ఒత్తిడితో జీవితాన్ని పాడుచేసుకోవద్దు

వ్యధ: వ్యక్తిగత సమస్యలకు పరిష్కార వేదిక

Stress
Stress

ప్రతి ఇల్లాలు తన భర్త సంపాదనపరుడు, సమర్ధుడు కావాలని కోరుకుంటుంది. ఉన్నంతలో పరువుగా బ్రతకాలని ఆశిస్తుంది. సమాజంలో గౌరవం, మర్యాదలు పొందాలని భావిస్తుంది.

ఏ భార్య భర్త మోసకాడు కావాలని, ఏ మార్చిన సొమ్ముతో జీవించాలని కలలో కూడ తలంచదు. కుటుంబం నవ్వులపాలు కావడాన్ని సహించదు

. మోసగాడు, దగాకోరు అయిన భర్త సంపాదనతో పిల్లలను పోషించాలని యే భారతీయ స్త్రీ కోరుకోదు.

ఖర్మకాలి అలాంటి భర్త దొరికితే ఏమి చేయాలి. సర్దుకుని సంసారం చేయాలా, వద్దని విడాకులు ఇచ్చి వదులుకోవాలా? పరువు పోయిన తరువాత ప్రాణం ఎందుకరని ఆత్మథ్య చేసుకోవాలా, పిల్లల కోసం బ్రతకాలా? ఈ సంఘర్షణతో కొట్టుమిట్టాడుతున్న నాకు సరైన పరిష్కారం కావాలి.

నా వయసు 35 సంవత్సరాలు 15 యేళ్ల క్రితం పెళ్లయింది. నేను పదవతరగతి వరకు చదువ్ఞకున్నాను. నా భర్తకు 38 యేళ్ల వయసు. ఆయన 10వ తరగతి కు చదువుకున్నాడు. మా ఇద్దరివి పేద కుటుంబాలే.

అయినప్పటికీ పరువు, మర్యాదలకు కొరత లేదు. మా వారు కూడా పదేళ్లపాటు మంచి నడవడిక కలిగి న్నారు. మాకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. పెద్దమ్మాయి 10, రెండవ అమ్మాయి 8వ తరగతిలోకి వచ్చాడు. గత అయిదేళ్ల నుంచి మావారి ప్రవర్తన మారిపోయింది.

అనైతిక వ్యసనాలకు అలవాటు పడ్డారు. మా వారికి ప్రైవేట్‌ ట్యాక్సీ ఉన్నందున 2014 ఎన్నికలప్పుడు ఒక పార్టీ ప్రచారానికి బాడుగకు వెళ్లారు. అప్పటిలో తన చిన్నప్పటి స్నేహితురాలు తారసపడింది.

ఆమెతో పరచయం పెంచుకున్నారు. ఆమెకు పెళ్లయి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా ఆమె మావారితో వలలో పడింది.

ఇద్దరుక కలసి తిరుగుళ్లు ప్రారంభించారు. ఆమె మావరి మాయలతో పడి భర్తకు, పిల్లలకు ద్రోహం చేయడం ప్రారంభించింది.

భర్తకు తెలియకుండా అప్పుడు, ఇప్పుడు కలిపి రెండు లక్షల రూపాయలు మావారికి అర్పించింది. నిదానంగా విషయం బయటపడడంతో ఆమె భర్త, బంధువులు గొడవకు వచ్చారు.

మధ్యవర్తులు కలుగచేసుకుని సర్దుబాటు చేశారు. ఇప్పటి వరకు జరిగింది. మరచపోయి, ఇక నుంచి నిజాయితీగా బతకమని చెప్పి వదలేశారు.

దీనిపై అలిగిన నాకు మా వారు చాలా అబద్ధాలు చెప్పి నమ్మించారు. ఇప్పటికి వారిద్దరి మధ్య రహస్య ప్రేమాయణం కొనసాగతూనే ఉంది.

ఇదిలా ఉండగా తరువాత మరో ఇద్దరిని బుట్టలో వేసుకున్నారు. వారిద్దరిక పెళ్లయి పిల్లలున్నారు. అయినా మావారిపై మోజుపడి మోసపుతున్నారు. వారి దగ్గర ఏదో విధంగాదొరికిన కాటికి దోచుకుంటున్నారు.

రోజంతా ఖాళీగా ఉన్న సమయంలో ఆ ముగ్గురితో ఛాటింగులు సమయం దొరికితే మీటింగులతో గడుపుతున్నారు. అయితే నాకు ఏ మాత్రం కొరత లేకుండా చూసుకుంటున్నారు.

అయినా ఈ అనైతిక వ్యవహారాలను నా మనసు అంగీకరించడం లేదు. ఈ వ్యవహారాలు మంచిది కాదని చెపితే ఆయన ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు.

నా కోసమని ఒకసారి, పిల్లల కోసమసిన మరొకసారి, భర్తలతో సుఖం లేని వారికి అండగా ఉంటే తప్పేమిటని ఇంకొకసారి మాట్లాడుతున్నాడు.

ఈ ్యవహారాలు నచ్చకపోవడంతో నాలో హృదయవేదన పెరిగిపోయింది. తీవ్రమైన మానసిక ఒత్తిడి, డిప్రెషన్‌కు గురవుతున్నాను.

ఆకలి వేయక, నిద్ర పట్టక సత మత మవుతున్నాను

ఆయనతో గొడవపడి విడాకులు ఇచ్చేస్తానని బెదిరిస్తే ఇచ్చేయమని వ్యంగ్యంగా సమాధానం చెప్పారు. నా స్నేహితురాలికి విషయం చెపితే ఏదీ పట్టించుకోకుండా ఇల్లు, పిల్లలను చూసుకోమని సలహా ఇచ్చింది.

అది మనసుకు ఏ మాత్రం నచ్చలేదు. పదిరోజులక్రితం ఉరివేసుకుని చనిపోవాలని ప్రయత్నించాను. అయితే పిల్లలు గుర్తుకు వచ్చి విరమించుకున్నాను.

ఈ నేపథ్యంలో నీరసం, నిస్సత్తువ ఆవహించాయి. ఒక్కోసారి కళ్లు తిరిగి పడిపోతున్నాను. ఏమి చేయాలో పాలు పోవడం లేదు. నాకు సరైన మార్గం చూపండి. – కిరణ్మయి

అమ్మా! మీ మానసిక క్షోభ అర్ధమయింది. నైతిక విలువలు కలిగిన జీవనాన్ని కోరుకునే మీ వ్యక్తిత్వాన్ని ప్రశింస్తున్నాను. మీరన్నట్లు స్త్రీలే కాదు ప్రతివ్యక్తి గౌరవప్రదమైన జీవనం గడపాలని కోరుకుంటాను.

అయితే పరిస్థితులు, పలు అంశాలు వ్యక్తులు దారి తప్పేఆ చేస్తాయి. వ్యక్త్తివం ప్రవర్తన లోపాల వల్ల కొందరు అనైతిక జీవనతాలకు అలవాటు పడుతారు. స్వార్థ ప్రయోజనాలు కొందరిని దారి తప్పిస్తాయి.

అలాగే మానసిక సమస్యలు, లోపాలు, రుగ్మతలు, హార్మోన్ల అసమతుల్యతల వల్ల వ్యక్తుల ప్రవర్తన మారుతుంది. కొన్ని సందర్భల్లో వ్యసనాలు మనిషి వ్యక్తిత్వాన్ని మానసిక స్థితిని దెబ్బతీస్తాయి.

ఇంకా పలు అంశాలు మనుషుల లోచనలు వ్రపర్తనపై ప్రతికూల ప్రబావాలు చూపిస్తుంటాయి.

ఈ కోణంలో పరిశీలిస్తే మీ వారిలో స్వార్థ ప్రయోజనాలు, వ్యామోహం అధికంగా ఉంే అవకొశాలు ఉఆన్నయి. దాంపత్య జీవితంలో లోపాలు లేదా హార్మోన్ల అసమత్యులత వల్ల శీలబ్రష్ట రుగ్మతలు తలెత్తే వకాశాలు ఉన్నాయి.

మీతోను ఆయన సఖ్యతా ఉంటున్నారుని చెప్పారు కాబట్టి నలో తప్పని సరిగా హార్మోన్ల సమస్య ఉన్నట్లు భావించక తప్పదు.

భార్యతో పాటు మరో ముగ్గురు స్త్రీలతో శారీరక సంబంధాలు కలిగి ఉన్నారంటే శృంగార ఉఆన్మదం లేదా విచన మనస్తత్వం ఉన్నట్లు అనుకోవాలి.

అయితే కోరికకంటే స్వార్థపర్తవం బలంగా ఉన్నందున ఎదుటి వారి ఉద్వేగాలను ఆసరాగా దోపడీకి పాల్పడుతున్నారు.

దీనికి మీరు విపరీతంగా ఒత్తిడికి గురై జీవితాన్ని పాడు చేసుకోవద్దు. తక్షణం మంచి సైకలజిస్టులేదా సైకియాట్రిస్తును కలవండి.

కేవలం దృక్పథం, ప్రవర్తనాలోపమైతే కౌన్సిలింగ్‌తో సరిదద్దవచ్చు. ఒకవేళ సెక్స్‌మ్యానియా ఉన్నట్లు అయితే సైకియాట్రిస్టు చికిత్సతో నయమవుతుంది.

ముందు మీరు సైకాలజిస్టును కలిసికౌన్సీలింగ్‌ తీసుకోండి. ఒత్తిడి, ఉద్వేగాలతో నుంచి బయటప పడండి, మీ వారిని అనునయించికౌన్సిలింగ్‌కు లేదా చికిత్స చేయిస్తే శృంగార ఉన్మాదం తగ్గిపోతుంది.

  • డాక్టర్‌ ఎన్‌.బి.సుధాకర్‌రెడ్డి, సైకాలజిస్టు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/