మేకప్‌ రంగులతో ఇబ్బంది లేకుండా..

Ladies Makeup
Ladies Makeup

మేకప్‌ వేసుకోవటంలో ఉన్న ముఖ్యమైన పరమార్థం అందంగా కనిపించడమే. అయితే ఆ కనిపించడం మరింత ఆకర్షణీయంగా మరికాస్త ఎక్కువ సమయంపాటు ఉంటే మరీ మంచిదికదా, అందుకోసం-
్య పెదవులకు లిప్‌స్టిక్‌తో పాటు లిప్‌లైనర్‌ని తప్పకుండా వాడాలి. లిప్‌స్టిక్‌ వేసుకునే ముందు పెదవులకు మొత్తం లిప్‌లైనర్‌ వేయాలి. దీనివల్ల లిప్‌స్టిక్‌ ఎక్కువ సమయం ఉంటుంది.
పెదవులకు మధ్య ప్రాంతంలో లిప్‌గ్లాస్‌ని వేయాలి. దీని వల్ల పెదవులు నిండుగా కనిపిస్తాయి.
్య మస్కారాని ఎల్లప్పుడు వాటర్‌ప్రూఫ్‌దే వాడాలి. కింది రెప్పకి వాడకూడదు. మొహానికి సరిగ్గా సమంగా ఉందో లేదో చూసుకుని ఆపై పౌడర్‌ని వేసుకోండి. ఎందుకంటే పౌడర్‌ వేసుకున్నాక అప్పుడు ఫౌండేషన్‌కి సంబంధించిన మార్పులు చేయటం కుదరదు.
నల్లటి లేదా బాగా ముదురు రంగు ఐలైనర్‌ని వాడకండి. ఇవి మీ కళ్లని ఫొటోల్లో చిన్నవిగా కనిపించేలా చేస్తాయి.
్య ఏదైనా పార్టీ లేదా ఫంక్షన్‌ ఉన్నపుడు ఆ రోజుకి ముందురోజే వాక్సింగ్‌, ఫేషియల్‌ చేయించుకోవటం మంచిపని కాదు. మీరు ఫంక్షన్‌కి వెళ్లాలనుకున్న రోజుకి కనీసం ఐదురోజుల ముందే ఇవి చేయించుకోవాలి.
్య మీ చర్మం జిడ్డుగుణం కలిగినదైతే ఫౌండే షన్‌కి ముందు మాయిశ్చరైజర్‌ని వాడకండి.
మేకప్‌ మార్పులు ఇలా
ఎప్పుడూ ఒకటే రంగు లిప్‌స్టిక్‌ కాకుండా వేరువేరు రంగులవి వాడుతూ ఉండాలి. కాటుక, ఐ లైనర్‌ వేసుకునే అలవాటు లేనివారు అలవాటు చేసుకుంటే అదో మార్పు. ముదురు రంగు మేకప్‌ చేసుకుంటే మరో మార్పు. ఈ రంగు మేకప్‌ వేసుకునే వారు న్యూడ్‌ రంగు మేకప్‌కు మారాలి. ఇందులోనూ క్రీమ్‌ గులాబీ ఎంపిక చేసుకోవాలి. దానితో పాటు మెరిసే ఐ షేడ్‌, న్యూట్రల్‌ రంగు బ్లష్‌ చేసుకోవాలి. రాత్రిపూట కళ్లకు కాస్త ముదురు రంగు లుక్‌ ఇచ్చుకోవాలి. నల్లని ఐ లైనర్‌కు బదులుగా డార్క్‌ బ్రౌన్‌ షేడ్‌ వాడి చూడండి. న్యూడ్‌ మేకప్‌ వేసుకునేవారు కాస్త ముదురు రంగులోకి మారితే మంచిది. మస్కారా రెండు కోట్లు సరిపోతే, మరో కోట్‌ తేలిక గులాబీ లేదా పీచ్‌ రంగు బ్లష్‌తో ముఖాన్ని హైలెట్‌ చేసుకోవాలి.
మార్పు అనేది జీవితంలో అత్యంత సహజం. కనుక మేకప్‌ చేసుకునే విధానంలోనూ మార్పులు తెచ్చుకొని అందరినీ దృష్టిని మీ వైపున ఆకర్షించుకోండి మరి.