పాదరక్షలు తప్పనిసరి

Footwear must
Footwear must

పాదాలకు చెప్పులు లేకపోయినా పర్వాలేదని చాలామంది అనుకుంటారు. కానీ పాదరక్షణకు చెప్పులు ఎంతో మేలు చేస్తాయి. అందుకే ఇంట్లో ఉన్నప్పుడు కూడా పాదాలకు చెప్పులను వేసుకోవాలి. ఎందుకంటే
శరీరం మొత్తం కాళ్లమీదే ఆధారపడి ఉందని మర్చిపోకూడదు. ముఖ్యంగా పాదాలు. అందుకే కదా కిరీటాలు పెట్టుకునే తలకే అయినా సాటివారు నమస్కరించి గౌరవించేది పాదాలకే కదా! మరి అలాంటి పాదాలు మృదువుగా అవడానికి కొన్ని చిట్కాలు…

ఇంటి పనులోనయినా సరే కాళ్లకి చెప్పులు లేకుండా ఉండకూడదు. కాలికి ఏ ముళ్లయినా గ్రుచ్చుకుంటే అక్కడ ఫెవికొలెన్‌ పూసి కాసేపాగి దానిని తొలగించితే ముల్లును ఈజీగా తీసేయవచ్చు. పసుపూ పారాణి లాంటివి ఎప్పుడో మానేశాము కనుక కనీసం (కెమికల్‌ కానట్టి నేచురల్‌) గోరింటాకు నయినా పాదాలకు చుట్టుపెట్టుకుంటుంటే పాదాలు చెడిపోకుండా ఉంటాయి.

మేజోళ్లు వేసుకునే ముందు కాళ్లను పొడిగా తుడుచుకుని టాల్కమ్‌ పౌడర్‌ చల్లుకుని తొడుక్కోవాలి. విప్పగానే డెట్టాల్‌-లోషన్‌ కలిపిన నీటితో పాదాలను శుభ్రము చేసుకోవాలి. వేళ్ల మధ్య ఒరుపయితే కోల్డుక్రీముగాని, మామిడి టెంకలోని జీడిని అరగదీసి గాని పూయాలి. చెంచాలు పెరుగూ కలిపి పట్టిస్తుంటే క్రమేణా మృదువవుతాయి.