గొడవలకు కారణం తెలుసుకోండి

‘మనస్విని
(ప్రతి శనివారం)

Manaswini Feature
Sarrow

నమస్కారం మేడమ్‌. నాపేరు సుష్మ. నాకు 35 సంవత్సరాలు. మా కుటుంబంలో అందరం ఆనందంగా ఉన్న సమయంలో ఒక సమస్య వచ్చింది. మా ఆడపడుచు వాళ్ల భర్తతో గొడవపడి మా ఇంటికి వచ్చింది. ఎన్నోసార్లు నచ్చచెప్పి పంపినా మళ్లీ తిరిగి తన భర్తతో గొడవపడి వచ్చింది. ఇప్పుడు ఆస్తిలో వాట ఇవ్వండి లేకపోతే చచ్చిపోతా అంటూ భయపెడుతుంది. ఈ సమస్య వల్ల మా ఇంట్లో ఎవరూ సరిగా మాట్లాడుకోవడం లేదు. ఏం చేయాలో ఆందోళనగా ఉంది. మా ఆడపడచుతో నేను ఎన్నోసార్లు గొడవపడ్డాను, ఎంత నచ్చచెప్పినా వినడం లేదు. నాకు చాలా భయంగా ఉంది. ఈ సమస్యకు పరిష్కారం చూపండి మేడమ్‌. సుష్మ, ఖమ్మం

మీరు తప్పక ఈ సమస్యల నుండి బయటపడగలరు. ముందుగా మీరు చాలా స్పష్టత తెచ్చుకోవాలి. గొడవలు పడకూడదు. పోట్లాటలు పెట్టుకోరాదు. విజ్ఞతతో ఉండాలి, చక్కగా వ్యవహరించాలి. ఎదుటి వారిని అర్ధం చేసుకోవాలి. కుటుంబ సభ్యుల మధ్య ఆదరాభిమానాలుండాలి. నమ్మకం ఉండాలి. విరోధులుగా పోట్లాటలు పెట్టుకోకూడదు. ప్రేమ, అనుబంధాలు, ఆప్యాయతలు ఉండాలి. ద్వేషం, అనుమానం ఉండకూడదు. కుటుంబసభ్యులు ఒకరి నష్టం ఇంకొకరు అర్ధం చేసుకోవాలి. ఏదైనా కష్టం వస్తే, ఆ సమస్యలను పరిష్కరించుకోవాలి. కోపతాపాల వల్ల ఏ సమస్యా పరిష్కారం అవ్వదు. గృహవాతావరణ ఆనందంగా ఉంచుకోవాలి. పరస్పరం సహకరించుకోవాలి. సానుకూలంగా ఆలోచించాలి. వివేకంతో సమస్యలు పరిష్కరించుకోవాలి. సమస్యను చక్కగా అర్ధం చేసుకొని, తగు పరిష్కార మార్గాలను అన్వేషించాలి. ఒకరినొకరు గౌరవించుకోవాలి. అందరిలోనూ మంచి చెడులుంటాయి. ప్రేమ ఉన్నప్పుడు తప్పులు కనబడవు. ప్రేమ తగ్గిపోతే, అన్నీ తప్పులుగానే కనబడతాయి. అందువల్ల ఒకరితో ఒకరు ప్రేమగా, ఆప్యాయ తలతో ఉండాలి. ఆత్మవిశ్వా సంతో ఉండాలి. ధైర్యంగా ఉండాలి. అవగాహన అత్యంత ముఖ్యమైనది. స్పష్టత ఉంటే, ఎన్నో క్లిష్ట మైన సమస్యలు సులువ్ఞగా పరిష్కరమవ్ఞతాయి.

చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలి

నమస్కారం మేడమ్‌. నాపేరు దీప. నాకు 40 సంవత్సరాలు. పెళ్లైన 5 సంవత్సరాలకు ఒక అబ్బాయి పుట్టాడు. ఇప్పుడు నేను ఇంకో అమ్మాయిని దత్తత తీసుకుందాం అనుకుంటున్నా. నా భర్త కూడా దత్తత తీసుకోవడానికి ఎలాంటి సమస్య లేదు అన్నారు. కాని భవిష్యత్తులో మా అబ్బాయి ఏమైనా సమస్యలు తీసుకుని వస్తాడేమో అని భయంగా ఉంది. మళ్లీ మా అబ్బాయికి తన సొంత చెల్లి కాదని, మా అమ్మాయి కాదని తెలిస్తే కుటుంబంలో ఏమైనా సమస్యలు వస్తాయనే ఆందోళన ఉంది. ఏమైనా ప్రమాదం సంభవిస్తుందేమోననే ఆందోళన, భయంగా ఉంది. ఈ సమస్యకు పరిష్కారం చూపండి మేడమ్‌. దీప, హైదరాబాద్‌


  • మీరు తప్పక ఈ సమస్య నుండి తేలిగ్గా బయటపడగలరు. మీ అబ్బాయి గురించి ఆందోళన అవసరం లేదు. పిల్లలు మీరు ఏది చెప్తే, అదే వింటారు. మీరు ఎలా మలిస్తే, అలాగే ఉంటారు. అంఉవల్ల మీ అబ్బాయి గురించి చింతించనవసరం లేదు. పెంచుకొంటే. స్వంతపిల్లల మాదిరిగానే ప్రేమగా ఉంటారు. సొంతపిల్లలు, పెంచిన ఇల్లలు అన్న తేడా ఉండదు. ఏదిఏమైనా, మీ భార్యాభర్తలు, పూర్తిగా చర్చించుకొని, ఆమోదయోగ్యమైన పరిష్కారమార్గాన్ని చూడండి. ఎందువల్లనంటే, ఇవన్నీ చట్టరీత్యా జరగాలి. దత్తత అనేది బాధ్యతతో కూడినపని. పిల్లల బాధ్యత చాలా ఉంటుంది. దత్తత కూడా ఎంతో నిశితంగా ఆలోచించి, క్షుణ్ణంగా పరిశీలించి, స్పష్టతతో తీసుకోవాల్సిన నిర్ణయం. మీకు వనరులు మంచిగా అందుబాటులో ఉండాలి. ఆర్థికంగా పటిష్టతతో ఉండాలి. మీ భార్యాభర్తల బంధం పటిష్టంగా ఉండాలి. ఆత్మవిశ్వాసం ఉండా లి. బాధ్యతలను చక్కగా నెరవేర్చగల సామర్థ్యం ఉండాలి. ఇవన్నీ చక్కగా జరగాలంటే, అవగాహన ఉండాలి. ధైర్యం ఉండాలి. నేర్పరితనం, తెలివితేటలు ఉండాలి. దృఢమైన నిర్ణయం తీసుకోవటానికి అవసరమైన ఉద్వేగ పరిపక్వత ఉండాలి. ఆనందంగా నిర్ణయం తీసుకోగలగాలి.
    -డాక్టర్‌ ఎం. శారద,సైకాలజీ ప్రొఫెసర్‌