్రాము కొవ్ఞ్వకు తొమ్మిది కేలరీల శక్తి వస్తుంది. ఇది ఇతర అన్ని రకాల ఆహారాల కంటే అధికం. అందువలన కొవ్ఞ్వరూపంలో అయితే అతి తక్కువ కొవ్ఞ్వ నుంచి అత్యధికంగా కేలరీల రూపంలో శక్తిని పొందవచ్చు. అయితే ఈ కొవ్ఞ్వను కరిగించాలంటే మనం ఎక్కువ కేలరీలను ఉపయోగిస్తేనే సాధ్యమతుంది. కాబట్టి చెప్పొచ్చేదేమంటే తిండి మానేస్తే వెంటనే కొంత బరువ్ఞ తగ్గవచ్చు కాని భవిష్యత్తులో బరువ్ఞ తగ్గకపోగా పెరగవచ్చు. అది కాకుండా ఇలా కొంతకాలం చేసాక ఇక చేయలేను బాబూ అని ఏదో ఒక సమయంలో అనిపిస్తుంది. అటువంటప్పుడు మనం మామూలుగా అలవాటైన రొటీన్‌ ప్రారంభిస్తే అది శరీరానికి ఎక్కువై మళ్లీ బరువ్ఞ పెరిగే అవకాశం ఉంటుంది. దీన్నే రీబౌండ్‌ హైనామెనన్‌ అంటాం. కాబట్టి మన ఆహారాన్ని మామూలు సమయాల్లోనే తీసుకుంటూ, ఎక్కువ కేలరీలు గల పదార్థాలను తగ్గించి ఆహారంలో తగిన మార్పులు చేసుకుంటూ, ఇటువంటి మార్పులను దీర్ఘకాలం పాటించాలి. అలా చేసినపుడే మనకు శరీరంలో తగిన గుణం కనిపి స్తుంది. ఆహారంలో తగ్గించవలసిన పదార్థాలు ముఖ్యంగా కొవ్ఞ్వ పదార్థాలు, నూనెలు, నెయ్యి వంటివి పంచదార, తీపిపదార్థాలు అలాగే ఎక్కువ తీసుకో వలసినవి సలాడ్స్‌, పళ్లు ఉడకపెట్టిన కూరలు మొదలైనవి. వీటిలో పీచు పదార్థాలు ఎక్కువ ఉండటం వలన, కడుపు త్వరగా నిండటానికి దోహద పడతాయి. ఇది కాకుండా మనం ఖర్చు పెట్టే కేలరీల మొత్తం పెంచాలి. ఇది మన జీవన విధానం మార్చుకోవడం ద్వారా క్రమబద్ధంగా వ్యాయామం చేయడం సాధ్యం.
జీవనశైలిలో మార్పు అవసరం లేదు. మామూలుగా కారు, బస్సు, ఆటోలోనే చేసే ప్రయాణం, సాధ్యమైనంత వరకూ నిడివి చేయడం పై అంతస్తులకి వెళ్లవలసి వస్తే ఏదైనా వస్తువ్ఞ కావలసి వచ్చినప్పుడు అది తెమ్మని పిల్లలకో, పనివాళ్లలకో పురమాయించకుండా, మనమే లేచి తీసుకోవడం వంటివి అలవాటు చేసుకుంటే, మనకు శ్రమ తెలియకుండానే చాలా కేలరీలను వాడటం తద్వారా బరువ్ఞ పెరగకుండా ఉండటం సాధ్యమౌతుంది. వీటికి తోడు క్రమబద్ధంగా, వ్యాయామం చేస్తే బరువ్ఞ తగ్గడమే కాకుండా, మన కండరాలు కూడా బలపడతాయి. ఇవే కాకుండా శరీరంలో మరికొన్ని మార్పులు వస్తాయి.
ముఖం మీద ముఖ్యంగా పెదవి మీద, గడ్డం మీద రోమాలు పెరగవచ్చు. మెనోపాజ్‌ సమయంలో ఫీమేల్‌ హార్మోన్లు తగ్గడం, వల్ల స్త్రీ శరీరంలో మేల్‌ హార్మోన్లు, ఫీమేల్‌ హార్మోన్ల రేషియో మారుతుంది. దీనివల్ల పైన చెప్పిన మార్పులు వస్తాయి. వీటికోసం మందులు తీసుకునే అవసరం ఉండదు కానీ బ్యూటీషియన్స్‌ వద్దకు వెళ్లి తగిన సహాయం పొందాలి.
రొమ్ములలో ఉండే గ్రంథులు ఎండిపోయినట్లుగా అవ్ఞతాయి. అలాగే లిగమెంట్స్‌ ఇలాస్టిసిటీ తగ్గి వాటి పట్టు తగ్గి, రొమ్ములు కొంచెం సడలవచ్చు. వీటిని సర్జరీ ద్వారా సరిచేయవచ్చు.
చర్మంలోని గ్లాండ్స్‌ కూడా ఎండినట్లవ్ఞతాయి కాబట్టి చర్మం పొడిగా, పొట్టు రేగినట్టుగా కావచ్చు. అదేవిధంగా గోళ్లు చిట్లడం, జుట్టు పొడిగా, జీవం లేనట్లుగా కావడం, జుట్టురాలవచ్చు. అప్పుడు వైద్య సలహాలు పొందడం మంచిది.