‘చెలి’ కానుక

Beautiful Lips

కొత్తిమీర ఆకు రసాన్ని రోజూ రాత్రుళ్ళు పెదాలకు రాసుకుంటే ఎర్రదనం వస్తుంది.

అరటి, యాపిల్‌ వంటి పండ్లపైన నిమ్మ రసం రాసి ఉంచితే నలుపెక్కకుండా నిల్వ ఉంటాయి.

మీరు పర్యావరణానికి మిత్రులేనా! ధర్మోరక్షతి రక్షితః అనే నానుడి పర్యావరణానికి బాగా వర్తిస్తుంది. పర్యావరణాన్ని మనం రక్షిస్తే అదీ మనల్ని కాపాడుతుంది. లేకపోతే మన వినాశనాన్ని మనమే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. అలాకాకుండా ఉండాలంటే- రీ సైక్లింగ్‌కి అవకాశం ఉన్న ఉత్పత్తులను మాత్రమే ఇంట్లో వస్తువులుగా వాడండి. మీరు నివసిస్తున్న ప్రాంతంలో రీ సైక్లింగ్‌ ప్రోగ్రామ్‌ లేకపోతే సంబంధిత అధికారులను అడగండి.

డిస్పోజబుల్‌ ఉత్పత్తులను కొంటున్నపుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. వాటి అవసరం ఉందా అని. మరీ తప్పని సరి అయితే ప్లాస్టిక్‌ వస్తువులను కాకుండా పేపరు ఉత్పత్తులనే వాడండి. ఇవి నేలలో కలిసి పోతాయి. ఓజోన్‌ పొరని దెబ్బతీసే పర్యావరణ కాలుష్యంగా మారవు. ప్లాష్టిక్‌ డబ్బాలు, కవర్లలో ఉన్న ఆహార ఉత్పత్తులను ఎక్కువగా వాడకండి. షాపింగుకి వెళుతున్నపుడు మీ సొంతవైన సంచులు తీసుకువెళ్ళటం అలవాటు చేసుకోండి. పేపర్‌, ప్లాస్టిక్‌ కప్పులకు బదులు పింగాణీవి వాడితే మేలు.

కూరగాయల తొక్కలు, గుడ్ల పెంకులు, వంటివి మొక్కలకు వేయండి. ఒక వేళ మీ ఇంట్లో మొక్కలు లేకపోతే వాటిని దగ్గరలోని పచ్చనిప్రాంతాల్లో వేయండి.

ప్లాస్టిక్‌ డబ్బాలు, గాజు గ్లాసులు వంటివాటిని పెన్సిళ్ళు, పిల్లల బొమ్మలు వేసుకునేందుకు ఇతర గహ అవసరాలకు వాడండి.

స్వచ్ఛమైన ఆముదం కంటిచుట్టూ, బుగ్గలకు ప్రతిరోజూ రాస్తే ముడతలు పడవ్ఞ. బాదం పొడిని పాలలో నూరి కళ్ళచుట్టూ రాసి, 15నిమిషాల తర్వాత ఐస్‌ముక్కతో తుడిస్తే కళ్ళకింద నల్లని చారలు, ముడతలు పోతాయి.

మూడు చుక్కల పన్నీరును చిక్కటి పాలలో కలిపి దానిలో చిన్న స్పాంజి ముక్క వేసి, ఫ్రిజ్‌లో అరగంట ఉంచిన తర్వాత ఆ స్పాంజిని కొద్దిగా పిండి దానిని కళ్ళపై ఉంచితే కళ్ళమంటలు తగ్గుతాయి.

Ladies tips
Eye Care Tips

కళ్లు తడి ఆరిపోకుండా శ్రద్ధ వహించాలి. కళ్ళ చుట్టూ వేజలైన్‌ పూస్తే మంచిది. ఆల్మండ్‌ ఆయిల్‌ కాని విటమిన్‌ ‘ఇ ఆయిల్‌గానీ కంటిచుట్టూ రాయాలి. అరగంట తర్వాత దూదిని నీళ్లలో తడిపి తుడిస్తే మంచిది. ఆ తర్వాత చిక్కటి పాలలో దూదిని ముంచి కళ్ళచుట్టూ సున్నితంగా రాస్తే చర్మానికి తగినంత మాయిశ్చరుగా ఉంటుంది.

కమలాపళ్ళతొక్కల్ని బాగా ఎండబెట్టి తర్వాత మెత్తగా చూర్ణం చేసి మనకు కావలసినప్పుడు కొద్దిగా తీసు కొని దానిని పెరుగులో కలిపి ఉంచితే అది పేస్టులా తయారవుతుంది. దానిని బాగా రంగరించిన తరువాత ముఖానికి రాసుకుని గంట తర్వాత చన్నీళ్లతో కడిగితే ముఖవర్చస్సు పెరిగి మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.