ఫేస్‌ప్యాక్‌లు సులభంగా..

Face Pack tips
Face Pack tips

కోడిగుడ్డులోని తెల్లసొనలో ఒక టీ స్పూన్‌ తేనె కలిపి ముఖానికి పట్టించి ఆరిన తరువాత కడిగినట్టయితే చలికాలంలో ఎండకు కమిలిన చర్మం తిరిగి తెల్లబడుతుంది. పొడిబారకుండా మృదువుగా కాంతులీనుతుంది.

ఒక టేబుల్‌ స్పూన్‌ ఓట్స్‌ పౌడర్‌లో ఒక టీ స్పూన్‌ తేనె, అరటేబుల్‌ స్పూన్‌ పెరుగు, పావు టీ స్పూన్‌ బాదంపొడి కలిపి ముఖానికి, మెడకు ప్యాక్‌ వేయాలి. ప్యాక్‌ ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.

ఒక టేబుల్‌ స్పూన్‌ పచ్చిపాలలో ఒక టీ స్పూన్‌ కీరదోస రసం కలిపి మిశ్రమంలో దూదిని ముంచి ముఖానికి మసాజ్‌ చేస్తే మురికి పోతుంది. పాలు, కీరరసం, స్కిన్‌టోనర్‌గా పనిచేయడంతో చర్మం కాంతివంతమవుతుంది.

అరకప్పు కోకో పౌడర్‌లో మూడు టీ స్పూన్ల మీగడ, అరకప్పు బాగా పండిన బొప్పాయి గుజ్జు, పావ్ఞ కప్పు తేనె మూడు టీ స్పూన్ల ఓట్‌మీల్‌ పౌడర్‌ తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పట్టించి ఆరిన తర్వాత వేడినీటిలో కడగాలి. ఇది జిడ్డు చర్మానికి బాగా పనిచేస్తుంది.

ఒక టేబుల్‌ స్పూన్‌ ద్రాక్షరసంలో కోడిగుడ్డు తెల్లసొన కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత వేడినీటిలో కడగాలి.

ఒక టేబుల్‌ స్పూన్‌ తేనెలో ఒక టీ స్పూన్‌ వంట నూనె లేదా కొబ్బరినూనె కలిపి ముఖానికి పట్టించాలి.

ఈ మిశ్రమం చక్కని మాయిశ్చరైజర్‌గా పనిచేసి చలికాలంలో పొడి చర్మానికి మంచి ఫలితాన్ని ఇస్తుంది.