ర్యాంకుల మోజు.. సృజనాత్మకతకు లేదుచోటు

Discuss Ideas oft Children

క్వార్టర్లీ పరీక్షలకు విద్యార్థులు సిద్ధపడుతున్నారు. పరీక్షలు అయ్యాక వారికి దసరా సెలవ్ఞలు ఆరంభమవ్ఞతాయి. వేసవి సెలవ్ఞల తర్వాత పదిరోజులు సెలవ్ఞలు వ్ఞండడం వల్ల విద్యార్థులు హాయిగా ఎంజా§్‌ు చేస్తారు. కేవలం పదిరోజులు మాత్రమే కాబట్టి ఈ సమయంలో కొన్ని ఉపయోగపడే పనులను చేసుకుంటే విద్యార్థులకు సజనాత్మకతతోపాటు మానసిక పరిణిత లభిస్తుంది. పండుగ సందర్భంగా చాలామంది సొంత గ్రామాలకు వెళ్తారు. దసర, సంక్రాంతి పండుగ సందడి అంతా గ్రామాలు, పల్లెలోనే అధికంగా ఉంటుంది. ఆటపాటలతో పాటు కొన్ని ఇతర పనులను కూడా చేయవచ్చు. హైస్కూల్‌ విద్యార్థులకైతే ప్రాజెక్టు వర్క్‌, రైటింగ్‌ వర్క్‌, అసైన్‌మెంటు వంటి కొన్ని హోంవర్క్‌ను ఇస్తారు. కెజీ, బాచ్‌పానీ వారికి అయితే అంతగా ఇవ్వరు.
సరే పుస్తకాలతో కుస్తీని కాస్త పక్కనపెట్టి వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసే ప్రయత్నం చేయండి. చదువు ముఖ్యమే. కానీ మానసిక పరిపక్వతకు కళలు తోర్పడతాయి అనేది వాస్తవం.

ఈకాస్త సమయంలోనైనా వారికి ఉన్న అభిరుచిని గుర్తించి, కాస్త ప్రోత్సహించే ప్రయత్నం చేయండి. ‘చిన్ని పసిబుర్రలో ఎన్ని ఆలోచనలో అంటూ ఒక్కోసారి పిల్లల్లో ఉన్న సజనాత్మకతకు మురిసిపోతూ, మరొకవైపు ఆశ్యర్యపోతూ ఉంటారు తల్లితండ్రులు. నిజమే పసివయసులో వారికి ప్రత్యేకించి సజనాత్మకతను నేర్పనవసరంలేదు. వారే అనేక ఆలోచనలకు పునాది వేస్తారు. ఆ పసిమనసు మెదడులో ఎంత ఆలోచనా శక్తి ఉందో ప్రతి తల్లికీ తెలిసే ఉంటుంది. అయితే వారిలోని కళలకు ప్రోత్సాహం ఒక్క పొగడ్తకో, ముద్దుల వర్షంతో ముంచెత్త డానికో పరిమితమై పోకూడదు. వారి సృజనాత్మకతకు ఊతమివ్వాలి. అప్పుడే వారిలోని కళ ఇంటిల్లి పాదికీ కళను తెస్తుంది.

విద్యార్థిగా పరిచయం కాకముందు నుంచే ఇంట్లో వాతావరణం, ప్రోత్సాహాన్ని బట్టి చాలామంది చిన్నారుల్లో అనేక కళలు ఉట్టి పడుతుంటాయి. ఇంటిదగ్గర అప్పటికే చదువుకుంటున్న వారిని చూసి వారి పలక, పుస్తకాలను లాక్కుని పిచ్చిగీతలు గీయడంతో తమ చేతివ్రాత ప్రస్థానాన్ని మొదలుపెడతారు ఈ బుడతలు. ఈ వయసులోనే ఒక్కోసారి ఊహించని రీతిలో వారికి ఆడుకోవ డానికి కొని ఇచ్చిన బొమ్మల రూపాలను గీయాలని చూడటం, ఇంట్లో ఉన్న చిన్నచిన్న వస్తువులతో ఏదో రూపాన్ని తయారు చేయడానికి ప్రయత్నించటం చేస్తుంటారు.

ఇవే పిల్లల్లో సజనాత్మకతను గమనించడానికి ప్రధానమైన ఆధా రాలు అంటున్నారు నిపుణులు. ఇక్కడినుంచే వాళ్ళకళలకు పదును పెట్టడం కూడా అంత కష్టంతోనూ, ఖర్చుతోనూ కూడుకున్నది కాదు అంటున్నారు. కావలసిందల్లా వారిని కాస్త దగ్గరగా గమనిస్తూ మరికాస్త శ్రద్ధ జోడించడం.
అలా కాకుండా…
ఏదైనా కాగితంపై గీతలు గీస్తుంటే చాలు ‘ఏ§్‌ు…ఏంటి ఆ పిచ్చిగీతలు, అన్నీ నాశనం చేస్తున్నావ్‌ అంటూ పెద్దగా అరుపులు వినిపిస్తాయి. నిజానికి పిచ్చిగీతలకు, బాపు బొమ్మకు తేడా తెలియదు వారికి. ఆమాటకొస్తే ఎంత గొప్ప చిత్రమైనా రూపుదిద్దుకోవలసింది ప్రధానంగా గీతతోనే కదా! అందరితో ఆడుకోవలసిన అంత చిన్న వయసులోనే ఏదో చేయడానికి ప్రయత్నిస్తున్న ఆ పసివారిలో, అదేదో చేయ కూడని పని అనే ముద్రను ఎందుకు వేయడం? అలాంటి సమయంలో వారికి బొమ్మకు, పిచ్చిగీతలకు తేడా చూపించే ప్రయత్నం చేయండి.

వారు పెట్టిన గీతలకే బొమ్మరూపం తెచ్చి చూపించండి. వారి ఆలోచన మరింత ముందుకు నడుస్తుంది. అంతేకాదు మంచిమంచి బొమ్మలు, చిత్రాలు వారికి సులభంగా అర్థమయ్యేవి తెచ్చి ఇవ్వండి. ఇవి కొత్తకొత్త ఆలోచనలు చేసే బుల్లి మేధావి మెదడుకు సాయం చేస్తాయి. కాస్త ఎదిగే కొద్దీ వారు వేస్తున్న చిన్న చిన్న పెయింట్స్‌ ఎంతో ఆలోచింపజేసేవిగా అంతకుమించి అందంగా కూడా ఉంటాయి.

అలాంటివాటిని బాగుందమ్మా అంటూ పక్కన పెట్టడం అలవాటు. కానీ ఇలాంటి వాటిని చక్కగా ఫ్రేమ్‌ కట్టించి ఇంట్లో గోడకు అమర్చితే అది చూసిన ప్రతిసారీ వారికి ఇంకా మంచి పెయింట్‌ వేయాలనో, ఇంకా మంచి కళాకతిని తయారు చేయాలనో అనిపిస్తుంది. ఇంటికి వచ్చిన బంధువులు, స్నేహితులు వాటిగురించి అడగటం మీరు చెప్పడం, వాళ్లు మీ చిన్నారులను మెచ్చుకోవటం ఇవన్నీ వారికి మంచి ప్రోత్సాహాన్నిచ్చే టానిక్‌లా పనిచేస్తాయి. ఇంట్లో గది గోడలకు నిండుదనాన్ని, గదికి అందాన్ని ఇస్తాయని అప్పుడప్పుడూ బజార్లో చిత్రపటాలు కొంటూ ఉంటారు. కానీ ఆ ఖర్చు కంటే తక్కువ ఖర్చుతోనే మీ పసివాళ్ల కళాఖండా లకు ఫ్రేమ్‌లు కట్టిస్తే రెండు విధాలా మంచిది.

వాళ్లలో సజనాత్మకతను పెంపొందించే (అందుబాటులో ఉండే వస్తువులతో చేసిన) కళాకతులు ఏవైనా తెచ్చి వారికి బహుమతిగా అందజేస్తే వాటినుండి ఎన్నో కొత్త ఆలోచనలను స్వీకరిస్తారు పసివాళ్లు. అందుకే వారి చేతుల్లో రూపుదిద్దుకున్న దేన్నీ అశ్రద్ధగా పక్కన పడేసే ప్రయత్నం చేయకుంటే మంచిది.
ప్రస్తుతం మార్కెట్లో వస్తున్న వస్తువులన్నీ చిత్రలేఖనం, మంచిమంచి హస్తకళలతో మెరుగులు దిద్దుకొని వస్తున్నాయి. గ్లాసు దగ్గరనుంచి ప్లేటువరకు, గడియారం దగ్గరనుంచి టేబుల్‌ ల్యాంప్‌ వరకూ అన్నింటిలోనూ హస్తకళల ఉనికిని చాటే సామాగ్రి ఎక్కువగా వస్తోంది. ఇది కూడా మీ పిల్లల కళలను ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుంది. చేయవలసిందల్లా ఇంటికి సంబంధించి ఏదైనా సామాగ్రి కొనేటపుడు కాస్త ఆలోచించి, చిన్నారుల అభిరుచులకు దగ్గరగా, ప్రోత్సాహకరంగా ఉన్న వాటిని కొంటే చాలు. మంచి పెయింటింగ్స్‌, హస్తకళలతో రూపుదిద్దుకున్నవి కొంటే నిత్యం వాటి అవసరం ఉన్న పిల్లలు వాటిని గమనిస్తూనే ఉంటారు. అచ్చం అలానే మరొక వస్తువుపై వేసే ప్రయత్నమూ చేస్తారు.

దానికి మీరు ప్రత్యేకించి వారిని ఉత్సాహపరచవచ్చు. క్రమేపి ఇంట్లో ఉన్న వస్తువులపై మీ పిల్లల కళా నైపుణ్యం దర్శనమివ్వటానికి ఎంతో కాలం పట్టదు. అది వారికి భవిష్యత్తును ఇచ్చే మంచి వత్తిగా మారినా ఆనందమే కదా! మీరు వెళ్లే ఫంక్షన్‌లకు వారే మంచిమంచి గిఫ్ట్స్‌తయారు చేసి ఇస్తే ఎంత సంతప్తిగా ఉంటుంది. మంచి కవర్‌ డిజైన్లు ఉన్న పుస్తకాలు, రంగులు నింపేందుకు సిద్ధమైన బొమ్మల పుస్తకాలు, బొమ్మల తయారీకి ఉపయోగపడే విడివిడి భాగాలు వంటివి అప్పుడపుడు కొని వారికి అందిస్తోంటే అంతకు మించిన అందమైన వాటిని వారు మీకందిస్తారు.

అయిపోయిన ప్లాస్టిక్‌ డ్రింక్‌ బాటిల్స్‌, రంగురంగుల కాగితాలు, దళసరి అట్టకలిగిన స్వీట్‌ బాక్స్‌లు, గిఫ్ట్‌బాక్స్‌కు చుట్టిన డిజైన్‌ పేపర్లు లాంటివి అవతల విసిరేయకుండా మీ బుల్లి పరిశోధకులకు ఇచ్చి వాటి ఉపయోగాన్ని అర్థమయ్యేలా చెబితే ఎన్నో అద్బుతాలు చేస్తారు. మిమ్మల్ని అబ్బురపరుస్తారు.
అందరు పిల్లలు పెయింటింగ్‌పై మోజును పెంచుకోరు. కొందరికి గిటార్‌ అంటే ఇష్టం, ఇంకొందరికీ కీబోర్డు, మరికొందరికి నాట్యం, సంగీతం ఇలా దేనైనా ఇష్టపడవచ్చు. వారికి దేనిపై ఇష్టం ఉందో ముందుగా గ్రహించాల్సింది తల్లిదండ్రులే. ఆదిశగా వారిని ప్రోత్సహించేందుకు ప్రయత్నించాలి. అవసరమైతే ప్రత్యేక తరగతులకు పంపి, వాటిపై అవగాహనతోపాటు, ఆయారంగాల్లో రాణించేందుకు ప్రయత్నిస్తే సరి.
సంగీతం మనకెందులే, అది ఉన్నతకులాలకు చెందినవారికే అని ఎ.ఆర్‌.రెహమాన్‌ తల్లిదండ్రులు అనుకుని ఉంటే గొప్ప సింగర్‌గా ఆయన మనముందు ఉండేవాడు కాడు. చదువ్ఞ..చదువ్ఞ..అంటూ వారిలో ఉన్న సృజనాత్మకతను, మానసిక వికాసాన్ని అడ్డుకోవద్దు.