మేకప్‌ మెలకువలు

Makeup Tips
Makeup Tips

మేకప్‌ చేసుకోవడమూ ఒక కళే. ఏ క్రమంలో మీరు మేకప్‌ను మొదలుపెడతారనే దానిమీదే చివరగా తీర్చిదిద్దిన మీ రూపం ఆధారపడి ఉంటుంది. అందుకే మేకప్‌ వేసుకునే క్రమాన్ని ఒక్కసారి గమనించండి. మేకప్‌ సరియైన క్రమంలో చేసుకుంటే మీరు కోరుకునే మెరుపు మీ సొంతం-
్య కంటికి వేసుకునే మేకప్‌లు రకరకాలుగా ఉంటాయి. వీటిలో ఏది మొదట ఏది తర్వాత వేసుకోవాలో తెలుసుండాలి. కంటికి మొదట షాడో, తర్వాత మస్కారా వేసుకోవాలి. దీనివల్ల అంతకు ముందు కంటిమీద వేసుకున్న మేకప్‌ ఏదైనా మిగిలిపోయినా పెద్దగా ప్రభావం ఉండదు. దీని తర్వాత అండర్‌ ఐ కన్సీలర్‌తో ఫినిషింగ్‌ ఇవ్వాలి. ఫౌండేషన్‌లో కూడా రెండు మూడు రకాలు కలిపి కొత్తరకం తయారుచేసుకుని బుగ్గల రంగుగా ఉపయోగించవచ్చు. ఇది వేసు కున్న తర్వాత తప్పకుండా కవరింగ్‌ చేసుకో వాలి. లేదంటే మీరనుకున్న రూపం మారే ప్రమాదం ఉంది. అయితే ఇది ఫౌండేషన్‌ రాసిన తర్వాతే వేసుకోవాలి. లేదంటే అటూ ఇటూ చెరిగిపోయే ప్రమాదం ఉంది. మొదట టి-జోన్‌ (నుదురు, ముక్కు, గడ్డం)కు పౌడర్‌ వేసుకోండి. ఇవి చివరగా చేయడం వల్ల రంగులు డల్లుగా మారే అవకాశం ఉండదు.