అధిక క్యాలరీలతో ఊబకాయం

Fat Lady
Fat Lady

సాధారణంగా మనం రోజూ తీసుకునే ఆహారంలో 3000- 3500క్యాలరీలు ఉంటుంది. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజుకి కేవలం 2000 క్యాలరీలు మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. ఇలా ఎక్కువైన క్యాలరీల వల్లే అధికబరువు, దానితో పాటే గుండెపోట్లు, ఛాతి నొప్పులు, రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆహారంలో క్యాలరీలను తగ్గించడం వల్ల వీట న్నింటి నుండి బయటపడి ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు అంటున్నారు.

ఒత్తిడి క్షణాల్లో దూరం : ఒత్తిడి నుండి వెంటనే దూరమయ్యే మంచి వ్యాయామం ఇదే. బాసింపట్టు వేసుకుని కూర్చుని మీ రెండు అరచేతులు మోకాళ్ళమీద ఉండేలాగా పెట్టండి. కళ్లు మూసుకుని మెల్లగా గాలిని లోపలికీ, బయటికి పీల్చండి. గాలి ఎలా మీ ఊపిరితిత్తుల్లోకి వెడుతుందో ఊహించండి. గాలిని బయటికి వెడుతున్నపుడు పొట్టభాగం లోపలికి వెళ్లడం గాలి బయటికి రావడం వీటిమీద దష్టిని నిలపండి. ఈ వ్యాయామాన్ని క్రమం తప్పకుండా చేయడం వల్ల ఒత్తిడినుండి క్షణాల్లో దూరం కావడమే కాకుండా మెదడు చురుకుగా తయారవుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

వంట చేస్తున్నా, ఆఫీసు పనులు చేస్తున్నా, మీ పిల్లలతో హోంవర్కు చేయిస్తున్నా ఏ పనైనా సరే చేస్తున్న ప్రతి పనిని ఎంజా§్‌ు చేయండి. ఏ పనైనా సరే ఇబ్బంది లేకుండా మనసుమీదికి ఎక్కువ ఆందోళన తీసుకోకుండా చేయడం వల్ల ఒత్తిడినుండి దూరంగా ఉండవచ్చు.