సెల్‌ఫోన్లతో పెరుగుతున్న ప్రమాదాలు

Increasing risks with cellphones-

ఆర్టీసీ బస్సుల సమ్మె వల్ల తెలంగాణ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేకంగా హైదరాబాద్‌ ప్రయాణీకుల కష్టాలు ఇన్నీఅన్నీ కావ్ఞ. ఇక ఉద్యోగిణుల బాధలు చెప్పలేం. ఈ పరిస్థితుల్లో ఫుట్‌బోర్డుపై ప్రయాణించడం మహిళలకు సైతం సాధారణ విషయం అయ్యింది. ఒకప్పుడు వెనుక మగవారు తలుపుదగ్గర వ్రేలాడుతూ ప్రయాణీస్తే, ఆర్టీసీ సమ్మె వల్ల మహిళలకు ఈ స్థితి తప్పడం లేదు. ఇది ఒక బాధ అయితే ఇక అమ్మాయిల తీరు మరోబాధ. ప్రమాదకరస్థలంలో నిలబడ్డా సెల్‌ఫోన్లను మాత్రం విడిచిపెట్టడం లేదు. ఎక్కడ నిలబడ్డా మాకేమీ, ఎలాంటి ప్రమాదాలకు అవకాశం ఉంటే ఏంటి ఉంటే ఉంటాం పోతే పోతాం మాకే కదా కాళ్లు చేతులు విరిగేది అనేలా ఉంటుంది వారి సెల్‌పోన్లలోని సంభాషణలు.

Increasing risks with cellphones-

కాస్త పక్కకు జరగండి అంటే జరగరు. దిగేవారికి దారి ఇవ్వరు, వారు పక్కకు తప్పుకోరు. ఇదేం చోద్యం అంటే దిగేవారు ఎలాగైనా దిగుతారు అనుకుంటారు. కనీసం నిలబడేందుకైనా చోటు వ్ఞండదు. అక్కడ కూడా మాట్లాడాల్సిందే, చాటింగ్‌ చేయాల్సిందే అనేలా వ్ఞంటున్నది యువతుల ప్రవర్తన. అసలు ఫోన్లు అంటే అత్యవసరంగా మాట్లాడుకునేందుకు అనేది వాస్తవం. అన్‌లిమిటెడ్‌ పుణ్యమా అని ప్రతివారు ఆ రీచార్చ్‌ చేసుకుని, ఇక గంటలకు గంటలు మాట్లాడుకుంటూనే వ్ఞంటారు. తాము ఎక్కడ ఉన్నాం, ఉన్న చోటు ఎంత ప్రమాదకరం అనేది కూడా ఆలోచించడం లేదు. బస్సు మెట్లపై నిలబడి ఎవరికివారే మాట్లాడుకుంటూ వ్ఞంటారు.

లేదా చాటింగ్‌, లేదా ఆన్‌లైన్‌గేమ్స్‌ ఇలా ప్రతివారి తల ఫోన్‌కే వంగిపోయి వ్ఞంటుంది. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా వాటి నుంచి గుణపాఠం నేర్చుకునేందుకు కూడా ఇష్టపడడం లేదు. అసలే బస్సుల కొరత, సమ్మె ప్రభావంతో మహిళలు ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, వ్యయప్రయాసలకు ఓర్చి ఉద్యోగం చేస్తున్నారు. ఫోన్లలో మాట్లాడుకోవడం తప్పని కాదు.

Increasing risks with cellphones-

ఒకరు ఇద్దరు ఫోన్లలో ప్రమాదకర పరిస్థితుల్లో మాట్లాడుతూ వ్ఞంటే ఇతరులు వారి నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాల్లో పడే అవకాశం వ్ఞంటుంది. కాబట్టి కాస్త గమనిస్తూ, ప్రమాదాలను నివారించేలా, తల్లిదండ్రులు బిడ్డలపై ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటారని భావిస్తూ, తగు జాగ్రత్తలు పాటిస్తూ, ఫోన్లను ఉపయోగిస్తే మంచిది. డ్రైవర్లు కూడా తామేమీ తక్కువ కాదంటూ మాట్లాడుతూనే డ్రైవింగ్‌ చేస్తుంటారు. వారిని చూస్తున్న ప్రయాణీకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతుంటాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/