కార్తీక మాసంలో గృహప్రవేశాలు

Gruha pravesam

గృహప్రవేశం అంటే సంప్రదాయం ప్రకారం చాలా ఆచారాలు, ముహూర్తాలు, నక్షత్రాలు, తిథులు, సమయాలను పాటిస్తారు. కొత్త ఇంట్లోకి ప్రవేశిం చడానికి అనుకూలమైన రోజులను ఎంచుకుం టారు. హిందూ సాంప్రదాయం ప్రకారం గృహ ప్రవేశం అనేది చాలా ముఖ్యమైనది. ఒకప్పుడు గృహప్రవేశాన్ని రెండు రకాలుగా జరిపేవారు.

మొదట కొత్త పెళ్లి కూతురు పుట్టింటి నుంచి అత్తవారింటిలో అడుగుపెట్టినప్పుడు ఘనంగా జరుపుకునే వేడుక. ఇది ఎందుకు జరుపు కుంటారంటే అత్తవారింట్లో అడుగుపెట్టిన కోడలు ఆ ఇంటి భవిష్యత్తుని, వంశం అభివృద్ధి, ఇంటి జీవన శైలిలో ఎన్నో రకాల అభివృద్ధి పరమైన పనులకు, మార్పులకు దోహపడుతుంది. ఏ కోడలు అయినా అత్తిం టికి చేరిన తరువాత పుట్టింటి ఆత్మీయతకు దూరమైనప్పటికీ మెట్టినింటి మెరుగుదల కోసం తన వంతుగా సేవలు అందిస్తుంది. ఆ కుటుంబం మంచి కుటుంబం అనే పేరు రావడానికి కీలక పాత్ర పోషిస్తుంది.

అందుకే గృహప్రవేశానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఇక రెండో రకం విషయానికి వస్తే ఏదైనా ఒక ఇంటిని కొత్తగా నిర్మాణం చేసినప్పుడు దాన్ని నివాసయోగ్యం చేసే ప్రక్రియనే గృహప్రవేశ ప్రక్రియ అంటారు. ఇందుకు ముందే ఇల్లు కట్టేవిధానం, రంగులు వేయడం తదితర వాటన్నింటిని పూర్తి చేస్తారు. అంతేకాక ఆ స్థలంలో అనుకూల శక్తి కూడా వస్తుంది. గృహప్రవేశం అనేది ఒక చిన్న ప్రతిష్ట వంటిది.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/