ఓటమి గెలుపునకు పునాది

Happy Movement

నమస్కారం మేడమ్‌, నాపేరు మౌనిక. మొన్న జరిగిన ఇంటర్‌ పరీక్షలో ఇంగ్లీషులో నేను ఫెయిల్‌ అయ్యాను. ఇంటర్‌ ఫస్ట్‌ఇయర్‌లో నాకు మంచి మార్కులు వచ్చాయి. మొన్న జరిగిన ఇంటర్‌ సెకండరీ విద్యార్థులందరికీ మార్కులు ఇలాగే వచ్చాయి. కొంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని వార్త పేపర్‌లో చదివాను. మళ్లీ ఫెయిల్‌ అయిన విద్యార్థులు మార్కులను రీవాల్యూ యేషన్‌ చేస్తారని విన్నాం. ఇప్పుడు నేను ఫెయిల్‌ అయిన సబ్జెట్‌ రీవాల్యూయేషన్‌ చేస్తే పాస్‌ అవ్ఞతానో లేదో అని భయంగా ఉంది. పాస్‌ అవకపోతే ఇంజినీరింగ్‌ చేయలేను కదా! అని ఆందోళనగా ఉంది. ఏం చేయలేకపోతున్నాను. నా జీవితం వృధా అనే భావన కలుగుతు న్నది. ఈ సమస్య నుండి నేను ఎలా బయటపడాలో చెప్పండి మేడమ్‌. – మౌనిక, ఖమ్మం

మీరు తప్పక ఈ సమస్య నుండి బయట పడగలరు. తప్పినా, పాసయినా ఒకటే. జీవితంలో ఫెయిలవ్వటం కూడా స్వీకరించాలి. మనం చిన్నప్పుడు నడక ఒక్కసారే నేర్చుకో లేదు చాలాసార్లు కిందపడ్డాకనే నేర్చుకొన్నాం. ఎప్పుడూ పడిపోయామని ఓటమిని చూసి భయపడలేదు. జయించటానికి ప్రయత్నం చేస్తూ వచ్చాం. అలానే జీవితంలో కూడా జరగాలి. ఓటమిని ఆనందంగా స్వీకరించి, మరల ప్రయత్నం చేయాలి. తప్పక విజయం మీ సొంతం అవ్ఞతుంది. గెలుపుఓటమి సామాన్య మైనవి. అందువల్ల తప్పక మీరు మీ జీవితంలో సానుకూలంగా ఆలోచించ డం నేర్చుకోవాలి. ఆత్మవిశ్వాసం అలవర్చుకోవా లి. స్పష్టత, అవగాహన పెంపొందించుకోవాలి. ఆశవహ దృక్పథం పెంపొందించు కోవాలి. జీవితం అమూల్యమైనది. చాలాపెద్ద కానుక. సమస్యలు చాలా చిన్నవి. అందువల్ల సమస్యల గురించి భయ పడకూ డదు. జీవితం ఆనందించేం దుకే. ప్రతి నిత్యం ఆనందంగా గడపాలి. ప్రతి రోజూ ఉత్సాహంగా ఉండాలి. ప్రేమ, ఆప్యాయతలతో జీవితాన్ని స్వీకరించాలి.

సమస్యకు పరిష్కారం ఉంది

నమస్కారం మేడమ్‌, నాపేరు రాధిక. నేను డిగ్రీ రెండవ సంవత్సరం చదువ్ఞతున్నాను. నా చిన్నతనంలోనే మానాన్న అనారోగ్యంతో చనిపోయారు. అప్పటికి మా అమ్మ చాలా కష్టపడుతూ నన్ను చదివిస్తుంది. తను చిన్న స్కూల్లో టీచర్‌గా పనిచేస్తుంది. ఈమధ్య మా అమ్మ ఆరోగ్యం కూడా బాగాలేదు. దాంతో అమ్మ జాబ్‌కి కూడా సరిగ్గా వెళ్లడం లేదు. కాబట్టి మాార్థిక పరిస్థితులు సరిగ్గా లేవ్ఞ. అమ్మ నన్ను ఇక చదివించడం కూడా కష్టమని ఏదైనా ఉద్యోగం చూసుకొమ్మని చెబుతుంది. నాకు ఏం చేయాలో అర్ధం కావడం లేదు. ఇంకొక సంవత్సరంతో చదువ్ఞ పూర్తి అవ్ఞతుంది. అమ్మకి చెప్పాలంటే ఎలాగో ఉంది. అమ్మ ఆరోగ్యం గురించి చాలా ఆందోళనగా ఉంది. నాకు చదువ్ఞకోవాలని ఉంది. చదువ్ఞ మానేసి ఉద్యోగం చూసుకోవాలని ఆలోచిస్తున్నా. ఈ సమస్యతో నాకు పీరియడ్స్‌ కూడా రావడం లేదు. నిద్రలేదు. దయచేసి ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి మేడమ్‌. – రాధిక, హైదరాబాద్‌

మీరు తప్పక ఈ సమస్యల నుండి తేలిగ్గా బయటపడగలరు. మీరు తప్పక చదువ్ఞకోవచ్చు. చదువ్ఞ పూర్తి అయ్యాక ఉద్యో గం చూసుకోవచ్చు. లేక చదువ్ఞతూనే ఉద్యోగం చేయవచ్చు. లేక ఒక సంవత్సరం ఉద్యోగం చేసి, తరువాత చదువ్ఞ పూర్తి చేయవచ్చు. ఇలా అనేక రకాలుగా సమస్యను తేలికగా పరిష్కరించుకోవచ్చు. మీ అమ్మగారి ఆరోగ్యం బాగు చేయించం డి. ఆమెకు ధైర్యం చెప్పండి. ఆమెకు మీ సహాయ, సహకారాలు చాలా అవసరం. ప్రేమగా, ఆప్యాయతతో ఉండండి. ఆమె ఆరోగ్యం తప్పక బాగ యిపోతుంది. ఆమె చక్కగా ఉద్యోగం చేసుకోవచ్చు. ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఉంటే, అన్నీ బాగయిపోతాయి. వ్యతిరేక ఆలోచనలకు స్వస్తి చెప్పండి. పాజిటివ్‌గా ఉండండి. ఆత్మస్థయిర్యంతో అన్నీ చక్కబెట్టుకోవచ్చు. కృంగిపోవడం మంచిదికాదు. మీబలాన్ని మీరు తెలుసుకోండి. మీ వనరులను సద్వినియోగం చేసుకోండి. ప్రతినిత్యం ఆనందంగా ఉండాలి. జీవితంలోని మాధుర్యాన్ని చవిచూడండి. అమూల్యమైన సమయాన్ని వినియోగించుకోండి.