ముఖం అందంగా కనిపించాలంటే..

Face Washing
Face Washing

నలుగురిలోకీ వెళ్లినప్పుడు అందరూ ముఖాన్నే చూస్తారనుకుంటాం. దాంతో కేవలం ముఖాన్ని వీలైనంత అందంగా కనిపించేలా చేసేందుకు ఎంతో శ్రద్ధ తీసుకుంటాం. ఆ క్రమంలో చేతి, కాలిగోళ్ళను నిర్లక్ష్యం చేస్తాం. ఎవరు పట్టించుకుంటారనుకుంటాం. కానీ చాలామంది వాటిని కూడా గమనిస్తారు. షేక్‌హ్యాండ్‌ ఇవ్వడానికి చేతులు కలపాల్సి రావచ్చు. పెన్నుతో ఏదైనా రాయాల్సి రావచ్చు. అలాంటప్పుడు గోళ్లల్లో మట్టి, సగం గోళ్ల రంగు మాత్రమే ఉండటం లేదా అవి విరిగిపోయి ఉండటంలాంటివన్నీ మీరు వ్యక్తిగత శుభ్రతను తేలిగ్గా తీసుకుంటారనే సంకేతాన్ని అందిస్తాయి. అందుకే వాటి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి.

ముఖంపై అవాంఛిత రోమాలుండటం కూడా సహజ అందాన్ని తగ్గిస్తుంది. అయితే వాటిని తొలగించేందుకు లేజర్‌ లాంటి చికిత్సలు చేయించుకోలేకపోవచ్చు. అలాగని వదిలేయాలని లేదు. బ్లీచింగ్‌ని ఎంచుకోవచ్చు. ఈ రోజుల్లో బ్లీచింగ్‌ కిట్లు అన్ని చోట్లా దొరుకుతున్నాయి. కాబట్టి ఎప్పటికప్పుడు వాడితే అవాంఛిత రోమాలు ఎక్కువగా కనిపించనివ్వకుండా చేయవచ్చు. కొందరు ముందు గమనించుకోకుండా నచ్చిన రంగు ఫౌండేషన్‌ని ఎంచుకుంటారు. అయితే చర్మతత్వానికి నప్పే ఫౌండేషన్‌ ఎంచుకోకపోతే…ఆ తేడా ముఖంపై స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే కొనేముందు అది మీకు నప్పుతుందా లేదా అన్నది పరీక్షించుకోవాలి.

ప్రత్యేక సందర్భాలకు సంబంధించి బయటకు వెళ్తున్నప్పుడు తల జిడ్డుగా ఉన్నా సరే అలాగే వెళ్లిపోతుంటారు చాలామంది. అయితే అన్ని సార్లూ తలస్నానం చేసే సమయం ఉండకపోవచ్చు. ాంటప్పుడు డ్రై షాంపూ లేదా కండిషనర్‌ని ఎంచుకోవాలి. దానివల్ల తలలో జిడ్డు తగ్గుతుంది.