నిజాయితీగా వ్యాపారం చేయాలి

MASZID
MASZID

మనుషులు చేసే వ్యాపారం వారు తలచుకుంటే అది స్వర్గానికి దారి చూపుతుంది. లేకుంటే అదే వ్యాపారం నరకానికి తీసుకుపోయే మార్గంగా తయారవుతుంది. ఒక వ్యాపారి సత్యంగా, దేవునిమీద భక్తి తో తన వద్దనున్న సొమ్ముతో నిజాయితీగా వ్యాపారం చేసినవాడు ప్రళయదినాన ప్రవక్తలు, మహనీయులు, సత్యవంతులుగా వీర స్వర్గ మలంకరించిన వారి వరుసలో ఉంటాడు. అందరూ వ్యాపారం ఒక వృత్తిగానే భావిస్తారు. మనిషి తన మనుగడకోసం, తన జీవనం కోసం వ్యాపారం చేస్తున్నాడు. ఇది ధార్మిక సంబంధం కాని సమస్య అని అనుకుంటున్నాడు. కానీ మహనీయ ప్రవక్త(స) బోధనల వల్ల వ్యాపారం అనేది కూడా ఒక సత్యమైన, ఒక నిబద్ధమైన విషయం అని తెలియజేయబడింది. ఒక నీతి నిజాయితీ గల వ్యాపారి, ఒక ఉన్నతాశయం గల వ్యాపారి, ఒక నిబద్ధమైన వ్యాపారి పైన చెప్పబడిన ఉత్తమ వ్యక్తుల సరసన ఉంటాడు. అలాగే కొందరిలో నీతి, ధర్మం ఉండదు. కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా ఉంటారు. వారు అధిక ధరలతో డబ్బు గుంజేవారు, మోసగించి, వంచన చేసి, అబద్దాలు చెప్పి, అధిక ధరలతో దగా చేసి, ప్రజలకు నష్టం కలిగించేవారు మాత్రం పాపిష్టివారిలో, దుర్మార్గుల్లో చేరిపోతారు. ఈరెండు విధాలైన వారిని కలిపి చూస్తే మనకు విషయం బాగా అర్థమవ్ఞతుంది. మనిషి తలచుకుంటే ఈ వ్యాపారం స్వర్గానికి చేరుస్తుంది. లేకుంటే ఇదే వ్యాపారం నరకానికి మార్గమౌతుంది. ఈ విషయాలన్నీ కేవలం వ్యాపారం కోసం ప్రత్యేకం కాదు. ప్రపంచంలో ఎన్ని పనులున్నాయో అది ఉద్యోగమే కావచ్చు, వ్యాపారమేకావచ్చు, వ్యవసాయమే కావచ్చు, మరింకేదైనా పనికావచ్చు. వాటి అన్నింటిలోనూ ఈ విషయమే అర్థమవ్ఞతుంది. మనిషి దీన్ని ఒకవైపు చూస్తే ప్రాపంచికం, మరోవైపు చూస్తే అది ఆధ్యాత్మికం కావచ్చు కూడా.అన్నం తినడం కూడా ఒక ఆరాధనే. మనిషి భోజనం చేస్తున్నాడంటే అతడు తన ఆకలిని దూరం చేసుకునేందుకు భోంచేస్తున్నాడు. అయితే అన్నం తినేటప్పుడు ఈ సంకల్పం చేసుకోవాలి. దైవం నా మనస్సు మీద నాకు హక్కును ప్రసాదించాడు. నా స్వభావం మీద నాకు హక్కుంది, నా శరీరం మీద నాకు హక్కుంది, ఈ హక్కును నిర్వర్తించేందుకు అన్నం తింటున్నాను. ఎందుకు తింటున్నానంటే దైవం నాకు అన్నం ప్రసాదించాడు. ఆ దైవ ప్రసాదితమైన అన్నాన్ని ఆరగించి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకునేందుకు ఆహారాన్ని ఆరగిస్తున్నాను. ఆ అన్నమే నా కోర్కెలను తీర్చుకునే ఒక మార్గంగా భావించి, ఆకలి తీర్చుకునే ఒక సాధనంగా దాన్ని భావించటం వలన ఆ భోజనమే ఆరాధనగా అయ్యింది. కొనుగోలు చేయడానికి బజారు వెళితే ప్రతిచోటా వినియోగదారుడు మోసానికి గురవుతున్నాడు. ఏది కొన్నా తూనికలో, కొలతలో తక్కువగా ఇవ్వటం జరుగుతోంది. శాంపిల్‌ ఒకటి చూపి, సప్లై మరొకటి చేస్తున్నారు. పేరుకు ‘తూనికలు కొలతలు అనే ప్రభుత్వశాఖ వ్ఞన్నా లాభం లేకపోతోంది. ఈ సందర్భంగా దివ్యఖుర్‌ఆన్‌ ఏనాడో హెచ్చరించింది. ‘తూనికలలో తగ్గించి ఇచ్చేవారికి వినాశం ఉన్నది. వారు ప్రజల నుండి తీసుకునేట ప్పుడు పూర్తిగా తీసుకుంటారు. వారికి కొలిచిగాని తూచిగాని ఇచ్చేట ప్పుడు తగ్గించి ఇస్తారు. ఒక మహాదినం నాడు వారు బ్రతికించి తీసుకురాబడనున్నారని వారికి తెలియదా? ఖుర్‌ఆన్‌ 83:1-6 మనసులో దైవభీతి, పరలోకభీతి లేనివారు మాత్రమే ఇలాంటి అక్రమాలకు పాల్పడతారు. ఆనాడు వారు లెక్క ఇవ్వటానికి తమ ప్రభువ్ఞ సమక్షంలో హాజరైనపుడు చెమట మనుషుల సగం చెవ్ఞల దాకా నిండిపో తుందని హదీసుల ద్వారా తెలుస్తోంది.

– షేఖ్‌ అబ్దుల్‌హఖ్‌