కానుక

ఫ్యాంట్లు, షర్టులు పొడుగుచేయ టానికి కుట్లువిప్పు తారు. ముడతలు పోవాలంటే వెనిగర్‌రాసి ఆరపెట్టండి. ఆరిన తర్వాత ఇస్త్రీచేస్తే మడతలు కనిపించవ్ఞ.
చీరలకు గంజి పెట్టేటపుడు రెండు చుక్కలు సెంట్‌ గంజిలో కలపండి. రాత్రి కుక్కర్‌ కడిగిన వెంటనే గ్యాస్కెట్‌ తీసి విడిగా తగిలిస్తే గ్యాస్కెట్‌ చాలా కాలం వస్తుంది.
అటుకుల ఉప్మా, వేయించిన అటుకులు చేసేటప్పుడు సోంపుతో పోపు వేస్తే వాటి రుచి అద్భుతంగా ఉంటుంది. బీట్‌రూట్‌ కొనేటప్పుడు గట్టిగా, గుండ్రంగా ముదురు ఎరుపు రంగులో నునుపుగా ఉండేవి ఎంచుకోవాలి.
పచ్చిబొప్పాయిని ఎండబెట్టి ధనియాలు, మిరియాలు పొడులుగా చేసి ఉప్పు చల్లి కొద్దిగా నిమ్మరసం పిండి తీసుకుంటే జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది.
పట్టు చీర మీద నూనె మర కలు పడిన చోట ఒక చుక్క పెట్రో లును రాయండి. మరకపోతుంది.
వస్త్రాలపై వ్ఞన్న పాతచెమట మరకలను తొలగిం చాలంటే వెనిగర్‌(వైటు)తో మరకను బాగా రుద్ది నీటిలో ముంచి ఆరవేయండి.
బట్టలపై పడిన కిళ్లీ మరకలు పోవాలంటే పెరుగుతో మరకలను బాగా రుద్ది శుభ్రంగా సబ్బుతో ఉతకండి. దుస్తులమీద పడిన సిరామరకలు పోవాలంటే ఆ మరకలమీద కొద్దిగా టూత్‌ పేస్టు రాసి ఆరిన తర్వాత సబ్బునీళ్లతో కడగండి.

తాజా కెరీర్‌ సమాచారం కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/