జీవిత ప్రయాణంలో ఎన్నో మజిలీలు

Many marvels in the journey of life

నీ జీవితమే నీకు టీచర్‌, నీజీవనగమనంలో అది నిరంతరం పాఠాలు నేరు తూనే ఉంటుంది. ఒక రోజు ప్రేమ, స్నేహాన్ని అడిగిందట…. ప్రపంచమంతా నేను ఉండాగా, మళ్లీ నువ్వెందుకు ఇక్కడ అని. స్నేహం నవ్వుతూ చెప్పిందిలా…. ఎక్కడైతే నువ్వు కన్నీరు మిగులుస్తావొ…. అక్కడ చిరునవ్వులు పూయించడానికి అని. బ్రతికే ప్రతిక్షణం మనల్ని ప్రేమించేవారితో బ్రతకడమే జీవితం. ఎందుకంటే మనం మరణించాక ఈజీవితమే వారికి మధురజ్ఞాపకం. ఎక్కువ కాలం బతకాలని కాదు బతికిన నాలుగు నాళ్ళు బాగా బతకాలని కోరుకోవాలి. కొందరు గొప్పవారుగా జన్మిస్తే, మరికొందరు గొప్ప వారిగా జీవిస్తారు. మరికొందరు గొప్పవారిగా చేయబడతారు ‘నేను ‘నాది ‘నువ్వు ‘నీది అనే నాలుగు విషయాలు జీవితాన్ని పాడు చేస్తాయి. వాటిని మరచిపోవాలి.

జీవితం అంటే జననానికి మరణానికి మధ్య ఉండే చిన్న ఖాళినే. ఈచిన్న ఖాళిలో మీకు వీలైనంత వరకు సంతోషంగా ఉండండి. ఇతరులను సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నించండి. జీవితంలో ప్రతిక్షణాన్నీ సంతోషంగా ఆస్వాదించండి గెలిచేవరకు తెలియదు కావలసినవాళ్లు ఉన్నారని! డబ్బు సంపాదించే వరకు తెలియదు ప్రేమించే వాళ్లున్నారని, పలుకుబడి పెరిగే వరకు తెలియదు పలుకరించే వాళ్లున్నారని, పైవన్నీ పొగొట్టుకుంటే కాని తెలియదు ఎంత మంది మనతో ఉన్నారని! ఒక మనిషి గెలవడానివకి వంద సూత్రాలు కావాలి. అందులో అన్నింటికన్నా మొదటిది తనని తను కరెక్టుగా తెలుసుకోవడం. మిగితా తొంబైతొమ్మిది అంతగా ప్రాముఖ్యం లేనివి. అందంగా ఉండడం అంటే మనకు నచ్చేలా ఉండటం కానీ, ఎదుటి వారికి నచ్చేలా ఉండటం కాదు. అందం నిన్ను అందరు కొంతకాలమే గుర్తుంచుకునేలా చేయగలదు.

అదే మంచి వ్యక్తిత్వం అయితే మనం పోయాక కూడా మనల్ని పోకుండా చేస్తుంది. అందంగా ఉండే వారికన్నా తన చూట్టూ ఉన్న వారిని ఆనందంగా ఉంచేవారితోనే మన జీవితం సంతోషంగా ఉంటుంది. ఇతరులు విమర్శిస్తున్నప్పుడు నువ్వు ఆలోంచించు. ఇతరులు నిద్రిస్తున్నప్పుడు నువ్వు ప్రణాళిక వెయ్యి, ఇతరులు మాట్లాడుతున్నప్పుడు నువ్వు విను. ఇతరులు వాయిదా వేస్తున్నప్పుడు నువ్వు పని చేయ్యి మంచి మంచి ఆలోచనతో అంతరంగిక సౌందర్యానికి ప్రాణం పోస్తుంటాయి. సాటివారిని, తోటివారిని ప్రేమించేగుణాన్ని అలవరుచుకోండి. శత్రువులను మీకు హానిచేయాలని చూసే వారిని కూడా ప్రేమించండి. అదే మీకు ఎనలేని విధంగా మిత్రులను సంపాదించి పెడుతుందన్నది కాదనలేని నిజం. జీవితమన్నాక ప్రయాణంలో ఎన్నో మజిలీలు ఉంటాయి. అందులో కొన్ని ఆనందం కలిగించవచ్చును. మరికొన్ని బాధ కలిగించవచ్చును.

రెండింటినీ ఆనందంగానే స్వీకరిస్తూ సాగిపోండి. ఎప్పుడూ ఎటువంటి ప్రయత్నం లేకుండా గెలుపును ఆశించకండి. ఆప్రయత్నంగా సాధించే గెలుపుకంటే మనం కష్టపడి మన ప్రయత్నంతో సాధించే గెలుపు మనకు ఆత్మసంతృప్తి సంతోషాన్ని ఇస్తుంది. అంతేకాదు ప్రయత్నంలేకుండా, కష్టపడ కుండా గెలుపును ఆశించడం ఎడారిలో మంచినీటి కొసం వెతకడంలాంటిది. నిత్యం మిమ్మల్ని మీరు ఆత్మ విమర్శచేసుకోండి. ఆరోజు చేసిన తప్పులు మీకు తెలుస్తాయి. లేదా వాటిని చేయకుండా ఉండటానికి ప్రయత్నించండి. వివేకానందుడు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే కలిగే జ్ఞానం జీవితం మొత్తం మీద గడిచిన అనుభవపాఠంతో సమానమన్నారు. మీరు ఎంచుకున్న లక్ష్యం ఉన్నతంగా ఉండాలి. లక్ష్యం ఉన్నతంగా ఉన్నంత మాత్రాన సరిపోదు. ఈలక్ష్యాన్ని సాధించటానికి అనుసరించే మార్గాలు కూడా ఉన్నతంగా ఉన్నప్పుడే ఆలక్ష్య సాధనకు నిజమైన సార్ధకత లభిస్తుంది. అలాకాకుండా ఉన్నత లక్ష్యాన్ని సాధించడానికి అవకతవక మార్గాలు ఎన్ను కోవడం ఎట్టి పరిస్ధితులలోను మంచిదికాదు ఎదురు దెబ్బలను ఎదిరించేతత్వాన్ని అలవరుచుకోండి.

అయితే మీపై నమ్మకాన్ని కోల్పోకండి. ఎందుకంటే ఎదురు దెబ్బలు తగిలితేనే సాధించాలనే పట్టుదల పెరుగుతుంది ఆపట్టుదల విజయకాంక్షను మరింత పెంచుతుంది. దాని వల్లనే జీవితానికో అర్థం పరమార్ధం ఏర్పడుతుందన్న చాచా నెహుగారి మాటాలను సదా జ్ఞప్తికి తెచ్చుకోండి. అంతేకాదు గాలిపటం పైకి లేచేది ఎదురుగాలిలోనే అన్న సత్యాని గ్రహించండి. ఎప్పుడూ ఆశావాదిగా జీవించండి నిరాశావాదిగా మారారంటే ఏం సాధించలేరని గుర్తుంచుకోండి. ఉదహరణకు సగం నీళ్ళున్న గ్లాసును చూసి నిరాశావాది మిగతా సగం నీళ్ళు లేవని బాధపడితే, ఆశావాది గ్లాసులో సగం నీళ్లైనా ఉన్నాయని సంతోష పడుతాడు. అదే ఆశావాది.

నిరాశావాదులకు మధ్య ఉన్న తేడా. నిరాశావాది గులాబి చేట్టులో ముళ్లను చూసి నిరాశాపడితే, ఆశావాది అందమైన గులాబి పువ్వును చూసి సంతోషపడుతాడు. మీచూట్టూ ఉన్న వ్యక్తుల గురించి తెలుసుకొని వారితో వారి మనస్సు నొప్పించని రీతిలో ప్రవర్తించండి. ఇతరుల గురుంచి తెలుసుకోవడం అంటే వారి వ్యక్తి గత జీవితాలలో తొంగిచూడటం కాదు. వారి గురించి కొంత మైరనా తెలుసుకోవడం వారితో స్నేహం చేయటానికి అవసరం. సానుకూల ఆలోచన దృక్పధం కలిగి వుండాలి. సానుకూల ఆలోచనలు వున్న వారికి ఆనందం నీడలా వెంటే వుంటుంది. జీవింతంలో ఆఖరి శ్వాస విడిచేంతవరకు మీ జీవితానికి ఏదో ఒకప్రయోజనాన్ని కల్పించుకోవాలన్న తలంపుతో ఉండండి. అంతే కాని వయస్సు మీద పడింది. ఏమీ చేయలేం. ఏమీ చేతకాదు అనే భావనను దరిచేరనీయకండి.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/