బొట్టుతో దృష్టిదోష నివారణ!

Ladies Bindi
Ladies Bindi

మనుషుల్లో కొందరు క్రూరస్వభావం కలిగి ఉంటారు. వారు ఎల్లవేళలా ఇతరులపైన అసూయాద్వేషాలతో రగిలిపోతూ ఇతరుల వినాశనాన్ని కోరుకుంటూ ఉంటారు. వారి మనసులోని చెడు ఆలోచనల ప్రభావమంతా వారి చూపుల ద్వారా ఇతరులపైన ప్రసరిస్తూ ఉంటుంది. మానవ శరీరంలో అన్ని భాగాల కన్నా ముఖభాగమే అత్యంత ప్రధానమైనది. ఎవరు ఎవరితో మాట్లాడాలన్నా ముఖం చూసే మాట్లాడగలుగుతారు. అందువల్ల పైన తెలిపిన క్రూర స్వభావం కలిగినవారు ఇతరులతో మాట్లాడేటప్పుడు వారి ముఖం చూసి ”అబ్బా వీరి ముఖం ఎంతందంగా ఉంది అని పలుమార్లు మనసులో అసూయపడతారు. అలా వారి అసూయా చూపుల ద్వారా ఎదుటివారిలోకి ప్రసరించి క్షణాల్లో వారికి తలనొప్పి కలగడం ఎంతో సేపటికిగాని అది తగ్గకపోవడం నిత్యజీవితంలో మనమందరం గమనిస్తూనే ఉంటాం.

అందుకే ఈ మానవ స్వభావాలపైన పరిశోధనలు చేసిన ఆయుర్వేద మహర్షులు ఇతరుల దృష్టిదోషం మరొకరికి అనారోగ్యం కలిగించకుండా నివారించడంకోసం కూడా ప్రతి మనిషి విధిగా బొట్టుపెట్టుకోవాలి అనే సదాచారాన్ని అలవాటు చేశారు.
బొట్టు పెట్టుకుంటే దృష్టిదోషం ఎలా నివారించబడుతుంది? అని మీకు సందేహం కలుగవచ్చు. బొట్టు ఎర్రగా నిండుగా కళకళ లాడుతూ ప్రకాశిస్తూ ఉండటం వల్ల ఇతరులు ముఖంలోకి చూడగానే వారి దృష్టిని ముందుగా ఈ బొట్టే ఆకర్షిస్తుంది. వారెంత ప్రయత్నించినా ముఖంలోని అందమైన ఇతర భాగాలవైపు చూడలేరు. ఈవిధంగా దృష్టిదోషం అనే సమస్య నుండి తప్పించుకోవడానికి మంచి ఆరోగ్యాన్ని పొందడానికే ఈ బొట్టు అనే విధానాన్ని ప్రవేశపెట్టారని మనం తెలుసుకోవాలి. నేటి స్త్రీలు గతంలో ఎవరికి వారు స్వయంగా తయారుచేసుకునే కుంకుమను బొట్టుగా ధరించ కుండా, విషరసాయన పదార్థాలతో తయారు చేసిన స్టిక్కర్లను బొట్టుగా వాడటం వలన భ్రుకుటి వద్ద చర్మరోగాలు వస్తున్నాయి. దీనివల్ల కొందరు స్త్రీలు బొట్టుపెట్టుకోలేకపోతున్నారు. కొందరు బొట్టు ధరించని వారు కూడా మేధావ్ఞలయ్యారు కాదా అని అనవచ్చు.

నిజమే, అయితే ఆ మేధావులు బొట్టు ధరించి ఉంటే మరింత మేధా సంపన్నులు అయ్యేవారని మరచిపోవద్దు. స్టిక్కర్‌ బొట్లకు అడుగున ఉండే రసాయనాల ప్రభావం వల్ల ఈ బొట్లను అతికించుకున్నవారికి కాలగమనం లో భ్రుకుటిపైన ముందుగా మచ్చలు పడ త§్‌ు. క్రమక్రమంగా ఆ మచ్చలే పుండుగా మారి బొట్టు పెట్టుకునే భాగమంతా నల్లగా వికృతంగా తయారై పుండు పడి ముఖసౌందర్యం దెబ్బతింటుంది. అందరూ ఏమైందీ ఏమైందీ అని అడగటం వల్ల వీరి మానసిక స్థైర్యం కూడా దెబ్బతిని క్రమంగా వీరు మానసిక రోగులుగా మారిపోతారు. ఈ సమస్య కోసం ఆస్ప్రతులకు వెళ్తే అక్కడ వైద్యులు ప్లాస్టిక్‌ సర్జరీ వంటి శస్త్రచికిత్సచేయాలని హడలకొడతారు.

Ladies Bindi

అంత ఖర్చు కష్టం లేకుండా ఓ సులభమైన విధానంతో ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అదేమిటంటే పరమశివ్ఞని పూజించే పరమపవిత్రమైన మహాఔషధవిలువలు గల మారేడు చెట్టును పూజించి మనసులోనే బాధను నివేదించి, ఆ చెట్టు నుండి కొన్ని ఆకులు తీసుకొచ్చి నీడలో ఆరబెట్టి దంచి జల్లించి పొడిచేసుకోవాలి. రోజూ రాత్రి నిద్రించేముందు తగినంత పొడిలో రెండుమూడు చిటికెల మంచి పసుపు కలిపి కొంచెం నీరు కూడా చేర్చి గుజ్జులాగా నూరి భ్రుకుటిపైన పుట్టినపుండుకు పట్టించి ఉదయం గోరువెచ్చని నీటితో కడుగుతుండాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే కొద్దిరోజుల్లోనే ఆ పుండు దాని తాలూకు మచ్చ పూర్తిగా హరించిపోయి తిరిగి సహజమైన చర్మపురంగు ప్రాప్తిస్తుంది.