మంచి వ్యక్తిత్వం

Good Personality

ప్రతి మనిషికీ తనకు తెలియకుండానే ఒక బలహీనత తనలో ఉంటుంది. అదేంటంటే సానుభూతి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. జీవితంలో చిత్తశుద్ధి, అంకితభావం, దృఢసం కల్పం, పట్టుదల, ఏకాగ్రత వంటి గుణాలవంటివి. వీటిని క్రమశిక్షణతో అలవరచుకోవాలి. పనిమంతులు పనిని కూడా విశ్రాంతిలా భావిస్తుంటారు. బద్ధకస్తులు విశ్రాంతిని కూడా పనిలా భావిస్తారు.

మంచి నడవడికలతో జీవన పయనం సాగిస్తేనే శుభప్రదమైన శాంతియుత జీవితం అలవడుతుంది. జీవితంలో ఆనందాన్ని పంచుకునేవారికంటే బాధలను పంచుకునే వారికే ఎక్కువ విలువ ఇవ్వాలి.
మాటకు మాట ప్రతీకారం కాకూడదు. మౌనమే దానికి మంచి సమాధానంగా ఉం టోంది. ఎవరో ఏదో అన్నారని బాధపడుతూ కూర్చునేకంటే ఒక్కసారి అలా బాధపడడానికి అలవాటు పడితే జీవితాంతం బాధ పడు తూనే ఉంటారు. బుద్ధి అజ్ఞానాంధకారాన్ని నశింపచేస్తూనే మనిషిలో మంచి గుణాలను మొలకెత్తిసుంది. మంచి మాటటే మనిషికి వాసంత సమీరాలు మహోన్నత వ్యక్తిత్వమే మనిషికి అసలైన పంపద. న్యాయంగా జీవిస్తేనే మనిషికి ఎనలేని విలువ.

మనిషి జీవితంలో విలువలకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. విలువలు గల వారితో మనం స్నేహం చేయడం ఎంతైనా మంచిది. విలువ లేని మనషుల దగ్గర రోజూ ఉండే బదులు, విలువ ఇచ్చే వారి వద్ద ఒక్క క్షణం ఉన్నా చాలు. మనిషిని పరిస్థితులు శాసించకూడదు. మనిషే పరిస్థితులను శాసించాలి. మనలోని శక్తి తెలియజేసేది సామర్ధ్యం. మనమేం చేయగలమో చూపించేది ప్రేరణ.

మనమేమిటో నిర్ణయించేది వ్యక్తిత్వం. జీవితంలో సర్వస్వం కోల్పోయినా ఒకటి మాత్రం మనతో మిగిలి ఉంటుంది. అదే మన భవిష్యత్తు. మనం వెతికితే దొరికేది నిజమైన ప్రేమ కాదు. మనల్ని వెతు క్కొంటూ వచ్చేదే నిజమైన ప్రేమ. మధుర మైన జ్ఞాపకం కన్నా మరపురాని బాధ కు వయసు ఎక్కువ. ఒక్క తప్పు చేస్తే నిందించటానికి అందరు ముందుంటారు గానీ ఆ తప్పును సరి దిద్దే తోడ్పాటును అందించడానికి ఎవరూ ముందుకురారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/