భగవంతుడే యోగక్షేమాలను చూస్తాడు

Lord Vishnu
Lord Vishnu

ప్రారబ్దవశాత్తు లభించిన దానితో తృప్తి చెందాలి. జీవ్ఞడు గతంలో నాటిన కర్మబీజాలే వర్తమానంలో ఫలిస్తూ ఉన్నాయి. సంచితకర్మలే ఈ జన్మలే ప్రారబ్ద ఫలాలుగా అందుతూ ఉన్నాయి. లేనిది రాదు. ఉన్నది పోదు. ఈరోజు చూస్తూ ఉన్నదంతా గతంలో చేసినదే. ఈరోజు పురుషార్థంతో ఏదైతే చేస్తూ ఉన్నామో దానిని ఆగామిగా భవిష్యత్తులో చూడబోతాము.

కర్మఫలప్రదాత పరమాత్మ కనుక కర్మఫలాలు ప్రసాదాలు. ప్రసన్నతను కలిగించేదే ప్రసాదం కనుక కర్మఫలాలను అందుకోవడంలో ప్రసన్నత నిండాలే కానీ పరితాపం ఉండకూడదు. జీవితంలో ఏది అందినా అది కర్మఫలమే. భుజించే ఆహారం కూడా కర్మఫలమే కనుక యాదృచ్ఛికంగా, ప్రారబ్దవశాత్తు ఏది లభించినా మనిషి దానితో సంతృప్తి చెందే సదలవాటును పెంపొందించు కోవాలి. ఆకలి వ్యాధిగా సంక్రమించిందే కాని సుఖాను భవానికి ద్వారము కాదు. వ్యాధికి కావలసింది మందు కాని విందు కాదు. కాబట్టి ఆకలి అనే వ్యాధికి ప్రారబ్దవశాత్తు ప్రతిదినము లభించిన భిక్షను పరమాత్మకు నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించాలి. ఈవిధంగా దేహానికి ఆకలిబాధ తీరుతుంది. చిత్తానికి ప్రసన్నత చేకూరుతుంది. ఆశించినవన్నీ రావ్ఞ. అర్హత ఉన్నవే వస్తాయి. స్వల్పమైన, అల్పమైన కర్మలకు అనంత మైన ఫలం రాదు. కర్మకు ఫలితం వస్తుందే కాని ఆశకు ఫలితం రాదు. ఆశలు పెంచుకుంటే ఆశలతో పాటు ఆవేదనలు పెరుగుతాయి కాని ఆనందం చేజిక్కే అవకాశం లేదు. ఎప్పుడు, ఎవరికి, ఏది, ఎలా అందివ్వాలో సర్వజ్ఞుడైన భగవంతుడికి తెలుసు. పక్షిపిల్ల పడుకోవడానికి మెత్తని గూడు కావాలని తల్లిపక్షికి తెలుసు. అందుకే కట్టెపుల్లలతో కాక గడ్డిపరకలతో, కొబ్బరిపీచుతో మెత్తని గూడు తయారుచేస్తుంది. పక్షికే ఇంత జ్ఞానమున్నప్పుడు అనంతుడైన భగవంతుని విషయం ఏమని చెప్పాలి? అన్నీ ఉండి, అందరూ ఉండి, రేపు ఎలా జరుగుతుందో అని బెంగపడేవారే అందరూ. కానీ, అందరినీ వదలి, అన్నిటినీ వదలి, వట్టి చేతులతో ఒక జోలెను తగిలించుకొని ప్రపంచంలోకి ప్రవేశించిన సాధువ్ఞకు ఏ భయమూ లేదు. ఎందుకని? అతనికి ఒక్క విషయం క్షుణ్ణంగా తెలుసు. తాను ఇంటికి దూరంగా పోతూ ఉన్నాడే కాని భగవంతుడికి దూరంగా పోవడం లేదు. తాను ఎక్కడ కదిలినా ఆకాశంలోనే కదులుతూ ఉన్నాడు. కనుక తాను ఇంట్లో ఉన్నా ఆయనే పోషిస్తాడు. ఎక్కడకు వెళ్ళినా ఆయనే పోషిస్తాడు. ఇది సాధువ్ఞకు ఉండే అందమైన అవగాహన. ఇద్దరు సాధువ్ఞలు ఉండే వారు. మొదటి సాధువ్ఞ అందరి యోగక్షేమాలు వహించేది భగవంతుడే అనే దృఢమైన భక్తి కలవాడు. కనుక అతని దగ్గర డబ్బు ఉంచుకునేవాడు కాదు. రెండవ సాధువ్ఞ డబ్బు అవసరం ఎరిగినవాడు.