అందమే ఆభరణం

Jewellery

యావరేజ్‌గా ఉన్న వస్త్రధారణను సైతం ఆకర్షణీయంగా మార్చే శ్తి యాక్సరీలకు ఉంటుంది. అలాగని విపరీతంగా వాటిని ఖరీదు చేయాల్సిన అవసరం లేదు. సరైన యాక్ససరీస్‌ కొన్ని దగ్గర ఉంటే చాలు. అత్యంత ఆకర్షణీయంగా వస్త్రధారణ మార్చుకోవచ్చంటున్నారు. అలాగని వివాహాభరణాలోత ఉండే అనుబంధాన్ని తక్కువ చేసి చూపలేము. మాథాపట్టీ వధువు వివాహ సమయంలో సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తుంది. అందునా మాథా పట్టీలకు ఇప్పుడు డిమాండ్‌ బాగా పెరిగింది. తలకు సరికొత్త అందాలను పకలిస్తుండటం, సంప్రదాయాలను మీరకుండానే సమకాలీనతనూ చూపడం లేటెస్ట్‌ ట్రెండ్‌. ఇటీవలి కాలంలో పోల్కీ, కుందర్‌ తరహా వాటికి డిమాండ్‌ పెరిగింది. డ్రెస్‌ను బట్టి వీటిలోని రాళ్లను ఎంచుకునేలా వన్‌గ్రామ్‌ గోల్డ్‌ జువెలరీ ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది. నుదుటి విస్తీర్ణం బట్టి మాంగ్‌టిక్కా ఎంచుకోవాల్సి ఉంటుంది. మరీ పెద్దదిగా ఇది ఉంటే చూడటనికి బాగోదు. వీటిలోను జాదూ టిక్కాలు, కుందన్‌ పెరల్‌ ప్రెసియస్‌ స్టోన్‌ మాంగ్‌ టిక్కాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చెవిరింగులు భుజాల వరకూ వేలాడాలని ఇప్పటి అమ్మాయిలు కోరుకుంటున్నారు. అందునా బోల్డ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ అన్నది ఇప్పటి ట్రెండ్‌. స్టేట్‌మెంట్‌ ట్రెడిషనల్‌ జువెలరీతో పాటుగా అమ్మాయిలు ఇష్టపడుతున్న చెవి రింగులలో టియర్‌ డ్రాప్‌ షోల్డర్‌ ఇయర్‌ రింగ్స్‌ టియర్‌ డ్రాప్‌ ఇయర్‌ రింగ్స్‌ను ఇటీవలి కాలంలో అమ్మాయిలు అధికంగా కోరుకుంటున్నారు. చాండ్లియర్‌ ఇయర్‌ రింగ్స్‌కు ఎక్కువ డిమాండ్‌ ఉంది. అలాగే చాండ్‌బాలీను కూడా వధువులు బాగానే ఇష్టపడుతున్నారు. కుందన్‌, పోల్కీ జాదూ చాంద్‌ బాలీ వంటివి ఇప్పుడు ట్రెండ్‌గా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ముక్కపుడక అంటే అమ్మాయిలకు తప్పనిసరిగా కనిపించేది. ఇప్పుడది ఫ్యాషన్‌ యాక్ససరీ అయింది. ముక్కు కుట్టించుకోకపోయినా సరే బ్రైడల్‌ నత్‌ను ధరించడం ఇటీవల కాలంలో పెరుగుతోంది. కొంత మంది తమ మాంగ్‌టిక్కీ మాతాపట్టీలను కాంప్లిమెంట్‌ చేసే రీతిలో వీటిని ధరిస్తున్నారు. వివాహవేళ నిండుగా ఆభరణాలు ఉన్నా మెడలో వేసే నెక్లెస్‌ మాత్రం ఎదుటివారి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ట్రెండ్‌ అంటే మాత్రం లెహంగాను కాంప్లిమెంట్‌ చేసే రీతిలో నెక్లెస్‌ ఉండాలనుకోవడం. ఈ క్రమంలోనే చోకర్‌ నెక్లెస్‌, లేయర్డ్‌ నెక్‌లస్‌లను ఇష్టపడుతుండటం. గాజులు ధరించడం సంప్రదాయం కానీ ఇప్పుడు హాథ్‌ఫూల్స్‌ ధరించడం ట్రెండ్‌. కుందర్‌ పోల్కీ వంటి వాడుతున్నారు. ఇంకా హెవీ బ్రాస్‌లెట్స్‌, కఫ్స్‌ వాడుతున్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/