‘చెలి’ చిట్కాలు

డిస్పోజబుల్ ఉత్పత్తులను కొంటున్నపుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. వాటి అవసరం ఉందా అని. మరీ తప్పని సరి అయితే ప్లాస్టిక్ వస్తువులను కాకుండా పేపరు ఉత్పత్తులనే వాడండి. ఇవి నేలలో కలిసి పోతాయి. ఓజోన్ పొరని దెబ్బతీసే పర్యావరణ కాలుష్యంగా మారవు. ప్లాష్టిక్ డబ్బాలు, కవర్లలో ఉన్న ఆహార ఉత్పత్తులను ఎక్కువగా వాడకండి. షాపింగుకి వెళుతున్నపుడు మీ సొంతవైన సంచులు తీసుకువెళ్ళటం అలవాటు చేసుకోండి. పేపర్, ప్లాస్టిక్ కప్పులకు బదులు పింగాణీవి వాడితే మేలు.
కొత్తిమీర ఆకు రసాన్ని రోజూ రాత్రుళ్ళు పెదాలకు రాసుకుంటే ఎర్రదనం వస్తుంది.
అరటి, యాపిల్ వంటి పండ్లపైన నిమ్మరసం రాసి ఉంచితే నలుపెక్కకుండా నిల్వ ఉంటాయి.
మీరు పర్యావరణానికి మిత్రులేనా! ధర్మోరక్షతి రక్షితః అనే నానుడి పర్యావరణానికి బాగా వర్తిస్తుంది. పర్యావరణాన్ని మనం రక్షిస్తే అదీ మనల్ని కాపాడుతుంది. లేకపోతే మన వినాశనాన్ని మనమే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. అలాకాకుండా ఉండాలంటే- రీ సైక్లింగ్కి అవకాశం ఉన్న ఉత్పత్తులను మాత్రమే ఇంట్లో వస్తువులుగా వాడండి. మీరు నివసిస్తున్న ప్రాంతంలో రీ సై క్లింగ్ ప్రోగ్రామ్ లేకపోతే సంబంధిత అధికారులను అడగండి.
కూరగాయల తొక్కలు, గుడ్ల పెంకులు, వంటివి మొక్కలకు వేయండి. ఒక వేళ మీ ఇంట్లో మొక్కలు లేకపోతే వాటిని దగ్గరలోని పచ్చనిప్రాంతాల్లో వేయండి.
ప్లాస్టిక్ డబ్బాలు, గాజు గ్లాసులు వంటివాటిని పెన్సిళ్ళు, పిల్లల బొమ్మలు వేసుకునేందుకు ఇతర గహ అవసరాలకు వాడండి.