నిజమైన భక్తి, విశ్వాసమంటే?

JESUS-
JESUS-

నిజమైన భక్తి, విశ్వాసమంటే?

‘దుష్టులు మరణము నొందుటచేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రదుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు (యెహె 18:23). దేవ్ఞడి ప్రేమకు ఈ వాక్యమే నిదర్శనం. మనం దుష్టులను, దుర్మార్గులను చూసి, వారు చనిపోవాలని, శిక్షించబడాలని కోరుకుంటాం. వారికి శిక్ష పడితే, తగినశాస్తి జరిగిందని అనుకుంటాం. దొంగలు, హంతకులు, వ్యభిచారులు, అక్రమదారులు, అన్యాయస్తులకు తగిన శిక్ష పడాలనే తపన మన మనసులో వెంటాడుతుంది.

కానీ మనం వ్యక్తిగతంగా ఎంత పాపంలో జీవిస్తున్నామో, దేవుడికి ఎంతగా వ్యతిరేకంగా జీవిస్తున్నామో గ్రహించలేం. కానీ దేవ్ఞడు మాత్రం దుష్టులు వారు తమ దుష్టత్వంలో నశించిపోవడం ఆయనకు ఇష్టం లేదు. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని, మార్పునొంది, జీవించాలని దేవ్ఞడి కోరిక. ఎందుకంటే మనల్ని సృష్టించిది దేవ్ఞడే కనుక, మనల్ని ప్రేమిస్తున్నాడు. మన కంట్లో ఉన్న దూలాలను తొలగించుకోకుండా, ఎదుటివారి కంట్లో ఉన్న నలసును తొలగించాలని తాప్రయపడతాం. ‘నన్ను ఇంతగా బాధించాడు, నాకు అన్యాయం చేసాడు కాబట్టి దేవ్ఞడు వీడికి తగిన శిక్ష ఇచ్చాడు అనే మాటల్ని మనం వింటుంటాం. చేసిన తప్పుకు దేవ్ఞడి ఉగ్రత నుంచి ఎలా తప్పించుకుంటారు అంటారు. అసలు వారు ఏ దోషం బట్టి శిక్షబడ్డారో, వారి మనసు దేవ్ఞడితో ఏవిధంగా ఉందో, వారు పశ్చాత్తాపం చెందినవారై ఉండవచ్చుకదా! ఇవేవీ మనకు తెలియదు. తెలియనప్పుడు ఎందుకు మాట్లాడాలి? ఎందుకు తీర్పు చెప్పాలి. దేవ్ఞడు మనల్ని ప్రేమిస్తున్నట్లుగానే ఇతరులను కూడా ప్రేమిస్తున్నాడు.

మనం దేవ్ఞడిని వెండించినంత మాత్రాన అతిశయించాల్సి అవసరం లేదు. ‘యాకోబును ప్రేమించితిని, ఏశావ్ఞను ద్వేషించితిని (రోమా 9:13) అని ప్రభువ్ఞ సెలవిస్తున్నాడు. ఏశావ్ఞ యాకోబు ఇద్దరు కమలపిల్లలు. కానీ దేవ్ఞడు యాకోబును ప్రేమించాడు, ఏశావ్ఞను ద్వేషించాడు. ఎందుకని మనం దేవ్ఞడిని ప్రశ్నించలేం. అసలు యాకోబు ఒక మోసగాడు, ఇతడిని దేవ్ఞడు ఎందుకు ప్రేమించాడు? ఇది దేవ్ఞడి కృప. కృప ద్వారానే మనం దేవ్ఞడిని వెంబడిస్తున్నాం కానీ, మన శక్తి, భక్తి, నీతి ఎంతమాత్రం కాదు. దేవ్ఞడి అడుగుజాడల్లో పయనిస్తున్నాం అంటే ఇది కూడా దేవ్ఞడి కృపే కదా! ఆయన మనతో మాట్లాడకపోతే, మనల్ని గద్దించకపోతే, మనదోషాలను సరిదిద్దుకునే అవకాశాన్ని, పరిస్థితులను ఇవ్వకపోతే నిజంగా మనం దేవ్ఞడికి ఇష్టమైనవిధంగా జీవించగలమా! దేవ్ఞడు గర్విష్టులను అణచివేస్తాడు.

కాబట్టి ఆత్మీయ గర్వంతో మనం ఎప్పుడూ ఉండకూడదు. దేవ్ఞడిని ఎంత ఎక్కువగా తెలుసుకుంటూ ఉంటే, అంత ఎక్కువగా ఇతరులను ప్రేమించాలి, వారిపై కనికరాన్ని చూపాలి. అదే నిజమైన భక్తి. నిజమైన విశ్వాసం. భక్తి, ప్రేమ ఈరెండూ ఎప్పుడూ ఉప్పొంగిపోవ్ఞ. తగ్గించుకుంటూ, దేవ్ఞడిని హెచ్చిస్తూ ఉంటా యి. తద్వారా దేవ్ఞడి దీవెనలకు పాత్రులుగా ఉండగలం. అలాగ ఉండకుండా ఉంటే ఉప్పొంగిపయే మన సు ఉంటే అభివృద్ధి కూడా ఇంతటితో ఆగిపోతుంది. దేవ్ఞడికి దూరం కావచ్చు కూడా. జాగ్రత్త సుమా!
– పి.వాణీపుష్ప