చెవిదుద్దుల సింగారాలు

Ear Rings

లంగా ఓణీ వేసుకున్న ఏ అమ్మాయి చెవిని చూసినా బుట్టలు, పంజరాల్లాంటి పెద్ద పెద్ద పోగులే కనిపించేవి. ఆ తర్వాత రంగురంగుల రత్నాలూ పొదిగిన ఎన్నో రకాల జుంకీలు వచ్చాయి. షాండ్లియర్‌లా పొడవ్ఞగా వేలాడుతూ పైన సన్నగా కింద కొచ్చేసరికి వెడల్పుగా ఉండేలా డిజైన్‌ చేసి వాటికి షాండ్లియర్‌ పోగులని పేరు కూడా పెట్టారు. ఇవి కనీసం నాలుగైదు సెంటీమీటర్ల పొడవ్ఞంటాయి.
షాండ్లియర్‌ పోగుల్లో దిద్దులకు వేలాడేలా డిజైన్‌ చేసిన జుంకీలు మన దగ్గర బాగా పాపులర్‌. పాశ్చాత్యదేశాల్లో మాత్రం పైన కొక్కెంలా ఉండి దానికి రంగుల పూసలూ, ఖరీదైన రాళ్లూ పొదిగిన జుంకీలున్నవి ఎక్కువ ప్రాచుర్యం పొందాయి. వాటిని మన దగ్గర కూడా బాగానే వాడుతున్నారు. కాకపోతే అవి ఆధునిక దుస్తుల మీదకే పరిమితం చేస్తున్నారు. పండుగలూ ఫంక్షన్ల కొచ్చేసరికి చిన్నచిన్న ముత్యాలూ, పగడాలూ, కెంపులూ, పచ్చల్లాంటి రాళ్లు పొదిగిన బంగారపు షాండ్లియర్‌ పోగులకే అమ్మాయిలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఖరీదు కాస్త ఎక్కువైనా పర్లేదు అనుకునేవారు అచ్చంగా వజ్రాలు పొదిగిన జుంకీలనే చెవ్ఞలకు తగిలిస్తున్నారు.
జుంకీలను ఏ మెటల్‌తో చేసినా అందులో కాంతి పడగానే మెరిసే రంగుల రాళ్లను అమర్చడం షాండ్లియర్‌ పోగుల ప్రత్యేకత. వాటిలో తక్కువ ధరకు దొరికేలా స్టీలు, ఇత్తడితో చేసిన పోగులకు ప్లాస్టిక్‌ లేదా గాజు లేదా కృత్రిమంగా తయారు చేసిన రాళ్లు అమర్చినవి ఒక రకం. బంగారం, ప్లాటినం పోగులకు ఖరీదైన రాళ్లూ, వజ్రాలు పొదిగినవి మరో రకం. ఇలాంటి వాటి ధర లక్షల్లో ఉంటుందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. వాటి అందమూ అంతకు తగినట్లే ఉంటుంది, అందుకే షాండ్లియర్‌ పోగులు పెడితే మరే అలంకరణా అవసరం లేదని మెడను బోసిగాఉంచుతున్నారు నేటి యువతులు. ప్రస్తుతం ఫ్యాషన్‌ సామ్రాజ్యాన్ని ఏలుతున్న ఈ ండ్లియర్‌ పోగులు సినీతారల మనసునూ దోచేస్తున్నాయి. ఈ మధ్య హాలీవ్ఞడ్‌, బాలీవ్ఞడ్‌, టాలీవ్ఞడ్‌ అని తేడా లేకుండా సినీతారలు ఏదో ఒక సందర్భంలో షాండ్లియర్‌ ఫ్యాషన్‌ను చెవ్ఞలకు తగలించేస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/