వ్యాయామం అవసరమే

Exercises Necessary-
Exercises Necessary-

నిద్రలేవగానే వంటగదిలోకి వెళ్లడం మహిళలకు అలవాటు. కాసేపు వాకింగ్‌ చేద్దామనే ఆలోచన కూడా వారికి ఉండదు. గుండెజబ్బులు, షుగర్‌ వంటి వ్యాధులు ఉంటే తప్ప, వైద్యులు తప్పనిసరిగా వాకింగ్‌ చేయాలని చెబితే తప్ప వాకింగ్‌ చేయరు. ఎందుకంటే ఇంటిపనులు, పిల్లల పనులతోనే సరిపోతుంది. మహిళలు తమ ఆరోగ్యంపై పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. సుబ్బమ్మకు ఒకటిరెండుసార్లు గుండెలో నొప్పిగా అనిపిస్తు, వైద్యులకు చూపించుకుంది. వారు గుండెజబ్బులున్నాయని, వెంటనే ఆసుపత్రిలో చేరమని సూచిస్తే, డబ్బుకోసం కార్పొరేట్‌ వైద్యులు ఇలా చెబుతాని, డాక్టర్ల సలహాను పాటించకుండా ఇంటికి వచ్చేసింది సుబ్బమ్మ. తర్వాత రెండు నెలలకు గుండె ఆగి మరణించింది. అందుకే కొన్ని వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి.

నిద్రలేవగానే పనిలోకి వెళ్లకుండా బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజులు, మంచి ఆలోచనలు వంటి వాటికి సమయాన్ని కేటాయించండి.

ప్రతిరోజూ అయిదు నిముషాలపాటైనా ఏదైనా శారీరక వ్యాయామం చేయండి.

పొద్దున్నే కాసేపలా చల్లని గాలికి తిరగండి. ఒక కప్పు కాఫీ ఇచ్చే రిలీఫ్‌, శక్తి కంటే ఇది ఎక్కువ ఇస్తుంది.

అల్పాహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేయకండి.
్య ప్రతి అరగంటకు ఒకసారి తక్కువ పరిమాణంలో నీటిని తాగుతుండండి. శరీరంలో శక్తి హరించుకుపోకుండా కాపాడుతుంది.
్య అక్కర్లేని ఆలోచనలను పక్కనుంచండి. అనవసరంగా ఆందోళన పడటం మానేయండి.

మీకు నచ్చిన వారితో కాసేపు మాట్లాడండి. మీ మనసులోని బాధనంతా చెప్పేస్తే మనసు తేలికవ్ఞతుంది. మీ చికాకు కూడా తగ్గిపోతుంది.

కాసేపు మీకు నచ్చిన పుస్తకాలు చదువ్ఞకోండి. లేదా దేవుని పుస్తకాలు చదివినా మనసుకు ప్రశాంతత చేకూరుతుంది.

అనుకున్నది జరగకపోతే విచారంలో మునిగిపోకండి. అదే పనిని కొత్తకోణంలో చేసేందుకు ప్రయత్నించండి.

తక్కువ నిద్ర, తక్కువ ఆహారం, ఎక్కువ శ్రమ… వీటన్నింటి పట్లా ఏమాత్రం అశ్రద్ధగా ఉండకండి. ఇవన్నీ మీలో ఉంటే ఇక మీరు రెండువైపులా వెలుగుతున్న కొవ్వొత్తే అవుతారు, గుర్తుంచుకోండి. అన్నింటికంటే ముఖ్యమైనది చేస్తున్న పనిలో ఆనందాన్ని పొందండి.