ఏనుగు బొమ్మల ఫ్యాషన్‌

న్యూ వెరైటీ డిజైన్లు

Elephant Doll design Fashion
Elephant Doll design Fashion

హుందాతనానికి నిలువెత్తు నిదర్శనం ఏనుగు. అలా వీధుల్లో పోతుంటే ఆ నడకలో ఎంత రాజసం, ఎంత గాంభీర్యం. ఏనుగును అదృష్ట చిహ్నంగా భావిస్తారు

వినాయకుడి ప్రతినిధిగా కొలుస్తారు. ఏనుగు ఫ్యాషన్‌ ప్రపంచంలో కూడా, కాస్త ఆలస్యంగా మందగమనంతోనే అడుగుపెట్టింది.

ఏనాడో పట్టు చీరలకు జరీఅంచుగా మారిన కొరిగారు ఇప్పుడు టాప్స్‌, చెరింగులు, తలగడలు, నెక్లెస్‌లు, జడక్లిప్పులు, దుపట్టాలు, హ్యాండ్‌ బ్యాగులు-ఇలా ప్రతీచోట ఫ్యాషన్‌ డిజైన్‌లా మారిపోయారు.

మొన్నటి వరకు చిలకలు,నెమళ్లు ఫ్యాషన్‌ ప్రపంచంలో సందడి శాయి. ఇప్పుడు హస్తిగారి హస్తవాసి కూడా బాగానే కలిసొస్తోంది.

Elephant Doll design Fashion-

యువత ఏనుగు ఫ్యాషన్‌ను పిచ్చిపిచ్చిగా ఫాలో అయిపోతున్నారు. కాలేజీకెళ్లే అమ్మాయి తెల్లటి షాల్‌పై నల్లటి ఏనుగుల డిజైన్‌ను ఏరికోరి ఎంచుకుంటోంది.

తొండమెత్తిన ఏనుగు చక్కని చక్క మణికట్టుపై మెరిసే చెక్కరాజుపై అందంగా రంగులద్దుకుంది. నఖశిఖం నాజూగ్గా కనిపించే మెట్రో సుందరి గోళ్ల కాన్వాసుపై పెయింటింగ్‌లానూ మారింది.

అంతేనా, చెవిపోగులకు వేలాడుతూ కూడా దర్శనమిస్తోంది. ఫ్యాషన్‌ పుస్తకంలో ఏనుగుకి ఓ ప్రత్యేకమైన పేజీ ఉందిప్పుడు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/