అందమైన ఆకృతి జిమ్‌తో సరి

Gym  Practice
Gym Practice

వాకింగ్‌కి శరీరాన్ని లూజ్‌ చేసే గుణం ఉంది. జిమ్‌ శరీరాన్ని స్టిఫ్‌గా చేస్తుంది. టైట్‌ చేస్తుంది. అందానికి ఆ రెండూ అవసరం. జిమ్‌ అంటే బరువ్ఞలు ఎత్తాలి? కండలు వస్తాయి? ఆడవాళ్లకి ఏమి బావ్ఞంటాయి అని తెలిసీ, తెలియకుండా మాట్లాడేవాళ్ల మాటలు విని మీరు జిమ్‌కి దూరంగా ఉండకండి. జిమ్‌ వల్ల కలిగే ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం.
జిమ్‌లో ఓ గొప్ప రహస్య ఉంది. స్త్రీ శరీరతత్వాన్ని బట్టి జిమ్‌ కెళ్లినా కండలు రావడం జరగవ్ఞ. అందమైన రూపం, ఆకృతి మాత్రమే వస్తాయి. కేవలం మగవాడి శరీరతత్వాన్ని బట్టి కండలొస్తాయని తెలుసుకోండి. మనిషి అందాన్ని హరించేది పొట్ట. ఇది తగ్గితేనే అందం బైటపడేది. పెంచుకున్న పొట్ట మొత్తం అందాన్ని హారతి కర్పూరంలా హరించివేస్తుంది. తిండి మానేసి, క్రొవ్ఞ్వ తగ్గించుకుని క్లినిక్స్‌ వెళ్లి, తగ్గి మళ్లీ పెరగడం నిత్య సమస్య. ఇది అనంతం. కొన్నాళ్లకు ఇంతేలే అని వదిలేయటం, అందంగా ఉండటం ఒకప్పటి విషయం అనుకునేలా మీ ఆలోచనలు మనసులోకి రానీయకండి.
మారిన బిజీ జీవితం వల్ల శరీరంలో మార్పులు తప్పవ్ఞ. ఎన్నిఉన్నా టివి చూడటం మానేస్తున్నారా? దానికి టైమ్‌ దానికి కేటాయిస్తున్నారు కదా. మీకోసం, మీ ఆనందం కోసం, మీ ఆత్మవిశ్వాసం కోసం రోజూ ఒక గంట కేటాయించ లేరా! ఆలోచించండి? కేవలం ఆ గంట జిమ్‌లో గడిపితే అందానికి అందం, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. జిమ్‌లో ముందు చివర వార్మప్‌ ఎక్సర్‌సైజలు తప్పకుండా చేయాలి. ఉదాహరణకు మీ షోల్డర్స్‌ వంగినట్టు ఉంటే జిమ్‌ చేయటం ద్వారా షోల్డర్స్‌ షేప్‌గా పెరుగుతాయి. విశాలమవ్ఞతాయి.

Gym Practice
Gym Practice

పొట్ట
ఎలాంటి పొట్టనయినా జిమ్‌ కరిగించి వేస్తుంది. ఉదయాన్నే పది ఇడ్లీ తిన్నా ఆకలిపోదు. భయపడకుండా జిమ్‌కెళ్లండి. మీ ఇష్టమొచ్చినంత తినండి. బాగా తిందాం. పనిచేద్దాం. జిమ్‌లో మీకు పనికొచ్చే ఎన్నో పరికరాలుంటాయి. మీ ప్రతి ప్రాబ్లెమ్‌ మల్టీజిమ్‌ ద్వారా క్యూర్‌ అవ్ఞతుంది. బాడీ తగ్గటానికి, ఫ్యాట్‌ కరగటానికి, షోల్డర్స్‌ ఇంకా చెస్ట్‌కి బాగా వర్క్‌ అవటానికి థైస్‌, నడుం ఇలా ఏ భాగాన్నయినా యాక్టివ్‌గా అందంగా జిమ్‌కెళ్లి స్టిఫ్‌గా చేసుకోవచ్చు. వారంలో అయిదు రోజులు కంపల్సరీ జిమ్‌కి వెళ్లండి. మిగతా రెండు రోజుల్లో జిమ్‌ కెళ్లకుండా ఇంట్లోనే మెడిటేషన్‌ చేయండి.

విశ్రాంతిగా ధ్యానభంగిమలో కూర్చొని పొట్ట బాగా లోపలికి తీసుకెళ్లండి. గుండెల నిండా , పొట్టనిండా గాలిపీల్చి నెమ్మదిగా వదలండి. ఇలా రోజుకి ఇరవై సార్లు చేయండి. జిమ్‌ కెళ్లేటప్పుడు వాటర్‌, కొబ్బరినీళ్లు బాగా తీసుకోవాలి. అంతేకాదు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే కాయగూర లను ఎక్కువగా మోతాదులో తీసుకోవాలి. అప్పుడే మీరు జిమ్‌లో ఎక్సర్‌సైజ్‌ చేయడానికి కావలసిన శక్తి వస్తుంది.

========