ఢిల్లీ పాఠశాలకు మెలానియా

అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో కలిసి భారత్‌కు వస్తున్నారు. వీరితో పాటు వారి కుమార్తె ఇవాంకా వస్తున్నారు. సాధారణంగా అధికార పర్యటనకు వచ్చే అధ్యక్షులు, ప్రధానులు వారి సతీమణులు భారత్‌లో ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల ను చూసేందుకు ఇష్టపడతారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కువ మంది తాజ్‌మహల్‌ను చూస్తారు. చూడదగిన ఇతర ప్రదేశాలను పర్యటిస్తారు. అయితే అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ తమ పర్యటనలో భాగంగా ఇతర ప్రదేశాలను చూడడంతో పాటు దేశరాజధాని ఢిల్లీలోని ఒక ప్రభుత్వ పాఠశాలను చూడాలనుకుంటున్నారు.

Melania Trump

అక్కడ జరిగే తరగతుల గురించి తెలుసుకునేందుకు ఆమె ఆసక్తి చూపుతున్నారు. మరి ఆ పాఠశాల కార్యక్రమాలు ఎంత ఆసక్తిగా ఉంటాయో కదా! అవును మరి అమెరికా ప్రథమ మహిళ పర్యటించాలనుకున్న ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలో చదువు..చదువు అని కాకుండా అక్కడి టీచర్లు పిల్లలతో రకరకాల కార్యక్రమాలు చేయిస్తారు. హ్యాపినెస్‌ కరిక్యులం పేరుతో వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

అమెరికా ప్రథమ మహిళ మెలనియా ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో కలిసి భారత్‌కు వస్తున్నారు. వీరితో పాటు వారి కుమార్తె ఇవాంకా వస్తున్నారు. సాధారణంగా అధికార పర్యటనకు వచ్చే అధ్యక్షులు, ప్రధానులు వారి సతీమణులు భారత్‌లో ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలను చూసేందుకు ఇష్టపడతారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కువ మంది తాజ్‌మహల్‌ను చూస్తారు. చూడదగిన ఇతర ప్రదేశాలను పర్యటిస్తారు. అయితే అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ తమ పర్యటనలో భాగంగా ఇతర ప్రదేశాలను చూడడంతో పాటు దేశరాజధాని ఢిల్లీలోని ఒక ప్రభుత్వ పాఠశాలను చూడాలనుకుంటున్నారు. అక్కడ జరిగే తరగతుల గురించి తెలుసుకునేందుకు ఆమె ఆసక్తి చూపుతున్నారు.

మరి ఆ పాఠశాల కార్యక్రమాలు ఎంత ఆసక్తిగా ఉంటాయో కదా! అవును మరి అమెరికా ప్రథమ మహిళ పర్యటించాలనుకున్న ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలో చదువు..చదువు అని కాకుండా అక్కడి టీచర్లు పిల్లలతో రకరకాల కార్యక్రమాలు చేయిస్తారు. హ్యాపినెస్‌ కరిక్యులం పేరుతో వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మనసులను ప్రశాంతంగా మార్చుకునేందుకు కొంతసేపు ధ్యానం చేయిస్తారు. రెండు చేతులను బాగా రుద్దుకుని కళ్లపై పెట్టుకుంటారు. ఆ నిశ్శబ్దంలో తమ గుండె చప్పుడు వంటారు. శ్వాస మీద ధ్యాస పెడతారు. హద్దులు లేని మనసు చెప్పు ఊసులను ఒక పేపర్‌ మీద రాస్తారు. వారికి కలిగే అనుభూతులను రాయడం, చిత్రాలుగా గీయడం చేస్తారు. స్నేహితులతో సరదాగా ఉంటారు. కథలు చెప్పుకుంటారు. నాటకాలు వేస్తారు. ఏదైనా అంశం గురించి మాట్లాడుతూ దానిపై చర్చిస్తారు. ఇండోర్‌ గేమ్స్‌ ఆడతారు. ఇవన్నీ కూడా పిల్లలకు ఒత్తిడిని దూరం చేస్తాయి. తోటి వారితో చర్చించడం, చెప్పింది శ్రద్ధగా వినడం, తమ భావాలను నిర్భయంగా వ్యక్త పరచడం. వంటివి వారు అలవాటవుతాయి. సృజన, ఏకాగ్రత పెరుగుతుంది. సమస్యలను ఎదుర్కొవడం, సరైన ఆలోచనా విధానం అలవడుతుంది.

ఆ పాఠశాలలోని పిల్లలు ఇవన్నీ కూడా టీచర్లు ఉండగానే చేస్తారు. అయితే చదువుకుంటూనే వీటిని చేస్తారు. ఇలా ప్రతి ప్రభుత్వ పాఠశాలలోను ఉంటే ఎంత బాగుంటుంది. ఢిల్లీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలను ఈ రకంగా తీర్చిదిద్దుతున్నది. మరి. అందుకే అమెరికా ప్రథమ మహిళ మెలానియా ఇక్కడి పాఠశాలను సందర్శించి అక్కడి కార్యక్రమాలను చూడాలని ఆసక్తిగా ఉన్నారు. ఇదిలా ఉంటే గతంలో అధ్యక్షులతో కలిసి భారత పర్యటనకు వచ్చిన ప్రథమ మహిళలు ఇక్కడ కొన్ని ప్రదేశాలను సందర్శించారు.

1962లో అమెరికా అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌ కెన్నడీ లేకుండానే ప్రథమ మహిళ జాక్వెలైన్‌ కెన్నడీ భారత్‌ను పర్యటించారు. మనదేశంలోని ఎన్నో దర్శనీయ స్థలాలను చూసారు. రాజస్థాన్‌లోని ఒంటెనెక్కి తిరిగారు. గంగానదిలో పడవపై ప్రయాణం చేశారు. ఉద§్‌ుపూర్‌ ప్యాలెస్‌లో విందు చేసారు. తాజ్‌మహల్‌ను సందర్శించారు. రిచర్డ్‌ నిక్సన్‌ సతీమణి ప్యాట్‌ నిక్సన్‌ మనదేశానికి వచ్చారు. కాని ఒక్కరోజు మాత్రమే ఉన్నారు. జిమ్మీకార్టర్‌తో కలిసి భారత్‌ సందర్శనకు వచ్చిన రోజలిన్‌ కార్టర్‌ భారత్‌లో రెండు రోజులు ఉన్నారు. వీరు దక్షిణ ఢిల్లీ సమీపంలోని ఛుమా ఖేరాగావ్‌ను సందర్శించి ఆ ఊరికి ఒక టివి బహూ కరించారు. అక్కడి మహిళలు

ప్రథమ మహిళ రోజలిన్‌కు నుదుట బొట్టు పెట్టారు. వీరు సందర్శించిన ఆ ఊరి పేరును కార్టర్‌పురి అని మార్చారు. ఇప్పటికి ఆ పేరు అలాగే ఉంది. ఇక అమెరికా ఉపాధ్యక్షుడి హోదాలో భారత్‌ పర్యటనకు వచ్చిన హెచ్‌ డబ్ల్యు బుష్‌ సతీమణి బార్బరా బుష్‌ తాజ్‌మహల్‌ను సందర్శించారు. ఆ తరువాత బుష్‌ అమెరికా అధ్యక్షుడయ్యారు. అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌ సతీమణి హిల్లరీ క్లింటన్‌ కూతురు చెల్సియాతో కలిసి భారత్‌ను సందర్శించారు.

ఆమె కూతురుతో కలిసి అనేక దర్శనీయ స్థలాలకు వెళ్లారు. హిల్లరీ కోల్‌కతాలో మదర్‌థెరిసా అంత్యక్రియలకు కూడా హాజరయ్యారు. భర్త జార్జి డబ్యూబుష్‌తో కలిసి వచ్చిన ప్రథమ మహిళ లారాబుష్‌ భారత్‌లో ఢిల్లీలోని ఒక పాఠశాలను, జీవన్‌జ్యోతి దివ్యాంగుల హోంను, రాజ్‌ఘాట్‌ను, నోయిడాలోని ఫిల్మ్‌సిటీని సందర్శించారు. హైదరాబాద్‌కు కూడా వచ్చారు. అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా సతీమణి మిషెల్‌ ఒబామా అయితే భారత్‌లో సాదాసీదా మహిళలాగా సంచరించారు. ముంబయిలోని ఒక పాఠశాలలో పిల్లలతో కలిసి ఆడిపాడి అందరినీ ఆకట్టుకున్నారు. ముంబయి యూనివర్సిటీలో ఆమె ప్రసంగించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/