మర్చిపోతున్నారా?

ఆరోగ్యసమస్యలు – పరిష్కారం

Forgetful
Forgetful

వృద్ధాప్యంలో చాలామంది ఎదుర్కొనే అతిపెద్ద సమస్య మతిమరపు. ఇటీవల ఇది నలభైలలో ఉన్న వాళ్లలో కూడా కనిపిస్తోంది.

దీనికి కారణం స్మార్ట్‌ఫోన్ల వాడకంతోబాటు శారీరక వ్యాయామం లోపించడమేనట. శారీరకంగా చురుగ్గా ఉంటూ ఫిట్‌నెస్‌ బాగున్నవాళ్లతో పోలిస్తే కదలకుండా కూర్చునేవాళ్లలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోందట.

చురుగ్గా ఉండేవాళ్లలో మెదడులో రక్తప్రసరణ బాగుండటంతో మతిమరపు వచ్చే అవకాశం తక్కువగా ఉందట.

అందుకే వయసుమీదపడేకొద్దీ కదల్లేకపోతున్నాం అనుకోకుండా కాసేపు తోటపని చేయడం, ఇంటిపనిచేసుకోవడం, కనీసం పది నిమిషాలైనా నడవడం తప్పక చేయాలి.

వీటితోబాటు క్రమం తప్పకుండా అంకెల్నీ, నెలల్నీ, వారాల్నీ వెనక నుంచి ముందుకి చెప్పడం, పజిల్స్‌ను పూరించడం ద్వారా కూడా మతిమరపు బారి నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు వైద్యనిపుణులు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/