డిజైనర్ జాకెట్టు

Designer blouses

ఈ కాలంలో కూడా అమ్మాయిలు చీరపై మోజు పెంచుకుంటున్నారు. చీరలకు వేసుకునే బ్లవుజ్‌లు ట్రెండీగా ఉండేలా ఎంచుకుంటున్నారు. సంప్రదాదాయ సొగసులకి ఆధునిక సొబగులు అద్దిన నయా ట్రెండ్‌ ఇండో వెస్ట్రన్‌ బ్లవుజ్‌లు. అమ్మాయిలు ప్రస్తుతం డీప్‌నెక్‌లో గుండ్రటి మెడ, లేదా స్క్వేర్‌, వీనెక్‌లో కాకుండా ఇండోవెస్ట్రన్‌ తరహాలో ఉండేలా చూసుకుంటున్నారు. రఫుల్‌, పెప్లమ్‌, బెల్‌, జాకెట్‌, బోట్‌నెక్‌, వంటి డిజైన్లు. నూలు చీర నుంచి పట్టు చీర వరకూ ఏది కట్టుకున్నా సరే! అలా కొత్తగా ఎంచుకోవడమే హాటెస్ట్‌ ట్రెండ్‌ అని అంటున్నారు.

మెడ కాస్త వెడల్పుగా ఉన్నవారికి కుచ్చిళ్లతో చైనీస్‌ కాలర్‌, హైనెక్‌ వంటివి బాగుంటాయి. కాలేజీలకు, సెమినార్‌లకు, ఆఫీసులకు వెళ్లే వారికి ఇవి బాగుంటాయి.
వీటిల్లో పొట్టి చేతులే కాదు. స్లీవ్‌లెస్‌ కూడా అందంగా ఉంటాయి. ఇప్పుడు యువతను కట్టిపడేస్తున్న డిజైన్‌లలో రఫుల్‌ బ్లవుజ్‌ ఒకటి. బోట్‌నెక్‌ బ్లవుజ్‌కి రఫుల్‌ స్లీవ్స్‌ ఒకరకమైతే, బ్లవుజంగా రఫుల్స్‌ వచ్చేలా ఎంచుకోవడం మరో శైలి. ఇది కాస్త సన్నగా ఉన్నవారికి బాగుంటుంది. ఇవి కాలేజీ పార్టీలు, పుట్టినరోజులు, సంగీత్‌ వంటి వేడులకు బాగుంటాయి.

ఆర్గాంజా, నెట్‌ వస్త్రాలు ఈ డిజైన్‌లకు బాగుంటాయి. క్రేప్‌, షిఫాన్‌, బ్రాసో, నెట్‌, చేనేత రకాల చీరల మీదకు ఇలాంటివాటిని ఎంచుకోవచ్చు. కేవలం భుజాల వరకే కాకుండా మోచేతివరకు కూడా కుట్టించు కోవచ్చు.
రపుల్‌ డిజైన్‌ని ఎంచుకున్నప్పుడు మెడ కూడా భిన్నంగా ఉండేలా చూసుకోవాలి. బ్లవుజుల్ని స్లీవ్‌లెస్‌ ఎంచుకోవాలి అనుకున్నప్పటికీ కొందరు వేర్వేరు కారణాలతో వేసుకోవడానికి ఇబ్బంది పడతారు. ఇలాంటివారు కేప్‌ బ్లవుజ్‌ల్ని ప్రయత్నించవచ్చు.

ప్లెయిన్‌ చీరమీదకు ఫ్లోరల్‌ కేప్‌ బ్లవుజ్‌ లేదా హ్యాండ్‌లూమ్‌ చీరకు జతగా ఎంబ్రాయిడరీ కేప్‌ బ్లవుజ్‌ వంటివి బాగుంటాయి.
సింగిల్‌, డబుల్‌, ఎసెమెట్రికల్‌ కేప్‌ డిజైన్లు శరీరాకృతిని బట్టి ఎంచుకోవచ్చు. హ్యాండ్‌లూమ్‌ చీరల మీదకు పెప్లమ్‌ బ్లవుజ్‌లు అదిరిపోతాయి. సన్నగా పొడుగ్గా ఉండేవారికి ఈ బ్లవుజ్‌లు నప్పుతాయి. వీటిల్లో చీరను బట్టి పొట్టి పొడవు రకాల్ని కుట్టించుకోవచ్చు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/