మనసును ప్రభావితం చేసే వస్తువులు

Interier
Interier

ఇల్లు శుభ్రంగా ఉంటే మన ఆలోచనలు కూడా బాగుంటాయి. ఇల్లు చిందరవందరగా ఎక్కడ పడేసిన వస్తువ్ఞలు అక్కడే అన్నట్లు ఉంటే, ఇంటికి చూడగానే మనకు చిరాకొస్తుంది. ఎందుకంటే ఇంట్లోని ప్రతి వస్తువూ మన మూడ్స్‌ని ప్రభావితం చేస్తుంది. మన శరీరం, మనస్సు, మెదడుపై అక్కడున్న వస్తువ్ఞలు, వాటి అలంకరణ ప్రభావితం చేస్తాయి. మరి ఏ వస్తువ్ఞ వల్ల మన మనసు ఎలా ప్రభావితమౌతుందో తెలుసుకుందాం.
నీరు చల్లదనం శాంతినిస్తుంది. కాబట్టి ఇంట్లో ఒక పాత్రలో నీరు పోసి పూలు, పూలరేకులు వేయండి. చిన్నదీపం నూనెపోసి వత్తి వెలిగించి ఉంచితే పాజిటివ్‌ భావాల్ని పెంచుతుంది. డార్క్‌షేడ్స్‌ గదిని చిన్నగా, లైట్‌షేడ్స్‌ విశాలంగా కన్పడేలా చేస్తాయి.
డార్క్‌రెడ్‌, ఆరెంజ్‌ విసుగుని, చిరాకుని, కోపాన్ని కలిగిస్తాయి. లైట్‌ కలర్స్‌ శాంతం చల్లదనం కలిగిస్తాయి. ఎయిర్‌ ఫ్రెష్‌నర్‌ చల్లటం వల్ల తలనొప్పి, కళ్లు, ముక్కు మండటం జరగొచ్చు. దాని బదులుగా వెనీలా ఎసెన్స్‌లో దూది ముంచి గదిలో ఉంచాలి.
బ్లూగ్రీన్‌ కూల్‌ కలర్స్‌ వల్ల హెల్దీ ఫ్రెష్‌ ఫీలింగ్‌ కలుగుతుంది. బి.పి, శరీరపు వేడి తగ్గుతుంది. గోడల్ని రస్ట్‌ కలర్‌ పెయింట్‌ చేయిస్తే చాలా విశ్రాంతిగా అన్పిస్తుంది. ఎల్లో లైట్‌ షేడ్స్‌ పెయింట్‌ చేస్తే ఫ్రెష్‌గా ఖుషీగా అన్పిస్తుంది. బ్లూ కలర్‌ యూనివర్సల్‌ కలర్‌. బెడ్‌రూం బైటి గోడలకి దీన్ని వేయించాలి. ఇక కుషన్స్‌, సోఫా కవర్లకి పాత చిరిగిన బెనారస్‌, ఇతర పట్టుచీరెల్ని,కర్టెన్లని వాడితే రాయల్‌ లుక్‌ వస్తుంది. మిర్రర్‌ వర్క్‌, బ్రొకెడ్‌ కుషన్‌ కవర్స్‌ని లివింగ్‌రూంలో వాడాలి. ఖర్చు లేకుండా పాత దుస్తుల్లో వెరైటీగా చేయొచ్చు. నేడు బజారులో నాలుగువేలకు పైగా కలర్స్‌ దొరుకుతున్నా యంటే నమ్మబుద్ధి కాదు గదూ? పదినిముషాల్లోనే మనకిష్టమైన రంగుల్ని ఎన్నుకోవచ్చు కంప్యూటర్‌ సాయంతో.