మూఢ నమ్మకాలను నమ్మొద్దు

‘మనస్విని
ప్రతిశనివారం

Sarrow
Sarrow

నమస్కారం మేడమ్‌. నాపేరు ఉమారాణి. నాకు 27 సంవత్సరాలు. నాకు ఇంకా పెళ్లి కాలేదు. మా అక్కలకి ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. ఇన్ని సంవత్సరాలు అయినా నాకు పెళ్లి కానందుకు నా గురించి అందరూ తప్పుగా అనుకుంటున్నారు. నా జీవితంలో దోషం ఉండడం వలన నాకు పెళ్లి పట్లేదని సిద్ధాంతి చెప్పారు. దాని గురించి మేం బాధపడటం లేదు. కానీ నా గురించి నలుగురు చాలా తప్పుగా అనుకుంటున్నారని నా తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. చాలామంది నన్ను చూడడానికి వచ్చిన వాళ్లు ఒకే చెప్తున్నారు కానీ బయటివారి మాటలు విని వెళ్లిపోతున్నారు. నాకు చనిపోవాలనే ఆలోచనలు చాలాసార్లు వచ్చాయి. కానీ నేను చనిపోతే పిరికిదాన్ని అవ్ఞతాను, బతికి సాధించాలని ఇన్ని రోజులు నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను కానీ ఈ సమాజం నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. అసలు ఏం చేయాలో అర్థంకాక చాలా బాధపడుతున్నాను. దీనికి ఏమైనా పరిష్కారం ఉంటే చెప్పగలరా మేడమ్‌. – ఉమారాణి

మీరు తప్పక ఈ సమస్యల నుండి బయట పడగలరు. ముందుగా మీరు ఇలాంటి మూఢనమ్మకాల నుండి బయటపడాలి. ఎవరో ఏదో అన్నారని ఇలా బాధపడకూడదు. ఎప్పుడూ ఎవరో ఏదో ఒకటి అంటూ ఉంటారు. ముందుగా మీ గురించి మీకు తెలియాలి. మీ శక్తి సామార్థ్యాల గురించి మీకు తెలియాలి. ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి. ఇలాంటి ఆత్మన్యూనతను దగ్గరకు రానీయకూడదు. ధైర్యంగా ఉండాలి. మీకు తప్పక వివాహం జరుగుతుంది. ఆత్మహత్య అనే ఆలోచనే రాకూడదు. జీవితం అమూల్యమైన వరం. ఈ జీవితంతో ఏ పనినైనా సులువ్ఞగా చేయవచ్చు. అన్నీ సాధ్యమే. ఏది కావాలంటే అది చేయవచ్చు. జీవితం అపూర్వమైన వరాల మూట. అందువల్ల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. సానుకూలమైన ఆలోచనలు పెంపొందించుకోవాలి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. స్పష్టత, అవగాహనతో ఉండాలి. జీవితంలో ఎన్నో ఆనందాలున్నాయి. ప్రతిక్షణం విలువైంది. ప్రతిరోజూ అమూల్యమైనది. వర్తమానంలో జీవించాలి. మంచి మూర్తిమత్వం, మంచి ఉద్వేగాలతో జీవితాన్ని సంపూర్ణమైన ఆనందంతో ఆస్వాదించాలి. ఉత్ప్రేరదాయకమైన ప్రసంగాలు వినాలి.

మీకిష్టమైన కోర్సు చేయండి

నమస్కారం మేడమ్‌. నాపేరు సుజాత. నేను బిఎస్‌సి చదువుతున్నాను. నాకు ఈ డిగ్రీ చేయడం ఇష్టం లేదు. కానీ మా నాన్నగారు ఏంకాదు చదవమని చెప్పారు. మానాన్నగారి మీద గౌరవంతో చదువుతున్నాను. కానీ ఈ డిగ్రీ కోర్సు వదలాలంటే నాకు పెళ్లి ఒకటే మార్గం అనుకుని నా తల్లిదండ్రులు పెళ్లి చేస్తామని చెప్పగానే తొందరగా ఒప్పుకున్నాను. నేను ఈ డిగ్రీ కాకుండా వేరే ఏమైనా మంచి డిగ్రీ చేయాలన్న కోరికతో పెళ్లికి ఒప్పుకున్నాను. డిగ్రీలోంచి తొలగిపోవడానికి నేను పెళ్లి చేసుకోవడం కరెక్టెనా? నాకు ఏమీ తోచడం లేదు. అయోమయస్థితిలో ఉంటున్నాను. మేడమ్‌ దయచేసి నాకు పరిష్కారం చెప్పగలరు. – సుజాత

మీరు తప్పక ఈ సమస్యను తెలివిగా పరిష్కరించుకోగలరు. ముందుగా జీవితంపై స్పష్టత తెచ్చుకోవాలి. ఇలాంటి సందిగ్ధంతో, చాలా సమస్యలు ఎదుర్కొవలసి వస్తుంది. ఇష్టమైన కోర్సు మాత్రమే చదువ్ఞకోవాలి. ఇష్టం లేకపోతే చదవలేరు. వివాహం చేసుకోవాలంటే మానసిక పరిపక్వత అవసరం. ఉద్వేగ పరిపక్వత అవసరం. వివాహం అనేది బాధ్యతతో కూడిన వ్యవహారం. సందిద్ధత ఉన్నప్పుే వివాహం చేసుకోవాలి. వివాహానికి సంసిద్ధత లేకపోతే, వివాహం చేసుకోకూడదు. చదువు, ఉద్యోగం, వివాహం బాగా చేసుకోవాలంటే, మానసిక ఆరోగ్యంగా, సంసిద్ధతతో, పరిపక్వతతో ఉండాలి. ఇలాంటి నిర్ణయాలు అవగాహనతో, స్పష్టతతో తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్లు, అపరిపక్వతతో నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రతినిత్యం స్పష్టతతో, అవగాహనతో, సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ప్రతి నిర్ణయం, ఆనందానికి దారి తీయాలి. ప్రతి నిర్ణయం అవగాహనకు, ఉత్సాహానికి దారితీయాలి. ఉద్వేగపరంగా, ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉండాలి. మీ మూర్తిమత్వం, మిమ్మల్ని ఆనందంగా ఉంచాలి. జీవితం ఉత్సాహభరితంగా మలచుకోవాలి. ఇది తప్పనిసరి. విలువైన జీవితాన్ని సంపూర్ణంగా ఆనందించాలి.

  • డాక్టర్‌ ఎం. శారద, సైకాలజీ ప్రొఫెసర్‌