ఆధ్యాత్మికత వాస్తవరూపం ఏమిటి?

om
om


ఆధ్యాత్మిక ఉద్యమం 1936-1937 సంIIలోనే చాలా కొద్దిమంది సభ్యులతో సత్సంగంగా ఆరంభమై సర్వ ఆత్మలను ఒక దగ్గరకు చేర్చింది. నిరాఖారు జ్యోతిబిందు స్వరూపుడైన పరమాత్మ శివబాబా ఆజ్ఞానుసారం పరమపిత బ్రహ్మబాబా దీనిని ఆరంభించారని చెబుతారు. ప్రజాపిత బ్రహ్మబాబా పూర్వం దేశానికి స్వతంత్య్రంరాని రోజులవి. భారతావని విదేశీ దాస్య సృంఖలాల విముక్తి కోసం ఉదృ తంగా ఉద్యమిస్తున్న రోజులవి. వైడూర్యాలు వ్యాపారం చేస్తూ కోట్లకు పడగలెత్తిన వ్యాపారి. వ్యాపారం పట్ల ఎంత శ్రద్ధాశక్తులు ఉన్నాయో, భక్తి విశ్వాసాలు, ఆచార సాంప్రదా యాలపట్ల, పూజాది కార్యక్రమా లపట్ల విశేష శ్రద్ధ కనబరిచేవారట. సకల అష్టఐశ్వరాలు, పంచభక్ష పర మాన్నాలు తినగలిగే స్థాయి అయినా కేవలం సాత్విక జీవనాన్ని అలవ రుచుకున్న సాధుశీల. నిరాడంబరుడు. బ్రహ్మబాబా అని అంటారు. 60వ ఒడిలో బడ్డ బ్రహ్మబాబాకు పరమపిత పరమాత్మ శివ్ఞని ద్వారా అలౌకిక సాక్షాత్కారం లభించింది. ఆ సమయంలోనే భూతకాలంనాడు జరిగిన వినాశనంతోపాటు, భవిష్యత్‌, వర్తమాన కాలాదులను తన దివ్యజ్ఞాన నేత్రం ద్వారా చూడగలిగిన రాజర్షి బ్రహ్మ బాబా రాబోయే ప్రపంచం యొక్క రూపురేఖలు చూసినట్లు చెప్తారు నూతనయుగం ఆరంభానికి ముందే ఒక వినూత్న ఆధ్యాత్మిక ఉద్యమానికి శ్రీకారంచుట్టారు. ఎవరి ద్వారా ఐతే ఒకవర్గం బంధికా బడి, చిక్కుకున్నదో, వారి విముక్తి కోసమే వారిలో ఉన్న ఆత్మశక్తిని జాగృతం చేసేందుకు, యోగ విద్యద్వారా రాజయోగాన్నిలో శిక్షణ నిచ్చేందుకు సిద్ధం చేశారు. యోగం ద్వారా సిద్దించే ఫలాన్ని తొలుత మాతలకు, కన్యలకు, చిన్నారులకు, వెనకబడ్డ వారికి, సంపన్నవర్గాలకు సైతం సరళతరమైన సాధన ప్రక్రియను అందించిన కృషీవలులు బ్రహ్మబాబా. ఈ క్రమంలో నూతన ప్రపంచమంటే సత్యయుగమని అది ప్రేమ, పవిత్రలతో కూడిన ప్రపంచమని అంటారు. ఈ ప్రపంచాన్ని ఆవిష్కరించేందుకు తన సరస్వాన్ని త్యాగం చేశారని అంటారు. ఉద్యమం ఆరంభించిన తొలినాళ్ళలోనే సవాళ్ళను ఎదుర్కోక తప్పలేదు. సవాళ్ళను ఎదుర్కొనేందుకు సంసిద్ధుడైన పరమపిత బ్రహ్మ అహింస ద్వారానే సమర్ధవంతంగా ఎదుర్కొవాలని నిర్ణయించారు. తద్వార దివ్యజ్ఞానాన్ని దివ్యత్యాన్ని పొందారు. అది అసాధారణం అద్భుతం, అద్వితీయ, అనిర్వచనీయమని అది మాటలకు అందని దివ్య అనుభూతిగా వర్ణిస్తారు బ్రహ్మకుమారీలు. అధ్యాత్మిక విప్లవానికి ఆధారం ఆధ్యాత్మకత ఆత్మసంబంధమైన అంశాలను విశ్లేషించడం ఆత్మికరసంబంధమైన, మౌలిక సూత్రాలద్వారా మాత్రమే ప్రపంచానికి ప్రేమభావన వసుదైక కుటుంబ భావనను ప్రపంచ మానవాళికి అందించిన ఆధ్యాత్మికవేత్త ప్రజాపిత బ్రహ్మ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ స్థాపన జరిగిందని విశ్లేషకుల అభిప్రాయం. ఆధ్యాత్మికత, ఆత్మికభావన అన్న పదాలు భారతదేశానికి కొత్తకాదు. వాస్తవానికి ఆధ్యాత్మికత వాస్తవరూపం ఏమిటి? వ్యక్తిమనసు, మాటకర్మ, తనువ్ఞ, ధనం. శ్వాస సమయం, శక్తిద్వారా మార్చే ప్రతిఫ లాన్ని వ్యక్తికి, వ్యవస్థను సమాజాన్ని కళ్యాణకారకం కాగలదన్నది బ్రహ్మబాబా ప్రగాఢమైన విశ్వాసం. ఉదా:- మొత్తం శరీరంపై దృష్టిపెట్టనిదే సమస్యను తెలుసుకోలేం. సమస్యను తెలుసుకోకుండా వైద్యం చేయడం సాధ్యమా? సమస్య మూలాన్ని కనుక్కున్నప్పుడే, సమస్యా త్మకభాగాన్ని తొలగించగలం, అతికించ గలం. సాధ్యంకా నపుడు విడిచిపెట్టడం తప్ప మరోమార్గం లేదు. ప్రజాపిత బ్రహ్మబాబా ప్రపంచంలోని ప్రతి ఒకవ్యక్తిలో సంపూ ర్ణమైన శాంతిని పవిత్రతను పావనమైన ఉన్నతమైన సద్గుణాలతో కూడిన వ్యక్తిత్వాన్ని పెంపొందించేందుకు తాను ఒక అద్భుతమైన మానవీయమూర్తిగా చేసిన కృషి శ్లాఘనీయం. సవ్యమైన ఈశ్వరీయజ్ఞానం, సహజరాజయోగాన్ని పునర్జీవింప చేయడం ద్వారా కామ, క్రోధ, లోభ, మోహ అహంకారం వంటి వికారాలను ఇంద్రియ నిగ్రహంద్వారా జయించే సులభమైన మార్గం తెలియచేశారు. స్వరాజ్యానికి అధికారులుగా రాజధిరాజులుగా తీర్చిదిద్ది విశ్వమానవాళిని మేల్కొల్పిన రాజర్షి. ఆధ్యాత్మిక విప్లవం యొక్క విత్తనం బాల్యంనుండే మనసులో పెంచి పోషించడం ద్వారా ప్రహ్లాదునిలా ఉత్తమకార్యాలు చేయగలరు అన్నదే ప్రజాపిత బ్రహ్మబాబా విశ్వాసం. ప్రపంచంలో ఎందరో ధర్మమూర్తులు వచ్చారు.
ఎన్నో ఉపదేశాలు ఇచ్చారు. ధర్మస్థాపన జరిగింది. కాని స్త్రీల దాస్య శృంఖలాలు తెంచి ఆమెను, స్త్రీలలో ఉండే ఆధ్యాత్మిక శక్తులను గుర్తించి వారిని ప్రపంచ సేవలో నియోగించకపోవడంపై దృష్టి సారించిన ప్రజాపిత బ్రహ్మ. భిన్నమైన వృక్షాలమధ్య ఒకే చందనపు చెట్టును ఎలా గుర్తించ గలమో అదేవిధంగా ప్రపంచంలోని స్త్రీలలో ఉత్తమ గుణాలుగల స్త్రీ, దేవతాస్త్రీలు ఎవరు అన్న ప్రశ్నకు బ్రహ్మకుమారీలే అన్న సమాధానం చెబుతారు.