చిన్నారుల్లో విపరీత ప్రవర్తనకు కారణాలు

KIDS- KIDS[/caption]

చిన్నారుల్లో విపరీత ప్రవర్తనకు కారణాలు

పిల్లల్లో ప్రవర్తనలో రెండు ప్రధాన భేదాలుంటాయి. వైద్యపరమైన కారణాల వలన వచ్చేవి మొదటి రకం. వీటిని ఆయుర్వేదంలో భూతోన్మాదం పేరుతో వర్ణించారు. వివిధ గ్రహాల పేర్లతోనూ, వాటికి సంబంధించిన లక్షణాలతోనూ ఈ స్థితుల వర్ణన సాగుతుంది.

నిజానికి ఇవి కొన్ని లక్షణాల సమూహాలు. గ్రహాల లక్షణాలతో వీటికి సారూప్యత ఉండటం వలన వీటికి గ్రహాల పేర్లు పెట్టారు. ఉదాహరణకు అహిపూతన, రేవతి ఇలాంటివి. ఇక రెండవ రకానికి చెందినవి పెంపకంలో లోపాల వలన కనిపించే విపరీత ప్రవర్తనలు. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. పిల్లలందరూ ఒకేలా ప్రవర్తించరు. ఒకే కుటుంబానికి చెందిన భేదాలుంటాయి.

అన్నతమ్ముళ్లు, అక్క చెల్లెళ్లలో కొంత మంది బుద్దిగా ప్రవర్తిస్తే మరికొంతమంది చిరాకు కలిగించే విధంగా ప్రవర్తి స్తారు. పిల్లలందరి ప్రవర్తన ఒకే విధంగా ఉన్నప్పటికీ అది కొంతమంది తల్లిదండ్రులకు అసహనంగా ఉంటే, ఇంకొందరికి ఆమోదంగా ఉంటుంది. అంటే పిల్లల విషయంలో ఏ విధంగా తేడాలుంటాయో, వారి తల్లిదండ్రులు లేదా పెద్దవారి విషయంలోనూ తేడాలుంటాయి.

ఈ రెండు రకాల మనస్తత్వాలనూ కలిపి విశ్లేషించాలి. మన పిల్లలు మనకు ఎంతగా ఇష్టమైనప్పటికీ, ఏదో ఒక సందర్భంలో వారి ప్రవర్తన ఇబ్బందిని, చిరాకును, అసహనాన్ని, కోపాన్ని తెప్పిస్తుంది. ఇలా జరిగినప్పుడు కోపాన్ని, విసు గునూ ప్రదర్శించకుండా సమస్య ఏమిటనేది నిదానంగా ఆలోచించి తగిన రీతిలో స్పందించాలి. ముందుగా సమస్య నిజంగా ఏ స్థాయిలో ఉందో తెలుసుకోండి.

మీకు ఆఫీసులోనో, ఇంట్లోనో, ఆరోగ్యపరం గానో, ఆర్థికంగానో ఏదైనా సమస్య ఉంటే, ఆ చిరాకు మీ చిన్నారి మీద ప్రతిఫలించి, తన ప్రవర్తన మీకు అసహాన్ని కలిగిస్తున్నదేమో గమనించండి. అదే జరుగుతుంటే ప్రవర్తన మార్చుకోవాల్సింది మీ చిన్నారి కాదు. మీరు. మీరు కొద్దిగా బ్రేక్‌ తీసుకుని హాయిగా రిలాక్స్‌ అవగలిగితే అన్నీ సర్దుకుంటాయి.
ఒక వేళ మీ పాప నిజంగానే సమస్యాత్మ కంగా ప్రవర్తిస్తుంటే నిద్రలో ఏమైనా భయంకర మైన కలలు వస్తున్నాయేమో ఆలోచించాలి. లేకపోతే కుటుంబంలోకి కొత్తగా తమ్ముడో, చెల్లెలో ప్రవేశించి మీ మొదటి చిన్నారిలో ఈర్ష్యాద్వేషాలను రగిలిస్తుండవచ్చు. అలాగే కొత్తగా ఇల్లు మారడం, ఆటలాడుకునే స్నేహితులు మారడం మొదలైనవన్నీ పిల్లల ప్రవర్తనలో మార్పు తెచ్చే అవకాశం ఉంటుంది.

ప్రతిరోజూ మీతోపాటు పడుకునే చిన్నారిని మీరు వేరే గదిలో పడుకోమంటే, కొత్త వాతావర ణానికి అలవాటు పడక పేచీ పెడుతున్నదేమో గమనించాలి. లేదా మీ చిన్నారి అలిగిన ప్రతి సారీ మీరు మరీ ఎక్కువగా బుజ్జగిస్తుండవచ్చు. ఇది కూడా ఆ చిన్నారి ప్రవర్తనలో మార్పు తీసు కువస్తుంది. అన్నిటికీ మించి మీ చిన్నారి సరిగ్గా ఏ సమ యాల్లో విసుగెత్తించే విధంగా ప్రవర్తిస్తున్నదీ గమనించండి. తనకు విసుగ్గా, బోర్‌గా అనిపిం చినప్పుడా? ఉద్విగ్నంగా ఉన్నప్పుడా? ఆకలిగా ఉన్నప్పుడా? లేక నిద్ర వచ్చినప్పుడా? అనే దానిపై దృష్టిపెట్టండి.
ఏం చేయాలి?: కుటుంబం, ఆచార వ్యవహారాలు తదితర అంశాలనుబట్టి పిల్లల ప్రవర్తనలు, వారు సృష్టించే సమస్యలూ అటూ ఇటూగా మారు తుంటాయి. ఫలానా వారిలో ఒక సూచన పని చేసిందని అందరిలోనూ సరిగ్గా అదే మాదిరి పరిష్కారం పని చేయకపోవచ్చు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనా సమస్యలను కొద్దిపాటి సంయ మనంతోనూ, పయోగాల తోనూ పరిష్కరించుకోవాలి.

మీకు ఏది సబబుగా ఉన్నదని తోస్తే అది చేయవచ్చు. కాకపోతే మీరనుకున్న పరిష్కార విధానాన్ని కొద్దికాలంపాటు కుదురుగా ఆచరించి చూడాలి. తండ్రి నియమం పెడితే తల్లి దానిని నీరు గార్చకూడదు. అయితే ఎవరైనా సరే పిల్లలకు ఎప్పుడూ శాసనాలను చేయకూడదు. ఏది ఎందుకు చేయాలో, ఏది ఎందుకు చేయ కూడదో, ఏది తప్పో, ఏది ఒప్పో వివరంగా, సోదాహరణంగా వివరించాలి. ఉదాహరణకు గోడమీదనుంచి తొంగి చూస్తున్నప్పుడు గబుక్కున వెళ్లి వాళ్లు భయపడేలా అదిలించకూడదు.

అప్పటికి ఆ విషయాన్ని మన స్సులో ఉంచుకుని, సందర్భం వచ్చినప్పుడు – ఉదాహరణకు పేపర్లో కానీ, సినిమాలో కాని ఎవరైనా పిట్టగోడ మీదనుంచి పడిపోయిన దృశ్యా న్ని చూసినప్పుడు, దానిని పిల్లల మనస్సుకు హత్తుకునే విధంగా చెప్పా లి. తప్పు చేసినప్పుడు దండించే కన్నా, మంచి చేసినప్పుడు గుర్తించి మెచ్చుకోవడమూ, ప్రోత్సాహపూర్వకమైన బహుమతులనివ్వడమూ చేయాలి.

ఏ పిల్లవాడిలోనూ దండించి సత్‌ప్రవర్తనను నేర్పలేము.